Friday, December 21, 2012

నన్ను నేను ప్రశ్నించుకుంటే ...నిశ్శబ్దం తప్ప ఏమి వినిపించడం లేదు ప్రియా


ఏం  చేయను బుజ్జీ  ?
నిశబ్ధాన్ని
గుండె నిండానింపుకొని
గుండె వేగాన్నిపెంచుతూ
గడియ గడియ లెక్క బెట్టుకుంటున్నా ప్రియా

బుజ్జీ
మాటలన్నీ మూటలుచేసి
గుండె గదిలో దాచాను
నిశ్శబ్దంగా  నీజ్ఞాపకాల్ని రేపుతున్నాయి

ప్రియా జ్ఞాపకాలు
నిబ్ధాన్ని మెళ్లిగా  తనలో
నిముడ్చుకోంటూ
బయటికి రావాలని చూస్తున్నాయి
గొంతునులుముతూ
ముళ్ళ కంపల్ని పుట్టిస్తూ
రక్తం వోడుతున్న అక్షరాల సాక్షిగా..

ప్రియా నీవు పోతూ
నాలో ఉన్న నన్ను తీసుకెళ్ళావు
అప్పుడు నాకు నేనెలా ..జీవించగలను
ఇప్పుడున్ననేను.. నీదగ్గరే ఉన్నా
నాలో ఉన్న నన్ను నేను ప్రశ్నించుకుంటే
నిశ్శబ్దం తప్ప ఏమి వినిపించడం లేదు ప్రియా