. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 17, 2016

ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా

ఎన్ని నిశ్శబ్దాలు 
మాట్లాడుతున్నా 
ఎన్ని నిరాశలు 
నిన్ను కమ్మేస్తున్నా 
ఎన్ని నిస్పృహలు 
నీలో మనిషిని వెతుకుతున్నా 
ఏకాంతం ఎందుకో 
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది 
నిదానించమని 
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా 
అల్ల కెరటాలు కలలతో కవాతుచేస్తున్నా 
ఆటుపోటులు తో 
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా 
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి 
దిగులు దిగులుగా 
దిగమింగేస్తున్నా 
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి 
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి 
కొన్ని జ్ఞాపకాలు మనసుకు 
గాట్లుగా మిగులుతాయి 
కొన్ని నీడలు 
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి 

Sunday, May 15, 2016

కృష్టకాంత్ పార్క్ గేటు దగ్గర కీచక పర్వం..( My public expermet )

కృష్టకాంత్ పార్క్ గేటు దగ్గర కీచక పర్వం...అడ్డు కున్న ఓ ఇద్దరు..అందరూ చూస్తున్నా ఇద్దరే ఎందుకు స్పందించారు...
                                మీరే చూడండి


Monday, April 25, 2016

అది రైతుబజార్ ఓ కుర్రోడు ఈవ్ టీజ్ చేస్తున్నప్పుడు ఓ రైతు స్పందించిన తీరు అమోఘం- My Public Experment

అది రైతుబజార్....అందరు కూరగాయలు కోంటూ బిజిబిజి గా ఉంటారు 

అక్కడ ఓ అమ్మాయిని ఓ కుర్రోడు ఈవ్ టీజ్ చేస్తున్నప్పుడు అందరూ 

పట్టించకోక పోయినా అది రైతుబజార్....అందరు కూరగాయలు కోంటూ 

బిజిబిజి గా ఉంటారు అక్కడ ఓ అమ్మాయిని ఓ కుర్రోడు ఈవ్ టీజ్ 

చేస్తున్నప్పుడు అందరూ పట్టించకోక పోయినాఅదేంటో మీరూ చూడండి

Tuesday, April 12, 2016

ఓడి పోయాను గెలవలేనని తెల్సి గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది

తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
ఏ కాంతి తీగలూ వంచలేను..వెతకలేను 
తడి కంటి కాంతి ఇప్పటికేకనురెప్పలు 
నిన్ను ఇప్పటికీ వెతుకుతూనే వున్నాయి 

నామనస్సు  గాయాలకి
ఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన నీ పాదాల క్రింద
విధి అరిగిపోయింది...
నా జీవితం నలిగి పోయింది 
నన్ను నేను మర్చిపోయాను 
ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు 
ఏ ఊహల్లో కూడా నీవే తచ్చాడుతున్నావు 
నాది కాని నీపై నాకు ఏ హక్కు లేదు 
కాని ఎందుకో మనసు నీకోసం 
తడుముకొంటూనే వుంది 
నీకోసం ప్రతి క్షనం తపన పడుతూనే వుంది 

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
జ్ఞాపకాళు  తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
జార విఢిచి వెతుకూనే వున్నా 
ఇకనైనా నా తోడు కావాలి.
మనసు కోరుతూనే వుంది 
మది ఇప్పటికీ నిన్నే తలస్తూ వుంది 
నేనోడిపోయాను..నీ జోడు కావాలి
నిన్నెన్నటికీ పొందలేను 
నేవు ఎప్పటికీ నాదానివి కాదు 
నేను ఓడి పోయాని దారునంగా 
గెలవలేను అని తెల్సు 
నీవు గెలిపించడానికి సిద్దంగా లేవు 
నేకు ఇష్ట మైన వాల్లు గెలవాలి 
వాల గెలుపు లో నా వోటమి నీకు కావాలి 
నీకు నా ఓటపిలో ఆనందం వుంది 
నా పతనం కోరుకుంటూన్న నీ మనసు 
కోరిక తీరాలి అందుకే తలవొంచాను   
నా తల తెగ గొట్టాలని చూస్తున్నా 
మౌనంగా మనసు లో భాదను భరిస్తూ 
ఎన్నాలని భరించను నేను మనిషినే కదా 
ఓడి పోయాను  గెలవలేనని తెల్సి 
గెలిపించలేని నీకోసం మనసు తడుముకొంటూనే వుంది  

Thursday, March 10, 2016

ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది

నాకు మొబైలిప్పుడు కేవలం
సాంకేతిక సమాచార సాధనమే కాదు
నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.

