Thursday, January 10, 2013

నీ తలుపులు రేపే నా ఈ నిశ్శబ్ధయుద్దంలో.. ప్రియా

నీ తలుపులు రేపే 
నా ఈ నిశ్శబ్ధయుద్దంలో.. 
ఒంటరిగా పోరాడుతున్నా మనస్సుతో
యుద్ధం చేసేదీ నేనే.... 
గాయపడేదీ నేనే... ప్రియా 

నిన్ను నానుంచి దూరం చేసిన

నల్లని రాత్రులలో నీకోసం 
ఎదురు చూస్తూ వాడిపోయిన 
నా హృదయం సాక్షిగా
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ గుండె 
బరువుగా నీకోసం ఎదురు చూపులు
కనుల ముందే చేజారే క్షణం ..

కనులు నమ్మలేని నిజం 
కనులు దాటని కన్నీటి జలం 

మరి ఇది ఏ దేవుని శాపం మూలమో ప్రియా

మౌనంలోనూ.... 

కెరటాల అలజడిలోనూ వినిపిస్తుంది 
నా హృదయ ఘోష...
ఉప్పొంగే ఆశల నిట్టూర్పుల 

నా శ్వాస కదలి కరిగిపోతున్న నా ఆశ
ఆశలో ఊపిరి పీల్చాలన్న ద్యాసే మరుస్తున్నా

నీ తలపులు కలలోను కలవరపెడుతుంటే...

కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...
లోలోపలే నా పై కలబడుతున్న 

నీ జ్ఞాపకాలను తడుముతూ నాకన్నీటికి
సమాదం ఎమని చెబుతావు ప్రియా