Friday, May 10, 2013

నిజాలు కోసం ఇంకా మన గుండే కొక్కేనానికి తగిలించ బడ్డ చొక్కా జేబులో వెతుకుదాం

తరాలు గడిచిపోయునా
నిజాలు  కోసం  ఇంకా
మన గుండే కొక్కేనానికి
తగిలించ బడ్డ చొక్కా జేబులో
వెతుకుదాం
దేహానంతర జీవిత రహస్యమేదన్నా
దొరుకుతుందేమో....>దొరుకుతుందా అని ప్రశ్నించుకొని ఆత్రంగా వెతకడం మొదలు పెట్టాను ..అవేదన,నిర్వేదం,నిరాశ, నిస్పృహ...ఇవన్నీ నన్ను వెనుక్కులాగి..వెర్రివాడ నిజంకోసం తాపత్రయపడకు...నటించు ...నిజంకాకున్నానిజం అనేలా బ్రమింపజేయి...అబద్దాన్ని నిజంగా మార్చు ఏమార్చు అప్పుడే అనుకున్నది దొరుకుతుంది నిజాయితీగా ఏదీ ట్రై చేయకు అవమానాలెదురౌతాయని హెచ్చరిస్తోంది ఆ దిక్కుమాలిన "నీతి",,,"నిజాయితీ".......................................

జ్జ్నాపకాలకు
ఊహలకు
మధ్య కట్టిన
వొంటితాడుపై
ఉయ్యాలూగుతూ
నిజాల గడ పట్టుకొని ...నేనుసైతం అని ముందుకెళ్ళగు నీకు అడుగడుగునా గోతులే... తవ్వేవాళ్ళెక్కువయ్యారు... నిజాలను నమ్మేవాళ్ళు తక్కువయ్యారు..ఏది నిజం ఏది అబద్దం అని వెర్రిగా ఆలోచించకు... అబద్దాలుతో అడ్డంగా దూసుకపో..అన్ని నిజం అని పొగుడుతూ వెళ్ళు అప్పుడే నీవో గొప్ప భావకుడివి అప్పుడే నీవో గొప్పప్రేమికుడివని గుర్తింపు వస్తుంది .. నీలో నిజాయితీ లేకపోయినా నీవే నిజమైన నిజాయితీ అని కూడా నమ్ముతుంది ఇవన్నీ జగమెరిగిన సత్యాలు...జనం నేర్పిన పాఠాలు