

దేవుడో దారునమైన నిర్నయం తీసుకున్నాడు..
ఆ దేవుడుకూడా ఎందుకో..ఇలా చేస్తున్నాడు..
మనుషులే అనుకుంటే దేవుడు కూడా ఇలా చేస్తున్నాడేంటీ..
నీవు చేసిన మనుషులే ఇలా చేస్తుంటే నేనేం తక్కువ తిన్నానా అనుకున్నాడో ఏమో..
నీవు దేవుడివి అయివుండి ఎందుకిలాంటి నిర్నయాలు తీసుకుంటున్నావు..
అందర్నీ నవ్వుతూ పలుకరించే మా మధును ఎందుకు తీసుకేళ్ళావు..
ట్రైన్ యాక్సిడెంట్ లో అందరికీ అందనంత దూరం తీసుకెళ్ళాడు
ఆదీపాన్ని ఆర్పేసి నీవేం సాదించావో తెలీదు దేవుడా...
ఈ లోకంలో నాలాంటి వేష్టుగాళ్ళూ ఉన్నారు వాల్లను ఎందూ తీసుకెళ్ళవు దేవుడా..
అందరిలా నటించడం చేతకాని నాలాంటి వాళ్ళు బ్రతికిదండగ..కాదా..?
నీవెందుకు బ్రతికిస్తున్నావో ఇప్పుడిప్పుడే అర్దం అవుతుంది..
మోసం చేసేవాళ్ళకి అవసరమని ఏమో..?
అందరి స్వార్దానికి బలికావడానికి బలి పసువుల్ల మేము ఉపయోగపడతాం కదా..
అందుకే మాచావు ఇలా రాసి పెట్టావు కదా నిజంగా నీవు చాలా గ్రేట్..
ప్లీజ్ అవకాశం వుంటే మా మధును మరోసారి బ్రతికించవా...ప్లీజ్
కన్నీటితో వేడుకుంటున్నా..అయినా నీకు కన్నీటివిలువ ఎంతెలుసు
తెలిస్తే ఇలా ఎందుకు చేస్తావు ..మా మధును ఎందుకు మాకు దూరం చేస్తావు
నా చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు కన్నీటి విలువ తెలీనోళ్ళూ..
వాళ్ళ మద్యి వాళ్ల స్వార్దం మద్యి బ్రతకడం చాలా కష్టంగా వుంది..
మరి త్వరళో ఓ నిర్నయం తీసుకొని మరోసారి దేవుడీవి అనిపించుకో మరి