
నా తనువులోనీవే ...అణువణువునీవే ప్రియా
నీలోని సౌందర్యాన్ని...ఎక్కడని వెతకను
నా మదిలో రగులుతున్న ఆరని వెతలు
అర్దం చేసుకుంటావని
ఎంతో ఎదురు చూశాను ప్రియా
నా మనసులోని
అంతరంగోష నీకు చేరలేదా..?
అరవిరిసిన అందార మందార సుకుమారి
పరదాలు తొలగించి...
నీకై అలసిన నన్ను సేదతీర్చవే
నన్ను నీ కౌగిలిలో బందిస్తావని ఎదురుచూస్తున్నా
ఆ ఒక్క క్షనణపు నీ బిగి కౌగిలి లో
నన్ను మైనంలా కరిగిస్తావని చూస్తున్నా ప్రియా
నీ అందమైన కనుసన్నల కాటుక చెదరకుండా ..
కవ్విస్తున్న మయూరి
ఓరచూపుల వయ్యారి..వలచివచ్చానే నీకోసం..
ఓంటరిగా చెంతకు చేరానని తుంటరిగా నన్నుడికించకే..
నీ అరవిరిసిన అందంముందు నేనోడి నీపాదాల చెంతచేరానే ప్రియా