Friday, May 3, 2013

అవమానపు నీలి నీడలు నీడలు నాగుండెను కమ్మిన ప్రపంచంలో

వెతుకుతూనే ఉన్నా 
ప్రియా ఈ రోజు కూడా ...
ఇక్కడా అక్కడా కనిపిస్తావేమో 

అన్న విఫల ప్రయత్నంలో
అవమానపు నీలి నీడలు నీడలు 

నాగుండెను కమ్మిన ప్రపంచంలో
వెలుగును మొత్తంగా   

ఇముడ్చుకున్న నీకోసం
నాలోనూ నా హృదయాంతరపు  

గదులలో  కదలికలోనూ....
కాలం మింగిన క్షణాలలోనూ 

అనుక్షనం వేదనగా నోకోసం 
తడుముతున్నా ప్రియా
నీకూ నాకూ మాత్రమే తెలిసిన
మనదైన మరువలేని ఏకాంతం లోనూ
నీ చుట్టూ నేను రాలేని నిలువెత్తైన గడ్డుగోడలు 

నీవే కట్టుకున్నావు నేను నీదరి చేరవద్దని
ఆగోడలను పగులగొట్టి నిన్ని చేరగలను
ఆగోడల పక్కనే అవమనపు చురకత్తులు
నాగుండెళ్ళో గుచ్చేలా చేసావు అయినా రాగలను
ప్రాణాలపై ఆశవదులుకున్నవాన్ని  

కాని నేను మనీషిని కదా
నాకంటూ ఓ మనస్సాక్షిఉంది దానికి 
సమాదనం చెప్పుకోలేక
నీలా నేను మనసును ఏమార్చి 

స్వార్దం నిండిన మనిషిని కాదు ప్రియా
నిన్ను నిన్నుగా ఇష్టపడి నీవెప్పుడూ 

కష్టపడకూడదని తలచే సామాన్యున్ని
నటించలేను అనుకున్నది సాదింఛడంకోసం 

నాలా నే నేనుంటా నేనింతే
మనుషుల మర్మాలను గుర్తుచేస్తూ 

కనిపించని కన్నీటి తెరలు 
నీకు కనిపించకూడదని
నేనేమో నిత్యం నలుగుతున్న 

బతుకు నిజాల మధ్య
నువ్వేమో అలుపెరుగని జీవన చట్రాల మధ్య
నీకోసం నేనూ నాకోసం నువ్వూ .......

నిన్ను గెలిపించాలంటే నేనోడిపోవాలన్నావు కదా
అందుకే ఓటమనే మదునైన 

కత్తిని గుండెల్లో నా అంతట నేనే గుచ్చుకొని
నేను ఈ లోకం వీడీ నీకు ఇబ్బంది లేకుండా

దూరంవెలుతున్నా  ప్రియా నీసంతోషం కోసం