Saturday, December 28, 2013

ఏ కన్ను యేడ్చినా..నొప్పి గుండెల్లోనే వస్తుంది

దుఃఖం నన్ను
చిన్నచూపు చూస్తుంది!
కన్నీటి రుచియేమిటో
దుఃఖమే చెప్పేది నాకు
హృదయాన్ని కన్నీళ్లలో
నానం చేయిచేది  దుఃఖమే!
ఏ కన్ను యేడ్చినా..
నొప్పి గుండెల్లోనే వస్తుంది

.ఎంత వెతికినా 
సమాదానం దొరకడం లేదు
దుఃఖం కరిగితేనే

కన్నీరు వొలికేది.
హృదయం లో 

భాదతో ఎంత ఏడ్చినా
కన్నీరు రావడంలేదు!

కన్నీరుకు భాద 
అలవాటైంది
మస్సువేదనకు 

స్పందనే కన్నీరు..
కరిగిపోతున్న కాలాన్ని..
కన్నీరు ఆపలేకపోతోంది..
నేరం నాది కాకున్నా
నేరస్తున్ని చేస్తున్నారు..
అందరూ బలిపీఠం
ఎక్కించేందుకే 

ప్రయత్నిస్తున్నారు..
బలౌతున్నది నేను
భాద పడుతున్నది నేను..
కాల్సిన వాల్లు ..దూరం అయి
పట్టించుకోవడంలేదు..
జరిగింది తలచుకొని
జరగబోయేదానిపై 

ఆశలు వదులుకొని.
చేసేదేమీ లేదు 

నిస్సహాయంగా
ఆకాశం వైపు దీనంగా 

చూడటం తప్ప