Saturday, May 11, 2013

అది జాబిలి ఎదలో రగిలే మంటని తెలిసేదేపుడే


చెలియా ఏ తోడులేక
మిగిలిపోయా నేను ఒంటరిగనుక
కనుకే నీకై ఎంతో వెతికా అన్ని చోట్లా
కనపడలేదే... కలగా మిగిలావు ఎందుకని
నిను చేరే దారసలు  ఏమైపోయింది
నాకిపుడు ఎంతవెతికినా కనిపించడ లేదు
మదిలోని మాటసలు నీకు వినిపించాలని తపన పడుతున్నా
నిను దగ్గర అవుతున్నా అనుకునే లోపు

దూరం అయ్యావులే ప్రియా కారణం చెప్పగలవా
ఊహల్లో తీరని జ్ఞాకపమై మిగిలావు ఎందుకని
తీరా నువ్వు గుర్తొస్తుంటే నీ మనసును తడిమా
నన్ను పూర్తినా మర్చినట్టున్నావు ప్రియా
నే మరిచేందుకు ఇంకా ఎముందంట...
జాబిలి అంటే చల్లదనం అని అనుకుంటాను
అది జాబిలి ఎదలో రగిలే మంటని తెలిసేదేపుడే
కలిసిరాని కాలం నను వెలివేసినా

విడిచిపోక వుంటా ఎపుడు నీ నీడగా
కురిసే నీ కన్నీరుగా...కలిసేనా నిను ఎప్పటికైనా..
నాదికాని నా ఊపిరి ఆగిపోయేలోపు
నీదైన
నా జీవితం బుగ్గి అయ్యేలోపు సాద్యమేనా ప్రియా