
అలలా జీవితాంలోకి వచ్చి కలలా మిగిలిపోయా వెందుకు..
నీ ఆలో చనలు గుండెల్లో అలజడులు రేపుతుంటే..
నేనో మనిషిని ఉన్నానని నీకు అస్సలు గుర్తుండదు కదా ..?
గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు...
అంత గొప్ప స్నహం కాదు కదా నాది ...
నీ ధ్రుష్టిలో నాకు విలువ లేదని తెల్సు..
ఉంటే ఇలా ఎందుకు చేస్తావు మిత్రమా
నా కలల్ని కల్లలు చేసి కన్నీళ్ళెందుకు మిగులుస్తావు..
కొన్ని కలలు ఇంకా వేదిస్తున్నాయి...కవలర పెడుతున్నాయి..
కనిపించని నీకోసం ఎక్కడని వెతకను ప్రియా..
నా గుండెల్లో గూడు కట్టుకొన్న నిన్ను ..
ఒకడు బలవంతంగా గూడును కూల్చి మోడుగా మార్చి నిన్నెత్తుకెళ్ళాడు..
ఆ గడ్డం బూచాడు వస్తున్నాడన్నప్పుడే ఎందుకో మనస్సులో కవలవరం మొదలైంది..
నీవు నామనస్సులో గూడు కట్టుకొని వున్నా ఎవడేం పీకలేరు అనుకున్నా..
వాడొచ్చిన రోజు నీ విచ్చిన దైర్యం మనస్సుకు ఊరట నిచ్చింది..
కళ్ళు మూసి తెరిచే లోపు అంతా జరిగి పోయింది..ఏం జరుతుగుందో అర్దంకాలేదు
జరగాల్సింది అంతా జరిగి పోయింది...నా మనస్సులో చెదిరిన గూడు నీవు లేకుండా