Monday, April 11, 2011
నీకోసం అలా చూస్తూనే ఉంటాను ఎదుట నీవు లేకున్నా...?
నీవు రావని తెల్సినా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా...
నీకోసం అలా చూస్తూనే ఉంటాను ఎదుట నీవు లేకున్నా...
నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను నీవు నన్ను తలచుకోకపోయినా ..
నీ గురించి ఎప్పుడూ తలుస్తూనే ఉంటాను ..నన్ను నీవు తలువక పోయినా..
నీకోసం మాట్లాడూ తూనే ఉంటాను నీవు నా ఎదురుగా లేకపోయినా...
నీకోసం పాడుతూనే ఉంటాను నీవు నాపాట వినకపోయినా..?
నీకోసం అందరిని అడుగుతూనే ఉంటాను.... నీవెక్కడున్నావని
నిన్ను తలస్తూ కవితలు రాస్తూనే ఉంటాను అవి నీవు చదవక పోయినా..
నీవు నా మనస్సును ఎంత గాయాపర్చినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను...
నిన్ను ప్రతిక్షనం గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను నీవు మర్చిపోయినా..
నీ కోసం ప్రతి నిమిషం ఆలో చిస్తూనే ఉంటాను నీవీక్షనాన ఏమి చేస్తుంటావో అని
నీవు నేను కల్సినప్పటి జ్ఞాపాకాలు తలచుకుంటూనే ఉంటాను నీకు నేను గుర్తుకులేకపోయినా..
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్

నాపై ప్రసరించిన నీ తొలిచూపుల కిరణాలు
నా హృదిలో ప్రేమ వీణను మీటాయి
నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు
నాలో మల్లెల విరివానలు కురిపించాయ్
ఒకానొక రోజున అంటీ అంటనట్లు తగిలిన నీ చేతి స్పర్శ
ఒక్కసారిగా నా మనస్సును మత్తెక్కించింది
ఒంటరిగా ఉన్న నీ మనసుకు తోడుకావాలన్నప్పుడు
ఒట్టు... అది కలయేమోనని భ్రమపడ్డా
అది కలకాదు నిజం అని నీ వెచ్చని స్పర్శ చెప్పింది
అది కల్లకాదు నిజమేనని నీ పెదవులు చెప్పాయ్
నిజంగా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు
నీతోటి స్నేహం అధరాల సాక్షిగా... మధురాతి మధురం
నీ రాక కోసం...
నీ పలుకు కోసం...
నీ పిలుపు కోసం...
ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా...
Labels:
కవితలు
అపార్థం, అపనమ్మకం తోడయితే..వెయ్యి ఆశలు కుప్పగూలితే

వెన్నెల కుప్పలాడుకునే
అమ్మాయిల మదిని దోచుకునే చందమామ..
పారిజాత పుష్పాలను ఏరుకునేటప్పుడు
గాలి రేపే మలయ పరిమళం.
అపార్థం, అపనమ్మకం తోడయితే..
వెయ్యి ఆశలు కుప్పగూలితే
సముద్రపు రెల్లుదిబ్బపై
రెపరెపలాడే గడ్డిపోచలు గుర్తొస్తాయి
ఎందరు ఎన్ని రాగాలు పలికినా సరే
ఎందరు ఎన్ని గుండెకోతలు కోసినా సరే...
మనసు గాయం తీరేది కాదు.
Labels:
కవితలు
Sunday, April 10, 2011
దుఃఖం కూడా నన్ను చిన్నచూపు చూస్తుంది!

