. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 15, 2017

ఆత్మహత్య ఎందుకు తప్పు?

ఎవరు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా దానికి బలమైన మానసిక, శారీరక, సాంఘీక కారణం ఉంటుంది. వారి స్తానంలో ఉంటే తప్ప వారి మానసిక సంఘర్షన ఎవరికీ అర్ధం కాదు. అది అర్ధం కాకుండా వాళ్ళను విమర్శించడం, వాళ్ళు చేసేది తప్పు అండం వారిని అవమానించడమే. వారి స్తానంలో ఉంటే ఈ విమర్శకుడు అలానే చేసేవాడేమో. వారిస్తానంలోకెళ్ళి ఆలోచించడి (put yourself in their shoes). నన్ను నేను వారిస్తానంలో ఉంచి రాయడానికి ప్రయత్నిస్తున్నా. విశ్లేషణలోకి వెళ్ళేముందు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మానసిక పరిస్తితిని వివరిస్తూ ఎవరో రాసిన నాలుగు మాటలు

   WHEN TEARS DON'T STOP FLOWING FROM EYES,AND NO ONE APPEARS TO BE OWN,  WHEN DEATH APPEARS BEAUTIFUL THAN LIFE,  A PERSON IS FORCED TO COMMIT SUICIDE.



ఆత్మహత్య తప్పు అనేవాళ్ళకు నేను వేసే ముక్కుసూటి ప్రశ్న, ఆత్మహత్య ఎందుకు తప్పు? ఈ ప్రశ్నకు మాత్రం ఇదమిద్దంగా ఎవరూ సమాధానం చెప్పరు. కొందరు తప్పు అంతే అంటారు; ఇంకొందరు పుట్టించింది భగవంతుడు ప్రాణం తీసె హక్కు నీకు లేదు అంటారు; మరి కొందరు దేవుడు నిన్ను పుట్టించాడు అంటే దానికి ఓ కారణం ఉంది అందుకు బ్రతకాలి అంటారు; ఇలా వీళ్ళు ఇచ్చే ఏ ఒక్క సమాధానం సంతృప్తికరంగా ఉండదు. వీళ్ళ దగ్గర కారణం అంటూ ఉండదు. అది తప్పు అనే ఓ నిర్ణయం ఉంటుంది దాన్ని మనం పాటించాలి, ప్రశ్నించకూడదు, ప్రశ్నించడం తప్పు. వీళ్ళ గురించి ఆలోచించడం వృధా. ఇక  ఇంకొంతమంది కాస్త తార్కికంగా నువ్వు చనిపోతే x, y................. వాళ్ళంతా బాధపడతారు, నువ్వుపోయి వాళ్ళను బాధ పెడతావా అంటారు. ఇది వినడానికి కాస్త సరైనదే అనిపించినా, ఎవరో బాధపడతారు అని బ్రతకాలా? అలా బ్రతికిన బ్రతుకులో తను అంటు లేనప్పుడు ఆ బ్రతుక్కి అర్ధం ఏంటి? ఈ లోకంలో ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఊరేగడాని రాలేదు కదా. ఇవ్వాళ ఆత్మహత్య చేసుకోకున్నా కాలప్రభావం వళ్ళ పోతే ఆనాడూ ఈ x, y, z, ....... లు బాధ పడతారు కదా. మరి అది ఆత్మహత్య చెసుకోవడానికి అడ్దంకి ఎందుకు కావాలి. ఎన్ని చెప్పినా వీళ్ళ జవాబు ఒక్కటే నీకు చనిపోయే హక్కు లేదు, దేవుడే చంపాలి. సరె, ఈ విషయం మీదే మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అన్ని పనులు చేసేది దేవుడే మనం నిమిత్తమాత్రులం అంటారా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారా? ఈ ఆత్మహత్య మాత్రం దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా, శివుడాజ్ఞలేకుండా జరుగుతుందా? దైవజ్ఞ/శివుడాజ్ఞలేకుండా ఏదైనా జరగగలదా? పోనీ, నిమిత్తమాత్రులం కాదు, పని మనం చేస్తాం, మనం చేసే పనికి శిక్ష ఉంటుంది అంటారా? ఎవరో ఎకడో శిక్ష విదిస్తారు అని ఇక్కడ, ఇప్పుడు ఈ జీవితంలో శిక్ష అనుభవించడానికి ఒప్పించగలమా? అందుకే ఆత్మహత్య తప్పు లేక ఒప్పు అనలేము. వారి వారి పరిస్తితుల ప్రకారం అది వారికి తప్పో ఓప్పో అనిపించవచ్చు. దాన్ని కాదు అనే హక్కు మనకెక్కడుంది? ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు. చాలామంది చావు పుట్టుకలు మన చేతిలో లేవు అంటారు. పుట్టుక మనచేతిలో లేదు, నిజం. బ్రతికి ఉండటం మనచేతిలో లేదు, నిజం. అలాగే చావడం మనచేతిలోనే ఉంది. అదీ నిజం, ఎవరొప్పుకున్న కోకున్నా నిజం.



