మది అలోచనలు అల్ల కల్లోలం చేస్తున్న క్షంనంలో నన్ను నేను తడుముకుంటున్న క్షణాల్లో మొగ్గతొడిగిన ప్రేమలో ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉందిఆ క్షణంలో విచ్చుకున్న పువ్వు ఇప్పటికి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందివ యస్సు తెచ్చిన ధైర్యమో, వైరాగ్యము అనుభవమో కథలు కథలు గా నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది
మూగ బోయిన మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనసస్సు
మంచు పూల పల్లకిలోఅందంగా ముస్తాబయిన హేమంతంలా నువ్వు ని సోయగాలతో నా మనసునునీకోసం తడుముతూనే ఉంది ఇప్పటికీ..
అప్పటి నిజ్ఞాపకాలు గింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది..కానీ అది భ్రమ అని తెలిసి వేదన పావలా ఉప్పొంగు తూనే ఉందిఏ మని వర్ణించనూ..? నిన్ను ఎలా మర్చి పొయానని చెప్పను నా ప్రేమనుయ ఆకాశం నుండి నుంచి జారిపడిన ముత్యపు బిందువులు వేకువఝాములోపూ లకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్యంలా ని ప్రేమ
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడినిమసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టుప్ర తిక్షణం ని ఆలోచనలు ఇప్పటికీ నన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వేధిస్తున్నాయి