Saturday, July 23, 2011

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...




వెన్నెల్లో తారకలా అలరించే నీరూపం
చూస్తున్న వేళ...

నీకు చిక్కిన నా చూపుల కాంతిలో
కన్పించలేదా ఏ భావం ?

వికసించే మల్లెలలోని పరిమళం...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...

మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...

ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.

తడబడి తల తిప్పుకున్న నాలో వినిపించలేదా
నీకే పలికే ఏ మౌనరాగం ???

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...
ఎప్పుడో మర్చిపోయిన నన్ను నేను కనుగొన్నాను.

చెక్కిలి దాటని ఆ నునులేత సిగ్గు దొంతరలో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరయ్యాను