ఇది అంగీకారయోగ్యం కాదు అందుకే తప్పు అంటారా? ఎవరికి అంగీకార యోగ్యం కాదు? చట్టానికా న్యాయానికా? చట్టనికి న్యాయానికి అంగీకారయోగ్యం కానిది నేరం. ప్రతి నేరం తప్పవ్వాలని నియమమేమీ లేదు. అయినా చనిపోతా అనుకున్నవాడికి చట్టం ఏంటి న్యాయం ఏంటి? ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కారుణ్య హత్యలు (euthanasia) లేవా? అవి చట్టబద్దం కావా? అవి కేవలం నివారణ లేని రోగాలున్నవారికే, ఆ శారీరక బాధ భరించలేనివారికే అంటారేమో. ఓ.. అంటే మీ ఉద్దేశంలో శరీరానికి కలిగే బాధే బాధా? మనసుకు కలిగే బాధ బాధ కాదా? శరీరానికి కలిగే బాధ తొలగించడానికి కారుణ్యహత్య (euthanasia)  సమర్ధనీయమయితే మనసుకు కలిగే బాధను నివారించడానికి కూడా కారుణ్యహత్య (euthanasia) సమర్ధనీయం కావాలి. కారుణ్యహత్య (euthanasia), ఆత్మహత్య రెండూ వేరు అంటారా? ఊహూ.. ఆ వాదనను నేను ఒప్పుకోను. ఆత్మహత్య అంటే తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకోవాడం. కారుణ్యహత్య (euthanasia)లో కూడా రోగి తనను తాను తన ఇచ్చాపూర్వకంగా చంపుకుంటాడు దానికి పక్కవాళ్ళ సహాయం తీసుకుంటాడు. కనుక ఇది కూడా ఆత్మహత్యలో ఒకరకమే అంటాను. మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే జీవించను అనే హక్కు కూడా ఉండాలేమో. తను ఉండాలా పోవాలా అన్న నిర్ణయం తీసుకునే హక్కు ప్రతిఒక్కరికి ఉండాలేమో. అయితే ఆ నిర్ణయం ఏ క్షనికావేశంతో తీసుకున్నదో కాక కనీసం ఓ ఆరునెలలు ఆలొచించి తీసుకున్నదయ్యుంటే దాన్ని వ్యతిరేకించనవసరం లేదేమో.



