Saturday, February 4, 2012

వేదనలో ఉన్నంత ..గుండెచప్పుడు ...నీకు నాకు తప్ప

"మువ్వలు..
జలపాతాలు ...
లోలోపత గిలిగింతలు రేపే ఊసులు..
ఎచటికి పోతావి ఈ రాతిరి..ఆవలి గట్టున ఉన్న నీ కోసం..
అందుకే ...గాలి ..
సుతిమెతని గాలి...పైటను భంధించిన గాలి..
దాని ఊసే లేకుండా ...
ప్రయాణం ఎంత కష్టం..కాదు..
అందుకే ...
నువ్వు ఎన్ని అయిన చెప్పు.
.ఇంక నేనుండలేను.. "
"జీవితంలో ఏముంది ...
భాదా... సంతోషం..
అయినా ....
వేదనలో ఉన్నంత ..
ఆవేదన ...
గుండెచప్పుడు ...
ఎవరికి తెలుస్తుంది...
నీకు తప్ప ...
నాకు తప్ప..
ఎటూ పాలుపోని ఈ లోకంలో ...
ఎవరికి ఎవరూ అర్థం కారు..
అందుకే...
భాదే బహు గొప్పది అనుకుంటూ సాగిపోవటమే తప్ప.."
"అంతటా నీ రూపమే..
జగమంతా నీ నవ్వుల వనమే .
.నీ లేలేత పాదాల ..
సవ్వడికి ...
నాలో చేల రేగి పోతున్నవి నాలోని నాదాలు... "
"గాలి ..
గుండె గదిని చుట్టు ముడుతుంటే ...
వెన్నెల పెదవులను తాకుతుంటే..
ఎక్కడో ఒక రాగం గుండెను మీటుతుంటే...
నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు.. "
గుండె లోతుల్లో ...
తెలియని ఈ ఆరాటం
ఎప్పుడు పోతుందో ...
తెలియదు..అందుకే..
నువ్వు వస్తావని ...
నీ చల్లని పాదాలు కందిపోకుండా ఉండాలని
..దారి వెంట ...
పూలను పరిచాను....ఇకనైనా ...క్షమిస్తావని
- Bhaaskar Palamuru