Friday, May 10, 2013

మెరుస్తూ ..... మురిపిస్తూ " నను ఏకాకిని చేసి

నా అందమైన ఊహాలోకంనుండి నీ స్వప్నం కరిగిపోతుంది,
కాలుతూ ..... జారుతూ " నను అవివేకిని చేసి "
నా జీవితాన్ని నడిపించిన నీ జ్ఞాపకం నిన్నలలో నిలుస్తుంది,మసగ్గా ..... మాయగా " నను నిరాదరిని చేసి "

అందమైన నా జీవన బాటలో నీ రాక మెరుపులా మెరిసి మాయమైంది,నీడలా ..... నిరాశలా
నను నడిపించిన నీ చేయి దూరమై ఎండమావుల వెనక్కి వెళ్ళింది,
మెరుస్తూ ..... మురిపిస్తూ " నను ఏకాకిని చేసి
నా అపురూప చెలిమి తరువునుండి నీ స్నేహఫలం రాలిపోతుంది,నిష్ఫలంగా ..... నిర్దయగా
నేను అలుపెరుగని బాటసారినే, కానీ నిను ఎన్నటికీ కలువలేని సమాంతర రేఖను..
 
- Meraj Fathima