నిన్నటి నుంచి
మనసు మదనపడుతోంది
కలం కలవరపడుతోంది
నిజం నురగలు గక్కుతొంది
తాగిన సిరాతో నురుగులు కక్కుతోంది
నా మనసును
కదిలించినా విదిలించినా
నీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి
చెదిరిన కల ఇంకా నన్ను
కల్వరపెడుతూనే వుంది
పగలంతా పలవరింతలు
వెక్కిరిస్తున్నాయి
రాత్రంతా కలవరింతలు
కవ్విస్తూ నవ్విస్తున్నావు
ఉలిక్కిపడీ లేచేసరికి
అంతా బ్రమ అని తెలుతుంది
పువ్వుల్లా కురిసే అక్షరాలు
ఇప్పురు రాల్లు రువ్వుతున్నాయి
అభ్యుదయాన్ని పలికించే నీ భావాలు
నా నీడను కూడా కాదంటున్నాయి
మనసు ప్రతిసారి
పదాల్లో పులకరింతల్ని
నింపమంటే ..నీకోపంతో
రగిలే అగ్ని కీలలను
రువ్వుతూ నన్ను
ప్రతిక్షనం తగలబెడుతున్నాయి
అపురూపమైన అందమైన నీ జ్ఞాపకాలు
మనసు మదనపడుతోంది
కలం కలవరపడుతోంది
నిజం నురగలు గక్కుతొంది
తాగిన సిరాతో నురుగులు కక్కుతోంది
నా మనసును
కదిలించినా విదిలించినా
నీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి
చెదిరిన కల ఇంకా నన్ను
కల్వరపెడుతూనే వుంది
పగలంతా పలవరింతలు
వెక్కిరిస్తున్నాయి
రాత్రంతా కలవరింతలు
కవ్విస్తూ నవ్విస్తున్నావు
ఉలిక్కిపడీ లేచేసరికి
అంతా బ్రమ అని తెలుతుంది
పువ్వుల్లా కురిసే అక్షరాలు
ఇప్పురు రాల్లు రువ్వుతున్నాయి
అభ్యుదయాన్ని పలికించే నీ భావాలు
నా నీడను కూడా కాదంటున్నాయి
మనసు ప్రతిసారి
పదాల్లో పులకరింతల్ని
నింపమంటే ..నీకోపంతో
రగిలే అగ్ని కీలలను
రువ్వుతూ నన్ను
ప్రతిక్షనం తగలబెడుతున్నాయి
అపురూపమైన అందమైన నీ జ్ఞాపకాలు