. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, October 26, 2013

మూగబోయిన నాగొంతులో నీపేరు ప్రతిధ్వనిస్తుంటే

నీ చూపుల ముందు 
కదులుతున్న నా రూపం
శూన్యంలో ఒంటరిగా 

ఉందని తెలుసుకోలేకుంది
నీ ఊహాచిత్రన్ని 

నీ చిరునామా అడుగుతుంటే
అది నాహృదయాన్ని 

చూపుతుంటే చిత్తరువు చెందుతున్నా
నేను మంత్రం చదువుతుంటే 

నీ పేరులా వింటున్నా
నా మది పేజీల మద్యలో 

నువ్వు దాగుంటే
నీకోసం కలల 

విశ్వమంతా చుట్టి వస్తున్నా
చే జారిన ఎన్నో నీ జ్ఞాపకాల క్షణాలు
నువ్వు నా కనురెప్పలనుండి 
వేకువ చూస్తుంటే
జారిపోతావని 

నాకన్నీటిలో పన్నీటి స్నానం చేయిస్తున్నా
నా కన్నుల కార్తీకంలో 

వెలుగులా వస్తావని ఆశిస్తున్నా.
కంటి నుంచి 

ఒక్కో బొట్టుగా రాలుతుంటే
నీకై సంధు మలుపు 

చివర ఆగిన నా చూపు
అప్పుడే తడిచిన యడారిలా 

నిర్మానుష్యంగా ఉంది
మూగబోయిన నాగొంతులో 

నీపేరు ప్రతిధ్వనిస్తుంటే
--
ప్రియా

నీవు పరిచయం అయ్యేదాకా తెలీదు

నీవు పరిచయం అయ్యేదాకా తెలీదు
కాలాని నీవు నాదగ్గర ఉన్న
క్షనానికి వున్న విలువ
నీవు దగ్గర ఉన్నప్పుడు 

ఎప్పుడు వెలతావో అని అని భయం
నా దగ్గరనుంచి వెలుతున్నప్పుడు
ఇకరావేమో అని బయం ఎన్నాళ్ళిలా బయం..
బయంగా బ్రతకాలి ఇదేనా జీవితం
ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జన్మలో కాకపోయిన
మరు జన్మ కైనా మనం ఇలా 

ఉండలేమా మరుపన్నది లేకుండా ...
బయమన్నది లేని కాలం నాకు కావాలి
తోడు లేని ఈ మనసుకి తెలుసు 

ఏకాంతము విలువ....
కనుల వెనుక స్వప్నముకి 

తెలుసు చీకటి విలువ....
పెదవి వెనుక పదముకి తెలుసు 

మౌనము విలువ....
నా ఎదలో దాగిన నీకు తెలియదు 

ఈ నా మనసు విలువ....
ఎందుకు.. అది ఎందుకు..??

Thursday, October 24, 2013

నిజాన్ని కప్పేసిన మనిద్దరి మద్యా మౌనం రోదిస్తుంది

అసలు నీవెవరు, నేనెవరు,
మన స్నేహం  

చిరునామా  గా మారాక
నన్ను నీలో కలిపేసాక,
మనిద్దం ఒకటే అనుకున్నాక
నా మదికేమిటీ మతిమరుపు?
మైమరపు బంధాన చిక్కిన నేను,
నీ మమతావేశపు పాశాన చేశావు

అంతలోనే ఎదో ప్రళయం
ఏందుకో తెలీదు ఎవరు చేశారో తెలీదు
నిజాన్ని కప్పేసిన మనిద్దరి 

మద్యా మౌనం రోదిస్తుంది
గతాన్ని మర్చి న నీవు..

మన మద్యిలో ఎవరో  
అఘాదాలు చేశారు.. 
నన్ను అవమానించావు
నన్ను కాదని అన్నీ 

నమ్ముతున్న  నీవైపు
జాలిగా చూడటం తప్పించి 

ఏం చేయలేని నిస్సహాయత

కొత్త స్నేహాలతోఆనందగా నీవు
నిన్నుతలచుకొంటూ నేను
నేను కనిపించి పలుకరిస్తే 

ఎవరునీవు అంటావేమో
ఎందుకంటే ..నన్ను 

ఏమార్చిన నీవు మర్చిపోయే ఉంటావు మరి

Tuesday, October 22, 2013

ఎందుకు నువ్వు మనిషి జీవితాలతో ఆడుకుంటావు!

