Wednesday, April 23, 2014

భగ్గుమంటున్న ఒంటరితనం నన్ను దహించి వేస్తుంది

దహించివేసే నా ఆరాధన
నీ మనసుని రగిలిస్తుందన ..
అల్లల్లాడుతున్న నా విరహం
నీ మృదుస్పర్శ కోసం తపిస్తుందా


భగ్గుమంటున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..

నీలోకి
అవలీలగ
చొచ్చుకపొనీ ..

రమించే మత్తులో ఎదిగిన కోరికలు
పూర్తిగా లొంగిన ఈ క్షణంలో
చివరకు అచేతనంగానైనా
ఇమిడిపోనీ ..


ఎపుడూ మెరిసే నీ కనులు
ఎందుకు ఉద్వేగంగా మారుతుందో

యదలోనీ ప్రశాంతతను
తెలియని ఏ వాంఛ
నన్ను కబళిస్తుందో
  

ఇరువురి బాధలు కరిగే
ఈ ఘడియన ..
నీ తనువు చెప్పినట్టుగానే ..
ఈ రేయిని గడవనీ ..

ఈ వెచ్చటి వేదికపై
వేతన పెట్టిన కోర్కెల
ఆహుతి ఆరే దాకా సాగనీ ..

మన నిషిద్ధ ప్రేమను
నిలువెత్తు రగిలిపోనీ ..

నేను నీలో పూర్తిగా ఒదిగిపోయేదాకా
నీలో అక్యిం అయ్యేదాకా కరిగిపోనీ
ఈ విరహపు వేడిలో పూర్తిగా దగ్దం అయిపోనీ