దుఃఖం నన్ను చిన్నచూపు చూస్తుంది!
కన్నీటి రుచియేమిటో దుఃఖమే చెప్పేది
హృదయాన్ని కన్నీళ్లలో స్నానించేది దుఃఖమే!
ఏ కన్ను యేడ్చినా..నొప్పి గుండెల్లోనే వస్తుంది
దుఃఖం కరిగితేనే కన్నీరు వొలికేది.
హృదయం లో భాదతో ఎంత ఏడ్చినా
కన్నీరు రావడంలేదు!కన్నీరుకు భాద అలవాటైంది
మస్సువేదనకు స్పందనే కన్నీరు..
కరిగిపోతున్న కాలాన్ని..కన్నీరు ఆపలేకపోతోంది..
నేరం నాది కాకున్నా నేరస్తున్ని చేస్తున్నారు..
అందరూ బలిపీఠం ఎక్కించేందుకే ప్రయత్నిస్తున్నారు..
బలౌతున్నది నేను భాద పడుతున్నది నేను..
కాల్సిన వాల్లు ..దూరం అయి పట్టించుకోవడంలేదు..
జరిగింది తలచుకొని జరగబోయేదానిపై ఆశలు వదులుకొని.
చేసేదేమీ లేదు నిస్సహాయంగా ఆకాశం వైపు దీనంగా చూడటం తప్ప
Labels:
కవితలు
నీ తలపే ధ్యాసగా... నీతోటిదే ప్రపంచంగా...

చెలీ... నీవే లోకంగా...
నీ తలపే ధ్యాసగా... నీతోటిదే ప్రపంచంగా...
నీవుంటేనే మధురంగా... నీవంటూ లేకుంటే విరహంగా...
నీకోసమే నేను పుట్టాననే భావంగా... నీకై నేను వేచివున్నా...
చెంతకు చేరి కరుణిస్తావో... రానంటూవో.నా ప్రాణం కావాలంటావో.. నీ ఇష్టం.
కష్టం నా చుట్టమైనా... కన్నీళ్లతోటిదే నాపయనమైనా...నీకోసం ఏమి చేయడానుకైనా నేను సిద్దం
ఏనాటికైనా నువొస్తావని... చితి మంటలపై చేరిన జీవితాన్ని చేతుల్లోకి తీసుకుంటావని...
వీడిపోని ఆశతో... ఆగిపోని శ్వాసతో ఎదురు చుస్తున్నా... లోకం కాదన్నా...
ఎవరెన్ని అనుకున్నా... నీకోసం పలికే ఈ నా మౌనరాగం ఏనాటికీ ఆగిపోదు సుమా...
సముద్రాలే ఇంకిపోయినా... నింగిలోని నక్షత్రాలన్నీ నేలమీదకు జారిపోయినా...
భూగోళం బ్రద్ధలైనా... ఆకాశం అగ్నిగోలాలు చిందించినా...?
సప్త లోకాలు ఏకమైనా... ఏమూలో మిగిలిన ప్రాణంతో...
నిను చూడాలనే ఆశ చావని చూపులతో అను నిత్యం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా.
Labels:
కవితలు
వెన్నెల సంతకం చెదిరిపోయింది..?