ఎందుకు నువ్వు మనిషి జీవితాలతో ఆడుకుంటావు!
ఎందుకు నువ్వు ప్రాణాలను తీస్తావు !
ఎందుకు నువ్వు మనసులోకి ప్రవేశిస్తావు!
ఎందుకు నువ్వు నిన్ను తప్ప అందరిని మర్చిపోయేలా చేస్తావు!
ఒకసారి మనసును మబ్బుల్లోకి ఎగరవేస్తావు ...
ఇంకోసారి నరకం చూపిస్తావు...
ఎందుకు ఇలా చేస్తావు...
ఏంటి నీ ప్రభావం...
ఏంటి నీ ఆనందం ...
ఎందుకు రక్తపు మడుగుల్లో కలుస్తావు ...
ఎందుకు ఆసిడ్ లా మారుతావు ...
ఎందుకు నీకు అంత క్రూరత్వం...
ఎందుకు నీకు అంత ప్రేమ!
ఓ ప్రేమ నీ సమాధానం ఇంకా రాదే !

...వనిత...

జ్ఞాపకం గుచ్చుకొంటోంది

ఉక్కిరి బిక్కిరి 
అవుతున్నట్టుంది
ఊపిరి అందట్లేదు
మనసు మెలి 

తిరిగిపోతోంది
ఆలోచన 

నిలదీస్తోంది
జ్ఞాపకం గుచ్చుకొంటోంది 
అనుభవం 

హెచ్చరిస్తోంది
కంటతడి గుండెసడిని 

గుర్తుచేస్తోంది
బావాల తీవ్రతలో  

కొట్టుకుపోతున్నన్నా
బ్రతుకు మీద 

విరక్తి పుడుతొంది

ఒడ్డున పడ్డ చేపలా 

ఉంది నా పరిస్థితి
నా పక్కనే ఉన్న 

గతం తోట్టేలోకి దూకేశా..
వంద మైళ్ళ వేగంతో 

కొట్టుకుపోనున్నా
ఒడ్డుకు చేరతానన్న ఆశలేదు
ఎప్పుడూ ఎక్కడ 

తేలతానో తెలియడం లేదు .

ఇదిగో ఇక్కడే నేను మనిషన్నది మర్చిపోయాను

ఇదిగో ఇక్కడే నేను 
మనిషన్నది మర్చిపోయాను
అలా నిశ్చలంగా ఆగిపోయాను 

ఏం చేయాలో తెలీక
పాదాలు రెండూ భూమిలో 

పాతేసిన నడక సాగించలేక
చేతులు రెండు బార్లా జాపి వేగంతో దూసుకుపోతున్నలోకాన్ని
కౌగిలించుకోవాలనుకున్నా 

వింతగా అంత లోకం 
ఇట్టే పిడికిలిలో ఇమిడిపోయింది 
లోకం తీరే ఇంతే నేమో  

నా గుండె నుంచి 
ఓ ఆలోచన జారి
అప్పుడే పడ్డ వాన 

ముత్యం బొట్టూలా
అలా జారుకొంటూ   

దారి తెలియక
అక్కదేక్కదో నీజ్ఞాపకం 

ఎదురు పడిందేమో
నా ఆలోచన దెబ్బకు 

ఆవిరైంది ఏంటో  

అలా ఎంతసేపు 
కుర్చున్నానో వర్షంలో  
ఓ వర్షపు చినుకు 

బుగ్గలను తడిమింది
ఎదో ఒక జ్ఞాపకం గుందేను 

గురిచూసి గుచ్చుకుంది
కన్నీటిపొర మసకగా 

కమ్మేసింది  ఎదురుగా అన్నీ నీళ్ళే
నిన్నాసించింది ఇదానేను .. 

