Monday, March 17, 2014

మరణాన్ని ఊహించి ...మరణం తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను

ఒకే వ్యక్తి ప్రేమ కోసం
నా చిన్ని హృదయం
రోజు రోజుకి
మరింత చిన్నబోతుంటే
నీ జ్ఞాపకాలలలో శూన్యమైన
పండుటాకుల గుస గుస లలో
ఒక ఉత్కంఠభరితమైన 

నిట్టూర్పుతో
శరదృతువు ఇంకోసారి 

ఎర్రబడినప్పుడు
ఒంటరి రాత్రుల 

నిదురలనెందుకు లేపటం ?
నాలో నేను లేని క్షనాలను తలచుకొని
భాదపడని క్షనాలకోసం
తడుముకోవడం ఎందుకు
నిజాన్ని వెటకారం 

చేసే అబద్దానిదే  రాజ్యం
మనసు మాటలను 

తెల్సుకోలేని జీవులు
మరణాన్ని ఊహించి మరణం
తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను
జరిగే నిజాన్ని నిలదీస్తాను
అవసరాన్ని 

అందుకొన్న నిన్ను
అన్ని మర్చిపోయి
అలవాటుగానో పొరపాటుగానో

నా మనస్సు జాడ తెల్సి
నా జ్ఞాపకాలు ఎప్పుడైనా
అటుగా వచ్చినప్పుడూ 

నీపాదాలను తాకి
గుచ్చుకుంటాయేమో 

అని నాతోపాటే
నాజ్ఞాపకాలను 

ఖననం చేస్తావుకదూ
బ్రతికుండగానే నా ఎదురుగా
ఆ నిజాలన్నిటిని తగులపెట్టి
నన్ను ఒంటరిని చేసావు

నా జ్ఞాపకాలను తగులబెట్టావు
ఇన్నీ చేసిన నీకు 

మళ్ళీ నేనంటూ 
గుర్తుకు రావడమా
ప్రపంచం తల్లకిందులైనా 

నేనంటూ గుర్తుకొస్తానా
ఓ మైషిగా కాకపోయినా ..

రోడ్డుమీద కనిపించిన
ఒంటరి బాటసారిగా అయినా
అయినా ఎందుకు గుర్తురావాలి
నన్నెందుకు గుర్తుంచుకోవాలి
నానొద్దు అనేకదా 

మరొకరి చెంతకు చేరావు
నా ఊహకూడా 

నిన్ను దరిచేరకూడదనేగా
అవమాణించి .. 

బ్రతికుండాగానే చంపేశావు