. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 3, 2012

చిగురుటాకుపై మెరిసే చిన్ని మంచు బిందువుని చూసి మురిసిన మనసేనా ,

అసలిది నా మనసేనా .........
కాలపు ప్రవాహం లో ఈదులాడి అలిసేనా ?

చిగురుటాకుపై మెరిసే చిన్ని మంచు బిందువుని చూసి మురిసిన మనసేనా ,
చందమామ లో విరిసే వెన్నెల పువ్వుల్ని కోసి కోసి అలసిన మనసేనా!

కొమ్మల్లో కూసే కోయిల కోసం ఆమనల్లే ఎదురుచూసిన మనసేనా ,
మబ్బుల్లో విరిసే హరివిల్లు కోసం ఆకాశమంతా వెదుకులాడిన మనసేనా !

చిన్ని పాపలతో ఆడుతూ ఆనందపు అంచులు తాకిన మనసేనా,
చిన్ని సంతోషపు జడివానకే పురివిప్పి నాట్యమాడిన మనసేనా!

పారిజాత పువ్వుల్ని ఏరుకుని పరవశించిన మనసేనా,
చిరుజల్లులో తడిసిన మట్టి వాసనకి పులకరించిన మనసేనా!

ఎందుకిలా పాషాణమల్లే మారిపోతోంది ?
స్పందనలు మరచి మౌనమై మిగిలిపోతోంది !

ఎంత పెద్ద ఆనందపు అల తాకినా కదలక పడి ఉంటోంది,
ఇంత సొగసైన జీవన ప్రవాహం లో కలవను పొమ్మంటోంది!!!!