ఇక దీనికితోడు సలహాలిచ్చేవాళ్ళు, వీళ్ళు సలహాలిస్తున్నారో లేక అసలే మానసికంగా బాధ పడుతున్నవాళ్ళను అవమానిస్తున్నారో నాకైతే అర్ధం కాదు. కొందరేమో ఆత్మహత్య పిరికివాళ్ళ చర్య నువ్వు పిరికివాడివా, చేతకానివాడివా అంటారు. ఇంకొంతమంది చావడానికి చాలా ధైర్యం కావాలి, అందులో కొంతైనా బ్రతుకుని బాగుచేసుకోవడానికి వాడుకుంటే హాయిగా బ్రతుకొచ్చు అంటారు. అసలే మానసికంగా బాధల్లో ఉన్నవాళ్ళకు ఇవి రుచిస్తాయా? నిజానికి చావడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా బ్రతకడానికే ప్రయత్నిస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన ప్రకారం, "జన్మ జన్మల్లో చావును చుసిన జీవుడికి చావు అంటే భయం" అందుకే ప్రతి ప్రాణిలోని జీవుడు బ్రతకాలనే చూస్తాడు. అంతటి బ్రతకాలనే కోరికను ఎదురించి చావాలని చూస్తున్నవాడు ఎంతగా అలోచించుంటాడు? ఎదో క్షణికావేశంలో అత్మహత్య చేసుకుకోవాలని చూస్తున్నవాళ్ళను వదిలేస్తే మిగతావాళ్ళు ఈ సలహా ఇచ్చేవాళ్ళకన్నా ఎక్కువే ఆలోచించి ఉంటారు. ఇంకొంతమంది చావు సమస్యకు పరిష్కారం కాదు అని ఉచిత సలహా ఇస్తారు. ఎవరి సమస్యకు పరిష్కారం కాదు? పోయేవాడి సమస్యకా లేక పోగామిగిలినవాళ్ళ సమస్యకా? మనిషి పోయాక వాడికి ఈ సమస్యే ఉండదు కనుక చావు సమస్యకు పరిష్కారం కాదు అనడంలో అర్ధం లేదు. పోగామిగిలినవాళ్ళ సమస్య అంటారా? దానిగురించే ఆలోచిస్తేవాళ్ళు ఆత్మహత్య ప్రయత్నమే చేయరు. ఈ సలహాకు అర్ధమే లేదు. ఇంకో చెత్త సలహా. నీకు జీవితమంటే ఇష్టంలేదు సరె సమాజానికి ఉపయోగపడు, సమాజ సేవ చెయ్యి, నలుగురు అనాధలను దత్తత తీసుకుని పోషించు వాళ్ళకు ఆనందాని పంచు. ఎవరైన తనదగ్గర ఉన్నదే పక్కవాళ్ళకు ఇవ్వగలరు. వాళ్ళ దగ్గరే ఆనందం లేకుంటే ఇంక పక్కవాళ్ళకెలా ఇస్తారు? ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం ఆ మనిషిని ఇంకా రెచ్చగొట్టడమే అవుతుంది కానీ తన ఆలోచనను ఏ మాత్రం దూరం చేయదు.



ఆత్మహత్యను మతం అంగీకరించదు అంటారా? అవును, ఆత్మహత్య ధర్మబద్దం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు, దాన్ని వేదం నిషేధించింది. మనుస్మృతి ఆత్మహత్య చేసుకున్నవాళ్ళకు కర్మకాండను నిషేధించింది. ఎందుకు నిషేధించింది ఇందులో వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓ సమాధానం తోస్తుంది. మానవ జన్మ చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కానీ ఈ జన్మ లభించదు. ఈ జన్మను మోక్ష మార్గంలో ప్రయాణించడానికి వినియోగించుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం, నీ ఆద్యాత్మిక ప్రగతిని నిరొధించడమే. కర్మను ఎక్కడైతే వదిలేసి వెళ్తున్నారో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఈ వాదన కూడా రుచించే వాదన కాదు. వాళ్ళు సరే అలాగే కానీ నాకేంటీ నష్టం అంటే మీ సమాధానం? అదీ కాక ఈ ప్రపంచంలో ఎంతమంది మానవ జన్మను సద్వినియోగ పరుచుకుంటున్నారు? ఎందరు ధర్మ బద్దంగా జీవిస్తున్నారు? డబ్బు, సుఖం, మోహం, అహం, పేరు, ప్రతిష్ట మొ|| తప్ప ఈ ప్రపంచంలో ఎంతమందికి ధర్మం కావాలి? అసలు ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ప్రాపంచిక సుఖాలకోసం వెంపర్లాడే వీళ్ళంతా మానవ జన్మను సద్వినియోగంచేసుకుంటున్నారా? ప్రపంచంలో ధర్మబద్దం కానీ జీవనం జీవిస్తూ మానవ జన్మ దుర్వినియోగపరుచుకుంటే ఒప్పా? అదే ఆత్మహత్య చేసుకుని దుర్వినియోగపరుచుకుంటే తప్పా? రెండు దుర్వినియోగమే అయినప్పుడు రెంటిలో పెద్ద తేడా లేదు.