నీవు నకు ఇచ్చే బహుమతి ఇదేనా

నీనుండి నీవు దూరం కాకు ..నీవు నీలా ఉండు ప్లీజ్ ( నీకై ఓ ఆత్మ సంఘర్షన }

ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి,మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న.బండరాయి పగుళ్ళ  శబ్దం తప్ప ఎమైనా సమాధానం వస్తుందా ? మనకు మనం మంచివాళ్లమనే ముసుగు కప్పుకొని... స్వార్దంగా నో సంతోషాన్ని మాత్రం మే సూసుకొని ఎదుటి వాళ్ళేమైనా పట్టించుకోని నీ మనస్సాక్షిలో దాగిన నీజాలను అడుగు ..అడగలేవు పైకి నటిస్తున్నావు నేను మంచే చేస్తున్నా అని నీ మనస్సాక్షి కాదన్న వద్దన్నా పట్టించుకోకుండా నీ మనసుకు  ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది…..ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో  స్వచ్ఛతలాగా…స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ మళ్లీ ప్రాణం పోసుకుంటున్న గుండె స్పందించటం మొదలు పెట్టింది... ఆ స్పందనలో ధనం, దర్పం, అధికారం ఏమీ లేవు….స్వచ్ఛత తప్ప…గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలే సరికి, సుదూరంగా అలజడి  శబ్దం. లోకం శరవేగంతో పరుగులు పెడుతుంది,  సునామీ కాలం వెంబడిస్తున్నట్టు…తిరిగి ముసుగులు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. మనసు ఒప్పికోవట్లేదు…సునామి తరుముకొస్తుంది…ఓ ముసుగును అక్కడే వదిలేసి మిగతావన్నీ తగిలించుకుని లోకంతో పాటు పరుగులు...ఏ అలిసిన క్షణానో మరోసారి ఈ ఒకే ఒక్కసారి అంటూ ముసుగులు తొలిగించకపోతానా……మరో సంఖ్య తగ్గించుకోకపోతానా… అందరి దృష్టిలో నీవు మాత్రం గొప్ప.. నిజాయితీకి నిలువుటద్దం అంటూ చెప్పకనే చెప్పుకుంటావు నీ ఇగోను సాటిస్ ఫైచేస్తూ..స్వార్దగా ఆలోచిస్తూ...ఎక్కడ ఎవరు నిన్ను తప్పుగా అనుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఎవ్వరూ చూడట్లేదని నిజాన్ని నిలువునా తగులబెట్టి వెర్రినవ్వులు నవ్వుకుంటున్నావు ఏదో విజయంసాదించాను అని ... ఎవ్వరూ చూడకపింఓయిన అన్నిటికీ నీ మనస్సాక్షే అన్నికీ సాక్ష్యం అయినా ఏం తెలియనట్టు అయాకంగా నటించడం నేర్చుకున్నావుగా అప్పుడలా ఇప్పుడిలా నిన్ను చూస్తుంటే  నీవేనా అనిపిస్తుంది కాని నిజంకదా నమ్మక తప్పదు ... కళ్ళెదురుగా జరిగే నిజాలు మరి నీవు చీకట్లో చేశాను అనుకున్నా నిజానికి వెలుగు చీకట్లుండవన్న నిజం తెల్సుకునే సమయం ఆలోచన నీకు లేదు...ప్లీజ్ ఇంక నటించకు మంచి అనే ముసుగు తీసి.. నీవు నీవులాగా ఉండు..నీలో స్వచ్చత ఉంది ఆ స్వచ్చతను స్వార్దం తినేస్తుంది  . నీలో ఉన్న అంతరంగ అందం చెడి పోతుంది.. నీవు మారకు నీవు నీవులాగా ఉండి నీలో నీవు ఓడిపోకు  క్షనకాలపు  ఆనందపు పొగడ్తలకోసం ఆరాటపడుతున్నావు కాని అదోపాతాలానికి దిగజారిపోతున్నావని తెల్సుకోలేకపోతున్నావు..నీకు తెలివిలేక కాదు తెల్సుకోలేక..పై పై మెరుగులే కావాలి నీకు  ఇప్పటీకైనా నటించడం మానీ నిక్కచ్చిగా జీవిండం నేర్చుకో .. నీలాగానే ఉండు..నిన్ను నీవు మార్చుకొని ఏమార్చుకోకుపైకి అందరూ నిన్ను పొగుడుతున్నా లోపల నీన్ను చులకనగా చూస్తున్నారు.. నీఎదురుగా మాట్లాడంకాదు నీవు లేనప్పుడు కూడా నిన్ను నిన్నుగా గుర్తించేలా చేసుకో