Thursday, May 2, 2013

కన్నిళ్ళు ఇంకిన మనసుతో నీ కోసం ఎదురు చూస్తున్నా ప్రియా

 ఉదయించిన సూర్యున్ని అడిగా
నీవు క్షేమమా అని
చల్లగా వీచే గాలులను అడిగా
నీ చిరునవ్వులు ఏవి అని
పున్నమి జాబిలి 

కాంతులను అడిగా ప్రియా
నీ మంచి మనస్సు ఎక్కడని
వనం లోను పూలను అడిగా
నీ పరిమళం ఏది అని
ఆకాశం లో మబ్బులను అడిగా

నీవేం చేస్తున్నావో అని 
కనిపించిన ప్రతి శిలను అడిగా
నీవు ఎక్కడ అని
సెలయేరు సవ్వడిని అడిగా
నీ మువ్వల సవ్వడి వినాలని
నీతో మాట్లాడాలని
కన్నిళ్ళు ఇంకిన మనసుతో
నీ కోసం ఎదురు చూస్తున్నా ప్రియా