Friday, December 6, 2013

నమ్మకం చేజారిపోయింది

తను కావాలంటూ 
మన్సు తడబడుతుంటే
తను నవ్విందో 

మరి పొమ్మందో
వెళ్ళలేక వదిలెళ్ళిందో
కావాలని 

వదిలించుకుందో తెలీదు
కాదనలేక అవుననలేక 

తల్లడిల్లిందో
కారానాలెతుకుతూ 

కనుమరుగైందో తెలీదు

నమ్మకం కూడా
పుడుతుందీ చనిపోతుంది.
మనిషికే తప్పని చావు..
చేజారిన నమ్మకం
మనిషి మనసున పుట్టిన
నమ్మకానికి మాత్రం తప్పుతుందా?
మనిషి మరుజన్మ నే చూడలేదు.
.పోయిన నమ్మకం త్రిగిరాదు
మరి మనసుకుంటుందా
మరో జన్మ? జీవించడానికో?

మరి నమ్మించడానికో? తేలియడం లేదు