Sunday, December 8, 2013

నేనిప్పుడు మరనించిన మృతకళేబరాన్ని

నేను పుట్టిన గడ్డపై
నక్కి నక్కి బతకాల్సిన
దీనమైన పరిస్థితి
నాలోని సంతోషాన్ని దొంగలించి
భయాన్ని బదులుగా ఇచ్చివెల్లావు
గట్టిగా నా మనసులోని
భావాన్ని చెప్పలేను
నిజాన్ని నీకు చెప్పాలనుకున్నా
మాటలు పలుకలేని 

మతితప్పిన మనిషిని
నేనిప్పుడు మరనించిన 
మృతకళేబరాన్ని

నా మెదడులోని 
ఆలోచనలను హత్యిచేసి
అనుభవాల బూడిద 

పూసుకొన్న బైరాగిని
జ్ఞాపకాల చురకత్తుకు 

గుండెల్లో గుచ్చి నీవేం సాదించావు

 నెత్తుటి మరకలు అంటిన 
అక్షరాలను ముందేసుకొని 
ఆనందాన్ని వెతకాలని 

చూస్తే అక్కరకు రాని వేదనే కనిపిస్తుంది
రాని రాలేని వసంతంకోసం 

వెక్కి వెక్కి ఏడ్చినా
వెనక్కు తిరిగి గనాన్ని 

తరచి చూస్తే భయమేస్తుంది
నిజాలనే అబద్దపు స్నేహాల 

ముగులో మోసపోయాను  

మరనించిన గతాన్ని 
తవ్వి చూడాలి అనుకొంటే
కదల్లేని స్థితిలో ఉన్న సిధిలం

అయిన నాహృదయం నన్ను వెక్కిరిస్తుంది