ఏం జరుగుతోందో...ఏం జరగ బోతోందో...?
ఆలోచించి అర్దంచేసుకునే లోపు అన్నీ జరిగిపోతున్నాయి..
అన్నిటికీఅర్హతలేకుండా అతిగా ఆలోచిస్తున్నానేమోకదా..?
ఎందుకు అన్నిటికీ నన్నే దోషిని చేస్తున్నావో అర్దంకావడంలేదు ప్రియా
అందుకేనేమో మనసు భాధల్ని తట్టుకునే అలవాటు చేసుకుంది.
కన్నీటిని దాచుకుని నవ్వడం నేర్చుకుంది.
ఇన్నీ తెలిసిన నా మనసు ప్రేమలోని ఎడబాటుని ఏల కాదంటోంది...!
ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
తలపులతో తనువు బరువౌతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువ అవుతున్నాయి
ప్రేమ ఓటమిని అంగీకరించనన్నది
మరణం విజయ దరహాసం చేస్తున్నది
పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నాయి
స్వప్నం కూడా నిన్ను కానలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!