Sunday, February 6, 2011
ప్రేమించండి కాని ఎవ్వరూ దూరంకావద్దు అదో నరకం
ప్రేమిస్తే కవి కాని వాడికి కూడ కవిత్వం తన్నుకొస్తుంది...
ఎదుకంటే నాకు నీ పేరు తప్ప మరో పదమే గుర్తు రావట్లేదు.
పున్నమి రేయిలో చల్లని వెలుగులు చిందించే జాబిలి చుస్తే ప్రేయసి వదనం కనిపిస్తుందని...
కాని గుర్తించలేకుంది నీ రూపం నిండిన నా మనస్సు నిండా నీతలపులే
వెలుగులు నిండిన పున్నమి రేయి ఎదో... కారుచీకటి కమ్మిన అమావాస్య నిసి ఎదో.తెలవడంలేదు
ప్రేయసి నిండిన హృదయం చేసె సవ్వడి ఆమె పెరే అని...నా హ్రుదయం చెబుతోంది
కాని నాచేవులకు నీవు పలికిన తీయని మాటలుతప్ప మరేమి వినిపించుట లేదు.
ప్రేయసి ప్రియులకు వారిద్దరే లోకంలో ఉన్నట్లుంటుందని..
కాని నాకేంటో నువ్వే లోకమైపోయావు...
నేను ఉన్నట్లు నాకే తెలియట్లేదు...నాకు దూరం అయ్యాక నేనెవరో కూడా అర్దం కావడం లేదు..
ఇక నీవు దగ్గరయ్యే అవకాశం లేదని..కనీసం దూరం నుంచి కూడా పలుకరీచే అర్హత లేదని తెల్సి..ఎలా...?
ప్రేమించండి కాని ఎవ్వరూ దూరంకావద్దు అదో నరకం..అయినా అన్నీ మనచేతుల్లో ఉండవు కదా..?
Labels:
కవితలు