పోనీ మన పురాణల్లో ఆత్మహత్య చేసుకున్న/చేసుకోవలనుకున్న మహాపురుషులు లేరా? ఉన్నారు అంటాను. వారెవరో పరిశీలిద్దాం. పరిశీలించేముందు ఆత్మహత్య అంటే నా నిర్వాచనం చెప్తా. ఆత్మహత్య - తనను తాను చంపుకోవడం. సహజ సిద్దంగా లేదా బాహ్యప్రక్రియల వళ్ళ కాక తనకు తానుగా తన ఇచ్చానుసారంగా తనను తాను చంపుకోవడం. మళ్ళీ దానిని సమర్ధించడానికి కారణాలు వద్దు. సమర్ధించడానికి కారణాలు వెతికితే ఆత్మహత్య చెసుకోవలనుకుంటున్నవాళ్ళదగ్గర కూడా ఉంటాయి బోలెడన్ని కారణాలు. (నా పురాణ పరిజ్ఞానం కేవలం మిడిమిడి జ్ఞానమే, తెలిసి తెలియని విషయాలమీద నేను ఏమైనా తప్పులు చెప్పుంటే ఆ తప్పును ఎత్తిచూపండి సరిదిద్దుకుంటా)



ఆత్మ హత్య చేసుకున్న పురాణ పురుషుల్లో (పురుష - హృదయంలో నివసించే) మొట్టమొదటిగా నేను చెప్పేపేరు ఆదిపరాశక్తి పార్వతీ దేవి. సతీదేవి దక్షయజ్ఞం సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన కాలి బొటనవేలితో అగ్నిని రగిల్చి అందులో దూకింది. దానికి కారణం తన తండ్రి అయిన దక్షుడు తన భర్త శివున్ని అవమానించాడని. అలా దూకడాన్ని శాస్త్రం ధర్మం అంగీకరించాయి. అంటే తనని (లేదా తనవాళ్ళను) ఎవరైనా అవమానిస్తే, ఆ అవమాన భారాని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం అంగీకారయోగ్యమా? ఇది దైవలీల అన్న సమాధానం మాత్రం వద్దు, లీల ప్రశ్నించే ప్రశ్నకు సమాధానం చెప్పదు, పారిపోతుంది. ఇక రామాయణంలో వేదవతి రావణుడు తన కురులను ముట్టుకున్నాడని అగ్నిలో దూకింది. దీన్ని కూడా శాస్త్రం ధర్మం అంగీకరించాయి. ఎందుకు అంగీకరించాయి? అలాగే పురణాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాళ్ళను పరిశీలిస్తే, భరతుడు తన అన్న రాముడు 12 ఏళ్ళ తరువాత రాకుంటే అగ్నిలో దూకుతా అంటాడు. అదీ ఆనాటి ప్రాజ్ఞ సమ్మతమే. రాముడు వచ్చాడు కనున భరతుడు ఆత్మహత్య చేసుకోలేదు లేకుంటే చేసుకునేవాడే. హనుమంతుడు లంకలో సీతను చూసేవెళ్తాను, చూడలేకుంటే అగ్ని దూకుతా అనుకున్నాడు. అదీ అందరికీ అంగీకార యోగ్యమే. వాళ్ళ కారణాలు సమర్ధనీయం అనుకుంటే, వీళ్ళ కారణాలు సమర్ధనీయమే. నిన్న మొన్నటివరకు భారత దేశంలో ఒక సాంఘీక నియమంగా, ధర్మంగా ఆచరించబడ్డ సతీసహగమనం? మహాభారతంలో మాద్రి సతీ సహగమనం చేయలేదా? అది ధర్మబద్దమని అంగీకరింపబడలేదా? తన ఇష్టప్రకారం సతీసహగమనం చేయడం ఆత్మహత్య కాదా? ఇవ్వన్నీ చూస్తే నాకు ఓ అనుమానం వస్తుంది. అగ్నిలో దూకి ఆత్మ హత్య చేసుకోవడంలో తప్పులేదా? అది ధర్మబద్దమా?



