ఎన్ని నిశ్శబ్దాలు
మాట్లాడుతున్నా
ఎన్ని నిరాశలు
నిన్ను కమ్మేస్తున్నా
ఎన్ని నిస్పృహలు
నీలో మనిషిని వెతుకుతున్నా
ఏకాంతం ఎందుకో
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది
నిదానించమని
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా
అల్ల కెరటాలు కలలతో కవాతుచేస్తున్నా
ఆటుపోటులు తో
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి
దిగులు దిగులుగా
దిగమింగేస్తున్నా
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి
కొన్ని జ్ఞాపకాలు మనసుకు
గాట్లుగా మిగులుతాయి
కొన్ని నీడలు
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి
మాట్లాడుతున్నా
ఎన్ని నిరాశలు
నిన్ను కమ్మేస్తున్నా
ఎన్ని నిస్పృహలు
నీలో మనిషిని వెతుకుతున్నా
ఏకాంతం ఎందుకో
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది
నిదానించమని
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా
అల్ల కెరటాలు కలలతో కవాతుచేస్తున్నా
ఆటుపోటులు తో
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి
దిగులు దిగులుగా
దిగమింగేస్తున్నా
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి
కొన్ని జ్ఞాపకాలు మనసుకు
గాట్లుగా మిగులుతాయి
కొన్ని నీడలు
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి