ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ..
ఏదో తరగని పయనాన్ని నాలోనే నేను వెతుక్కుంటూ..
అనుక్షణం.. గెలుస్తూ.. ఓడిపోతూ.. ఆగక..నీకోసం
పరిగెత్తుతున్న మనస్సును అదుపులో పెట్టలేక
దానికే అనుక్షణం అర్పించుకుంటూ..
ఒక యోగిలా.. పిచ్చివాడిలా.. రాయిలా.. రాలే చినుకులా..
నాలోనే... నాతోనే.. నేనే..ఏకాంతంలో వెర్రిగా నాలో నేను నవ్వుకొంటూ
నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..
ప్రపంచం ఒంటరైపోతుంది.