మరి ప్రాయోపవేశం సంగతో? ప్రాయోపవేశం ఆత్మహత్య కాదా? మహాభారతంలో దుర్యొధనుడు అవమాన భారాన్ని భరించలేక ప్రాయోపవేశం సంకల్పిస్తాడు. అది ఆనాటి ప్రాజ్ఞులకు సమ్మతమే. అయితే శకుని తనమాయటలలో ఆ ప్రయత్నాన్ని విరంపింపజేస్తాడన్నది వేరే విషయం. అవమానభారం భరించలేక దుర్యోధనుడు ప్రాయోపవేశం సంకల్పించాడు, అవమానభారం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది. అవమానభారం భరించలేక ఆత్మహత్య.. సమ్మతమా? ప్రాయోపవేశానికి ఎన్నో నియమాలూ, పద్దతులూ. ఫలానా కారణాలు ప్రాయోపవేశానికి (ఆత్మహత్యకు) అంగీకరానీయం మిగతావి కాదు అన్న వాదన నాకు నచ్చదు. ఒక కారణం అంగీకరయోగ్యం అయితే వేరే కారణం కూడా అంగీకారయోగ్యం కావాలి. ఎవరి కారణం వారిది. అయితే, ప్రాయోపవేశంలో నాకు నచ్చిన విషయం, ప్రాయోపవేశి ఒక్క క్షణంలో చనిపోకుండా, కొంత కాలంపాటు ప్రాయోపవేశం చేసి మరణిస్తాడు. ఈ కాలంలో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం లభిస్తుంది, తను ఈ జీవితంలో పూర్తిచేయక మిగిలిపోయిన పనులు పూర్తిచేయడానికి సమయం లభిస్తుంది. అదీకాక తన వాళ్ళందరికి, సమాజానికి ఇతని చావు గురించి మానసికంగా సంసిద్ధమవడానికి అవకాశం లభిస్తుంది. తను నిజంగా  మరణించిన్నాడు అది వాళ్ళను అంతగా విభ్రాంతికి గురిచేయదు తెలిసిన విషమే కనుక.



