
నెమ్మది గా..ఇంత దూరం వచ్చాం మనం
నెమ్మది గా.ఇంత దూరం జరిగిపోయం మనం
నెమ్మది గా...భాదను బరించడం నేర్చుకుంటున్నాం
ఎవరికీ తెలీదు...మనం జీవించిన కాలగమనం ఎలా గడచిపోయిందో
ఎవరికీ తెలీదు...ఇప్పడిదాకా ఎలా బ్రతికున్నామో
ఎవరికీ తెలీదు...ఎలా జీవించామో మనం
ఎవరికీ తెలీదు...ఎందుకిలా జీవితాన్ని గడుపుతున్నామో
ఎవరికీ తెలీదు...ఎవరికోసం ఎవరు బ్రతికున్నారో
ఎవరికీ తెలీదు...నీకు నాకు ఉన్న ఆ బందమేంటో
ఎవరికీ తెలీదు...నీవు లేని నేను లేనన్న వాస్తవం
ఎవరికీ తెలీదు...ఎందుకిన్ని అవమానాలను భరిస్తున్నానో
ఎవరికీ తెలీదు...మనంగా ఉన్న ఇద్దరం నీవు,నేను గా విడిపోయామో
ఎవరికీ తెలీదు...ఒకర్ని ఒకరు చూసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నామో
ఇవన్నీ ఎవ్వరికి తెలీదు ..
తెల్సుకోవాల్సిన అవసరం లేదు...
కొన్ని నామనస్సులోని వాస్తవాలు ..
ఇన్ని రోజుల పరిచయంలో..ఇప్పటికీ నీకు కూడా కొన్ని తెలీదు..
తెల్సుకునే సమయానికి ఇద్దరం ఒక్కటిగా లేము కదా..?
ఇంకెప్పటికీ ఒక్కటయ్యే అవకాశం లేదుకదా.....?
మనం నుంచి ...నీవు, నేను గా విడిపోయి...
మళ్ళీ ఎప్పుడు..మనంగా కలుస్తామో కదా..?
మరి అప్పటిదాకా నిన్ను నిన్నుగా తెల్సుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటా......
దీనికి ఓ జీవితకాలం పడుతుందనీ తెల్సు..అయినా తెల్సుకునే ప్రయత్నాన్నిమాత్రం విరమించను