. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, April 27, 2020

నన్ను గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
ఏ కాంతి తీగలూ వంచలేను..వెతకలేను
తడి కంటి కాంతి ఇప్పటికేకనురెప్పలు
నిన్ను ఇప్పటికీ వెతుకుతూనే వున్నాయి

నామనస్సు గాయాలకి
ఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన నీ పాదాల క్రింద
విధి అరిగిపోయింది...
నా జీవితం నలిగి పోయింది
నన్ను నేను మర్చిపోయాను
ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు
ఏ ఊహల్లో కూడా నీవే తచ్చాడుతున్నావు
నాది కాని నీపై నాకు ఏ హక్కు లేదు
కాని ఎందుకో మనసు నీకోసం
తడుముకొంటూనే వుంది
నీకోసం ప్రతి క్షనం తపన పడుతూనే వుంది

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
జ్ఞాపకాళు తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
జార విఢిచి వెతుకూనే వున్నా
ఇకనైనా నా తోడు కావాలి.
మనసు కోరుతూనే వుంది
మది ఇప్పటికీ నిన్నే తలస్తూ వుంది
నేనోడిపోయాను..నీ జోడు కావాలి
నిన్నెన్నటికీ పొందలేను
నేవు ఎప్పటికీ నాదానివి కాదు
నేను ఓడి పోయాని దారునంగా
గెలవలేను అని తెల్సు
నీవు గెలిపించడానికి సిద్దంగా లేవు
నేకు ఇష్ట మైన వాల్లు గెలవాలి
వాల గెలుపు లో నా వోటమి నీకు కావాలి
నీకు నా ఓటపిలో ఆనందం వుంది
నా పతనం కోరుకుంటూన్న నీ మనసు
కోరిక తీరాలి అందుకే తలవొంచాను
నా తల తెగ గొట్టాలని చూస్తున్నా
మౌనంగా మనసు లో భాదను భరిస్తూ
ఎన్నాలని భరించను నేను మనిషినే కదా
ఓడి పోయాను గెలవలేనని తెల్సి
గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

నిజం నురగలు గక్కుతొంది

నిన్నటి నుంచి
మనసు మదనపడుతోంది
కలం కలవరపడుతోంది
నిజం నురగలు గక్కుతొంది
తాగిన సిరాతో నురుగులు కక్కుతోంది
నా మనసును
కదిలించినా విదిలించినా
నీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి
చెదిరిన కల ఇంకా నన్ను
కల్వరపెడుతూనే వుంది
పగలంతా పలవరింతలు
వెక్కిరిస్తున్నాయి
రాత్రంతా కలవరింతలు
కవ్విస్తూ నవ్విస్తున్నావు
ఉలిక్కిపడీ లేచేసరికి
అంతా బ్రమ అని తెలుతుంది
పువ్వుల్లా కురిసే అక్షరాలు
ఇప్పురు రాల్లు రువ్వుతున్నాయి
అభ్యుదయాన్ని పలికించే నీ భావాలు
నా నీడను కూడా కాదంటున్నాయి
మనసు ప్రతిసారి
పదాల్లో పులకరింతల్ని
నింపమంటే ..నీకోపంతో
రగిలే అగ్ని కీలలను
రువ్వుతూ నన్ను
ప్రతిక్షనం తగలబెడుతున్నాయి
అపురూపమైన అందమైన నీ జ్ఞాపకాలు

నిశ్శబ్దం..

నిశ్శబ్దం..నాకు నమ్మకమయిన నా నేస్తం
నిశ్శబ్దం..నా నిజమైన బలం
నిశ్శబ్దం..నా ఆత్మ విశ్వాసం
నిశ్శబ్దం..నన్ను దెబ్బతీసిన అనువిస్పోటనం
నిశ్శబ్దం..నా దుక్కాన్ని పెంచే మౌనహోష
నిశ్శబ్దం..నా జీవిత కాలమంత శాస్వితం
నిశ్శబ్దం..అదో అక్షరం కు అందని భావం
నిశ్శబ్దం..అక్షరీకరించలేని అలుపెరుగని వాస్తవం
నిశ్శబ్దం..అవమానపు అగ్నీకీలలో మౌనం
నిశ్శబ్దం..కాలి బూడిదైపోయిన ఓ జ్ఞాపకం
అందుకే ఈ నిశ్శబ్దం నా అంతరంగపు ఆత్మగోష.నీవు అర్దం చేసుకొంటే.