ఎంత విశ్లేషించినా ఆత్మహత్య తప్పే. అంతే అంటారు అందరు. ఎవరికి తప్పు? చేసుకునే వాళ్ళకా, చూసే వాళ్ళకా? చేసుకునే వాళ్ళకు మాత్రం తప్పు అనిపించదు, చూసేవాళ్ళకు తప్పు అనిపించొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవాడికి నువ్వు చేసేపని తప్పు అని చెప్పడం తప్పా అంటే, నేను ముమ్మాటికి తప్పే అంటాను. ఆత్మహత్యా ప్రయత్నం మానిపించే ప్రయత్నం తప్పు కాదు, అది అభినందనీయం కానీ. వాళ్ళతో నువ్వు చేస్తున్నది తప్పు అని వాదించడం తప్పు. ఈ భూప్రపంచంలో ఎవరితో అయినా, ఏ విషయంలోఅయినా నువ్వు చేస్తున్నది తప్పు అని చర్చ ప్రారంభిస్తే ఎవరూ మీ మాటను వినరు, మీ అభిప్రాయాన్ని పట్టించుకోరు. ముందు మీరు వాళ్ళును అర్ధం చేసొండి. వాళ్ళు ఆ మానసిక పరిస్తితుల్లో తీసుకున్న నిర్ణయం సరైనది అని మీరు ముందుగా అంగీకరించడి. మిమ్మల్ని వాళ్ళ స్తానంలో ఉంచండి (put yourself in their shoes). మీరు వాళ్ళ స్తానంలో ఉంటే అంతకన్నా భయంకర నిర్ణయం తీసుకునేవాళ్ళేమో, ఎవరికి తెలుసు. ఈ నిజం అంగీకరించాక మాత్రమే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించండి. అనుక్షణం వాళ్ళ నిర్ణయం సరైనదే అని అంగీకరిస్తూ, వాళ్ళ మానసిక పరిస్తితి అర్ధం చేసుకొండి. అప్పుడు మీకు అర్ధమవుతుంది వాళ్ళను బాధించే పరిస్తితులు ఏంటో. అది సంఘానికి సంబంధించిందా, మిత్రులకు సంబంధించిదా, చుట్టూ ఉన్న పరిస్తితులకు సంబందించిందా? మీకు చేతనయితే వాటిని పూర్తిగా మార్చడానికి ప్రయత్నించండి, అవి మారితే తను మారొచ్చు. ఓ మనిషి ఆత్మహత్యకు ప్రయత్నించాడంటే వాడికి జీవితం మీద ఆశలేదు. ఎందుకులేదో కనుక్కొండి, ఆశను చిగురింపజేయడానికి ప్రయత్నించండి. అంతే కానీ నువ్వు చేసేది తప్పు అని ఉపన్యాసలు దంచడమో, లేక ఎవరినో తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించడమో చేస్తే వాళ్ళకు విరక్తి ఇంకా పెరుగుతుంది.



ఇక ఆత్మహత్య చేసుకుందామనేవాళ్ళకు, మీ పరిస్తితులేంటో నాకు తెలియదు. అందుకే మీ నిర్ణయం తప్పు అని అనను. ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఏ నిర్ణయమైన తీసుకోవడానికి సంపూర్ణ స్వేచ్చ ఉండాలని నమ్మేవాన్ని నేను, అందుకే మీ నిర్ణయాన్ని తప్పు అనను. కానీ ఒక్కటి ఆలోచించండి, మీ నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నదా? ఈ ప్రపంచంలో ఏదీ ఎల్లకాలం ఉండదు కొన్నాళ్ళ తరువాత ఏదైన వెళ్ళిపోతుంది, పరిస్తితులు పూర్తిగా మారిపోతాయి. మిమ్మల్ని బాధ పెడుతున్న విషయానికి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కావలసిన సమయం ఇచ్చారా? లేదంటే సమయం ఇచ్చి చూడండి. అన్ని చేసిన తరువాత కూడా మీరు చనిపోవాలనే నిర్ణయించుకున్నారా? అయితే మీరు మీ నిర్ణయాన్ని ఒక ఆరునెలలు వాయిదా వేసుకొండి. ఓ నెల పాటు పునర్విమర్శ చేసుకొండి. అయినా మీ నిర్ణయం మారకుంటే ప్రాయోపవేశంలో నాకు నచ్చిన ఒక్క విషయాన్ని పాటించండి. అందరికి నేను పోతున్నా అని ఓ అయిదు నెలలు చెప్పండి. దానితో చుట్టూ ఉన్న అందరికి మానసికంగా సంసిద్దమవడానికి అవకాశం లభిస్తుంది. మీరు పూర్తి చెయ్యాల్సిన పనులేమైన ఉంటే పూర్తిచెయ్యండి ఆ తరువాత మీ నిర్ణయం మీది. ఈ ఆరు నెలల తరువాత మీకు మీరు చేయాలనుకున్న పని సరైనదే అనిపిస్తే మీ ఇష్టం. దానికి అవును కాదు అని చెప్పడానికి ఎవరు అర్హులు కారు.


పుట్టుక అనేది దేనికి మొదలు కాదు, చావు అనేది దేనికి అంతం కాదు. చావు పుట్టుకలు సంసార చక్రం (జనన మరణ చక్రం)లో  ఊచల్లాంటివి మాత్రమే.

