Sunday, February 5, 2012

మంచుముత్యమా ఏమిటి నిశ్శబ్ధం

మంచు ముత్యాల అలజడి

మంచుముత్యమా ఏమిటి నిశ్శబ్ధం!

ఏవి పక్షుల కిలకిలలు?
నీ ధాటికి తాళలేక ఆకులు రాలిన కొమ్మలపై
ఆకలితో మూగగా అలమటిస్తున్నాయి.

ఏవీ జింకపిల్ల పరుగుల సవ్వడులు?
నిలువ నీడ లేక నీలో తడవలేక
పొదలమాటున పొంచి చూస్తుంది నువ్వెప్పుడు పోతావోనని.

ఏవి లేతగాలి రెపరెపలు?
నీ భారం మోయలేని లేత రెమ్మలు
తలలు వంచి గోడున విలపిస్తున్నాయి.

కాలు కదపలేక ఎపుడు కరుణిస్తావా
అని బస్తాపులో బెదూరుచుపులతో ఎదురు చూసే బాటసారి,

ALTO కారు సైతం నీకు భయపడి
తన స్పీడు తగ్గించింది.

నీ తివాచీ కింద వూపీరాడక
ఉక్కిరిబిక్కిరయ్యే ఆ గడ్డిపురుగు సైతం ఘోషిస్తుంది
నీ ఉనికిని భరించలేనంటూ.

ఎవరు ఏమనుకున్నా..... నా ధర్మం నేను చేసుకుపోవాలంటు
మంచుని చీల్చుకు వచ్చిందో