Wednesday, April 10, 2013

తిక మక ల చక్కిలిగిలి పెట్టిస్తాయి నీ తలపులు

గుట్టు విప్పి చెప్పలేని కొంటె భావాలనీ
కనురెప్పల దుప్పటి కప్పి బజ్జో పెడతానా
అవి కల ల వాకిట్లో మళ్ళెమొగ్గల ముంగిట్లో
తిక మక ల చక్కిలిగిలి పెట్టిస్తాయి నీ తలపులు
లేత చివురాకుల్లొ నీ చిలిపి ఊహలు
మంకెన పూలయ్యిమదిని దోచాయి
పెదవి జారనీకుండా పంట నొక్కి పెడతానా
గుండెళ్ళో నీ జ్ఞాపకాల అలజడులు
మదిలో ఆనందం వెల్లువిరిసినంత
నిట్టుర్పు విడిచేలోగా..
గుండె మీద ఇంకిపోయి గట్టి రాయికి మల్లె
బిర్ర బిగిసుకు పోతాయి.. నీ ఊహలు
ఎం చెయ్యాలో తెలీక ..తిక మకతో
దిగులుతో పిక్కటిల్లేలా అరుస్తున్నా
నీవస్తావని కాదు..ఏం చేయాలో తెలీక ప్రియా