Thursday, March 9, 2017

--- ప్రతిసారి ఓడిపోతూ గెలుస్తూనే ఉన్నాం " జర్నలిష్టుగా" చావలేక బ్రతుకుతూ -----


 

పోరాడి గెలవానలే ఆరాటం
ఉరుకుల పరుగుల జీవితం
పరుగుల్లో పడ్డా లేచినా
అడిగేవారు లేరు
అందరు మీడియా అంటే కడగాలని చూసేవారే
మాదారి ముళ్ళదారి అని మాకే తెల్సు
అయినా గోదారిన్ ఒడ్డున సేదతీరాలనే
అత్యాస తీరక పరుగులు పెడుతూ
ఆరాట పడుతూనే ఉంటాం
తప్పదు పొట్టతిప్పలు
ఓవైపు పోటీ పడి ముందుండాలనే తపన లో
మా మనసులతో మేమే తన్నుకు చస్తున్నాం
అందరు వెలెత్తే చూపిస్తే .. సమాజాన్ని
జరుగుతున్న వాస్తవాల్ని చూపించేది ఎవరు
చూడాల్సిన వాళ్ళూ చూస్తూ వూరకుంటే
నీవు నిజాలు తెల్సుకునేది ఎప్పుడు
ఒక్కోసారి నిజం నీడై మమ్మల్ని వెంటాడుతుంది
సమాజానికి సమాదానం చెప్పుకోలేని నిజాన్ని ఒప్పుకోలేక
ఓ చుక్క గొంతులోకి దిగితే గాని అలుపు తీరదు
అయినా అది శాశ్వితం కాకపోయినా
ఆకాస్తసమయానికి .. ఊరట
తెల్లారుతుంటే మళ్ళీ మొదలౌతుంది మాపరుగు
మీ చేతిలో రిమోట్ ఆడుతుంటే
ఒకచోట నేను పరుగులుతు తీస్తే
మరో చోట మా మిత్రుడు పరుగులు తీస్తాడు
అప్పటికప్పుడూ వేడి వేడి వార్తలు మికిచ్చేందుకు
తప్పదు మాది జీవన పోరాటమా
జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

Saturday, March 4, 2017

చిన్న నిశ్శబ్దానికే గుండె బారం అవుతోంది

ఆ పలకరింపు ..తియ్యని పులకరింపై
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా వచ్చినట్టే వచ్చి
కనుచూపుమేరకు తరలిపోయింది
నాలోతట్టుకోలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు
హృదయంలో నీ జ్ఞాపకాల అలజడి
మీరెవరన్నా విన్నారా?
ఒయ్ నిన్నే నీకూ వినిపిస్తుందా
నాకనిపిస్తోంది  నిశ్శబ్దమే బాగుంది కదా
నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటావా
కాదని అనగలవా అంత టైం ఉందా నీకు

రాత్రుళ్ళు అందరూ
ఊహా  లోలకానికి అతుక్కుపోయినట్టున్నారు
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక
గాడితప్పిన గతం సాక్షిగా
ఒకనాటి ఒప్పులన్నీ తప్పులయ్యాయిగా

ఏంటో ఈ చల్లని వెన్నెల చీకట్లో
నా నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
ఆ చిన్న నిశ్శబ్దానికే గుండె బారం అవుతోంది
నిశ్శబ్దం చిన్న అలికిడి కూడా లేదు
చిరునవ్వుల సందడి నాకు దూరం
అయింది నన్నొదిలి దూరంగా

నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాజుని నేనే, దాసున్ని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోయి
సముద్రంలో చిక్కుకున్నాను
విరహవలయంలో చిక్కుకున్నా
చింద్రం అయిన మనస్సులో
ఏన్నో ఆలోచనల సుడులు
నాకు నేనుగా ..
ఓడిపోయిన ప్రస్తుతంలో
ఒంటరిగా జీవింఛలేక
ఇంకా నీపై  ఆశచావక
ఎదురు చూస్తూనే ఉన్నా నీకోసం