వెన్నెల సంతకం చెదిరిపోయింది..?
మనసులో భావాలు మదిని తొలుస్తున్నవేళ..
చల్లని అమ్రుత హస్తం చేయందిచ్చిన వేళ..
హాయిగా ప్రశాంతంగా గడుస్తున్న రోజులు..
నేను ప్రంపంచంలో అద్రుష్టవంతున్ని అనుకుంటున్న వేళ..
అప్పుడే అనిపించేది మేమూ దూరం అయితే అని..?
ఎవ్వరో వచ్చి ఇద్దరిని విడదీసినట్టు..
మళ్ళీ మామనసులు కలువలేనంతగా విడిపోయినట్టు ..
అనిపించి నిదురలో ఉలిక్కి పడి లేచే వాన్ని..
ఇంక అస్సలు నిద్దుర పట్టేది కాదు..
ఎక్కడ దూరం అవుతుందో నని ఎన్నో నిదుర లేని రాత్రులు గడిపా..
ఎవైతే జరుగ కూడదు అనుకుంటున్నానో అవేజరిగాయి.
వరుసగా జరుగుతున్న ఘటనలు..అర్దంకాని పరిస్థితి..
జరకూడదని భయపడిన సంఘటనలే వరుసగా జరిగాయి..
నోట మాటరాక మౌనంగా ఉన్నాను ఎంచేయాలో తెలీక..
అలా ఓ చల్లని వెన్నెల నాకు దూరం అయింది..
మళ్ళీ దగ్గరగా చేరుకోలేనంత దూరం అయింది..
వెన్నెల సంతకం చెదిరిపోయింది..
ఆశ చావక పోయినా నిరాశగా ఎదురు చూస్తున్నా మౌనంగా..
Saturday, April 9, 2011
తడి కన్నులనే తుడిచిన నేస్తమా..?
పాదం ఎటుపోతున్నా పయనం ఎందాకైనా..అడుగు తదబడుతున్నా తోడు రానా మంచి ఫీల్ ఉన్న సాంగ్ ఈ సినిమా చూస్తున్నా పాటలు వింటున్నా కాలేజ్ డేస్ లో ఏం మిస్స్ అయ్యామా అనిపిస్తుంది కదా..?ఈ సినిమాలో నాకు నచ్చిన సాంగ్ నాకు ఈ పాట చాలా ఇష్టం స్నేహంగురించి చాలా గొప్పగా చెప్పాడు రైటర్ ఈ పాటలో స్నేహితుల మద్యి చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా అనే లై సూపర్ ఒంటరైనా ఓటమైనా వెంట నడచి నేను రానా ఓ మైప్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా....? జన్మకంతా తీరిపోని మమతలన్నీ పంచుతోంది ఈ స్నేహం నిజమైన స్నేహం కదా ఇది ..... ఇలా మెలోడి బీట్ లో సాగే పాటలో స్నేహం పై ఎన్నో మీనింగ్ ఫుల్ పదాలు నిజాలున్నాయి మీరు వినండి మీరు నిజమైన స్నేహితులైతే మీలో స్వార్దం లేకపోతే... ప్లీజ్ స్నేహంచేయండి కాని స్నేహితులు భాదల్లో ఉంటే అండగా నిలబడి కన్నీరు తుడిచే ప్రయత్నం చేయండి...ఆ ఫీలింగ్ మీ జీవితంలో ఎప్పటికి నిలబడుతుంది..స్నేహంకున్న విలువ అలాంటిది...బాదల్లో ఉన్నవారికి గుర్తువచ్చేది స్నేహితులే కాబట్టి కన్నీళ్ళుతుడిచే ప్రయత్నంచేయంది..లేదా కాంగా ఉండండీ కాని మీరు కన్నీళ్ళకు కారణం కావద్దు..
ఈ పాటలో పదాల అమరిక మనసుకు హత్తుకునేలా ఉండో చూడండి
పాదమేటుపోతున్న, పయణమెందాకైన;
అడుగు తడబడుతున్న, తోడురాదా;
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;
గుండె ప్రతి లయా లోన నేను లేన;
ఒంటరైన, వోటమైన;
వెంట నడిచే నీడ వేనా;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
..................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
..................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
అమ్మ ఒడిలో లేని పాశం;
నేస్తామల్లె అల్లుకుందీ..;
జన్మకంతా తీరిపోనీ;
మమతలెన్నో పంచుతొందే;
'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;
'ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;
మొహమాటలేని లేని కాలే జారువాలే;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా
ఈ పాటలో పదాల అమరిక మనసుకు హత్తుకునేలా ఉండో చూడండి
పాదమేటుపోతున్న, పయణమెందాకైన;
అడుగు తడబడుతున్న, తోడురాదా;
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;
గుండె ప్రతి లయా లోన నేను లేన;
ఒంటరైన, వోటమైన;
వెంట నడిచే నీడ వేనా;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
..................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
..................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
అమ్మ ఒడిలో లేని పాశం;
నేస్తామల్లె అల్లుకుందీ..;
జన్మకంతా తీరిపోనీ;
మమతలెన్నో పంచుతొందే;
'మీరు','మీరు' నుంచి మన స్నేహ గీతం;
'ఏరా' , 'ఏరా' అల్లోకే మారే;
మొహమాటలేని లేని కాలే జారువాలే;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా
Subscribe to:
Posts (Atom)