అవసరాలమధ్య అనుసంధానమౌతున్న 
అనేకనెంబర్లతోపాటు
నీ నంబరు అలానేవుంది
అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు
నీ పేరుతో నంబరు కన్పిస్తుంది
అంతటి వెదకులాటలో
ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది
ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది
ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే  
రింగ్  అవుతుంది కానీ వెంతనే కట్ చేస్తావుగా 
అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది
మొబైల్ లో కొత్త ఆప్సన్స్ నీకు 
మంచి అవకాశం కలిపించాయి
బ్లాక్ లో పెట్టడం..
నీవు బ్లాక్ చేసిన నెంబర్లలలో మొదటిది నాదే కదూ 

దగ్గరవ్వాలనే ఆలోచనకు
విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో!

వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు 
మారుస్తుంటాము
కానీ ఆది నా దగ్గర వుండదు..
కానీ  నీ నెంబర్ అలానే వుంది
కొత్తనెంబర్ కూడా సేవ్ అయి వుంది 
కాని ఫోన్ చేసేంత దైర్యం అయితే మాత్రం లేదు

వాడని నెంబర్లను తీసివేస్తుంటాము
మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో

నాకిప్పుడు
నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం
మనసెప్పుడూ తడుముకొంటూనే ఉంటుంది
నీ నుంచి రింగు కావాలి
నా మొబైల్ కు నీ వాయిస్ ద్వారా ఏదో సందేశం రావాలి
అది ఒకప్పుడు స్వీట్ వాయిస్ కాని ఇప్పూడు 
తిట్లదండకం ఎవరో ఎదో చెబితె నిజం తెలుసుకొకుండా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం 
పిచ్చి మనస్సు అలాగైనా నీ వాయిస్ వినొచ్హని 
ఆరాటపడుతుంది నీ కు చీ అనిపించదంలేదు ...?
నా నెంబరు మారలేదు సుమా!

హఠాత్తుగా
జీవితాన్ని ఏమీ మార్చలేదు

Wednesday, March 9, 2016

శూన్యంలో నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా ...

ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అయ్యేకొద్దీ  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు


నీకాలిక్రిందవేసి నిర్దాక్షన్యంగా తొక్కి 
నా మానాన నన్నొదిలేశావు..
ఒంటరిని చేసావు 

స్థితిగతులు మారి, 
నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నిస్సహాయుడనై.. నీకోసం పిలచిన పిలుపులు
ప్రతిధ్వనులై వెక్కిరించాయి.
నీకోసం ఆత్రంగా వెతికిన నా కళ్ళలో 
ఉబికి వస్తున్న నాకన్నీ విలువ 
తెలుసుకోలేక నన్నోదిలేసి 
నీ ఆనందం నీవు చూసుకున్నావు 
నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
అని నిజం కాదు కదా 
అప్పతి జ్ఞాపకాలు సూదులై గుండెల్లో 
గుచ్హుతున్న గాయాల తాలూకా పుండ్లే అవి 
నా బ్రతుకంతా నువ్వు చేసిన జ్నాపకాలే కదా మరి 


నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
అందరూ మంచొల్లే నీకు 
ఒక్క నేను తప్ప ..?
ఎందుకో చెప్పవూ ..?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?

నా రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. నీకు  కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?
కడలి కన్నీరే తెలిపిన నిజాలివి 

విధిని నమ్మిన వాడిని
నీవి కావాలని కోరుకుంటున్న మనస్సు
.క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది. 
అనే పిచ్చి బ్రమలో బ్రతుకుతున్నా 

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే !
కానీ తొందరలో చూడగలనన్న ఆశతో.
నిరాశ అని తెల్సి ..
ఆశను చివరి కోరికగా చేసుకొని 
శూన్యంలో  నీకోసం ఆశగా ఎదురు చుస్తున్నా  

Monday, March 7, 2016

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,

గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం ఆశగా 
ఎదురు చూస్తుంది మనస్సు 
ఓటమెదురైనా వెనుదిరగని 
తడికిక నా కళ్ళలో తావీయనని..
నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది
కనువిప్పు తెలియని  కరిగిపోతున్న 
కాలం సాక్షిగా కన్నీటిలో 
తేలాడే నిజాలు తెలిపే గత0నాది  


మానిన గాయాల్ని రేపడం,
నీకు  అలవాటేమో  కదూ
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీకు అలవాటైన   
నీ ప్రవృత్తేమో కదూ 
ఆరిన జ్ఞాపకాలను  తిరిగి
రగిలించడం నీకానందమెమో కదూ