Monday, August 10, 2015

ఒకరి మాటలు ఒకరికి వినిపించలేనంత దూరంలో ఉన్నాంగా

చించేసిన కాగితాలతో 
మాటలు పక్కకు జరిగాయి
మనసు అరలలో గతాన్ని 
పదే పదే తడుముకోవడం
నవ్వడం, ఏడ్వడం అన్నీ మర్చిపోయాను
నీలో నన్ను వెతుక్కునేందుకు
నా మనసు పడుతున్న తాపత్రయం 

ఇచ్చిపుచ్చుకోవడానికి 
మాటలే కరువయ్యాయి
ఒకరి మాటలు ఒకరికి 
వినిపించలేనంత దూరంలో 
దగ్గరవ్వాలన్నా అవ్వలేని క్షనాలను 
లెక్కబెట్టుకుంటూ నేను పడుతున్న వేదన 
నీకు తెలియలని నేననుకున్నా 
తెలుస్కోవాలని నీకు లేనప్పుడు 
నన్ను నేను నిందించుకోవడం 
గతాన్ని కత్తులుగా చేసుకొని 
నన్ను నేను గాయపర్చుకోవడం 
ప్రతిరోజు జరిగే తంతే గదా 

అయినా నాపిచ్చిగాని జరగని 
తంతుకు తపన పడటం 
చదువుతుంటే నీకు  వింతగా వుందేమో కదూ