. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 31, 2010

అందాల నీ కురులు పిల్లగాలికి ఎగురుతుంటే ...మనస్సు మాటవినటంలేదు


అందాల నీ కురులు పిల్లగాలికి ఎగురుతుంటే ...మనస్సు మాటవినటంలేదు..
నీనవ్వు ఓ జలపాతం...నీ మాట సెలఏరు అలలా అలా సాగుతూనే ఉంటుంది
ఎందుకో నాకోసం నీవు తపించినా నిన్ను గుర్తించ లేకపోయాను..
ప్రపంచలోని అందమంతా నివొక్కదానివే సొంతంచేసుకున్నావా అన్నట్టున్నావు...
నీవు నాకోసం ఇంతగా తపించి పోతున్నావు ఏముంది నాలో...ఎలాంటి ప్రత్యేకత లేదే...
నేను ప్రాణంగా ఇష్టపడ్డవారు అకారణంగా దూరం అయ్యారు కారణం లేదు నేను ఎలాంటి తప్పు చేయలేదు..
ఒకప్పుడు నాతో మాట్లాడకపోతే భాదపడే వారు ఇప్పుడు ..నేను ఎప్పుడు ఫొన్ చేస్తానా అని చిరాగ్గా ఉంటున్నారు ఎందుకో తెలియదు తెలుసుకుందామంటే ఆ కొంచెం అవకాశంకూడా ఇవ్వడంలేదు...
నేనే తప్పు చేశానో తెలియదు కాని ఇలాజరుగుతుందని( ఓ బందంవల్ల )
ముందుగా నే ఉహించాను కాని ఇంత ఘోరంగా మోసపోతాను అని మాత్రం కొంచెంకూడా ఊహించలేదు..
అందుకే నీనుంచి పిలుపు వచ్చినా భయంవేస్తుంది...నిన్న నిన్ను కల్సినప్పుడు మనస్సు దూది పింజలా అనిపించింది కాని లోపల భయం మాత్రం అలాగే ఉండిపోయింది...నీ మాటలు నీ అందం నన్ను మరోలోకాలకు తీసుకెల్లాయి
చల్లటి చిరుజల్లులు కురుస్తున్నాయి కలుద్దామా అన్నప్పుడు ఎప్పుడు కలుద్దామా అని పించింది కాని గతంతాలుకు గాయం హ్రుదయాన్ని ఇంకా వీడలేదు...అందుకే ఈ వర్షపు జల్లుల్లో నీ తోకల్సి నడవాలన్న నీ కోరిక ను సున్నితం గా తిరస్కరించాల్సి వచ్చింది..
ఎందుకంటే ఈ జీవితం ఎక్కువరోజులు జీవించలేను అన్న వాస్తవాన్ని ఎవ్వరు నమ్మటంలేదు
నా ఆనుకున్న వాళ్ళు చాలా లైట్ గా తీసుకున్నారు...త్వరలో నీగురించి నిర్నయం తీసుకుంటాను కాస్త సమయం ఇవ్వు
అందుకే నీకు దూరం గా ఉంటున్నా..నివన్నా నిజంతెల్సుకో..మొన్న నీకు చెప్పీనప్పుడు నీవు చాలా భాదపడ్డావని చెప్పావు అందుకే...నీకు అస్సలు దగ్గర కాలేక పోతున్నా.అయినా సరే కాస్త సమయం ఇవ్వు....ప్లీజ్..వాస్తవం తెల్సుకో నామీద ఉన్న ఆశలు వదులుకో...

Sunday, October 24, 2010

మన కన్నీళ్ళే మనకు మరపురాని నేస్తాలు...


మనం ఎప్పుడూ ఒంటరి వాళ్లంకాదు దుక్కంలో , ఆనందంలో అందరికీ తోడుండేది ఆ కన్నీళ్ళే,
ఎందుకంటే నా కన్నీళ్లు నాకు తోడున్నాయి,నులలివెచ్చగా ఓదార్పుని ఇచ్చేవి ఆకన్నీళ్ళే
ఈ రోజే తెలుస్తోంది నాకు ,కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని ,
కన్నీళ్ళని మించిన చెలిమి లేదని,కన్నీళ్ళకేమీ సరిరావని.

సుఖాల్లోనే కాదు కష్టాలలో కూడా ,నేనున్నానంటూ ఆప్యాయం గా హత్తుకునే
కన్నీళ్లు ,నాకెప్పుడు దూరం కాకూడదు .కన్నీళ్ళన్నీ వచ్చిన ఆక్షనం మనస్సు ప్రశాతంగా ఉంటుంది

ఇది నేను కోల్పోతున్న ,నీ తీయని చెలిమి ఇస్తున్నకన్నీళ్ళు ఉప్పటి వరమేమో కదా .
లేక నా దురదృష్టం అని మాత్రం తొందరపడి డిసైడ్ కాకు ...అనేక ఆలోచనలతో వచ్చే ఆకన్నీళ్ళను ఆపకండి
కారే ఆకళ్ళీకు అడ్డు పడకండి...చివరివరకు మనకుతోడు నీడ అవే అనేవాస్తవాన్ని మరువకు
ఎవరు భాదపెట్టినా... ఆనందం ఎక్కువైనా నేనున్నానంటూ పలుకరించేవి ఆకన్నీళ్ళే కదా
కన్నీళ్ళు వచ్చేప్పుడు మరొకరు మీవద్ద లేకుండా ఓంటరిగా ఉండేందుకు ట్రై చేయండి..
లేదంటే కన్నీళ్ళు పెట్టుకొని మనస్సును ప్రశాతంగా చేసుకునే అవకాశాన్ని కోల్పోతాం
ఈ కన్నీళ్లపై ఇంకా ఏదో చెప్పాలని ఉంది కాని గతంతాలూక భాదలు గుర్తుకొస్తున్నాయి..
నాకన్నీళ్ళను ఎందుకు ఆపుకోవాలి అందుకే ఆ అవకాశాన్ని వదులుకోను..
ప్లీజ్..ప్లీజ్..ఒంటరిగా వదిలేయండి ఇప్పటికే అర్దం అయిందనుకుంటా

చెప్పటానికి చాలావుంది..వినటానికి ..చదవటానికి మీకు ఓపిక కావాలి

..మనసుపొరల్లో దాగివున్నరహస్యాలుచెప్పనా..జీవితం నేర్పిన పాటాలు చెప్పనా...చెప్పదలుచుకున్నావి సూటీగాచేబితే..మీమనసులు గాయపదతాయి...వాస్తవంచేదు గుళికలాంటిది...నిజం నిప్పులాంటిది..గాయపడ్డమనసుకి..సేదతీర్చే..స్నేహితుడు..లేడంటే నమ్మూతారా..ప్రతిది డబ్బుతొ కొలిచే.. ఈలోకంలో...ఎలా..సాగాలో చేప్పనా....ఏది ఏమయినా జీవితంవేర్పినపాటాలు..మానవత్వానికి విలువలేనిసమాజంలో...నాబాద్యిత..కోసం ఏమిచేయాటానికైనాసిద్దం...జీవితం నేర్పినా పాఠాలతో..నేను సమాజానికి వేయాల్సింది చాలావుంది..ఆదిశగా..నాఅడుగులూసాగిస్తాను.ఓభాథ్యిత నెరిగినపౌరునిగా..చెప్పడం చాలా ఈజీనే కాని ఆచరణలో..పెట్టడం చాలాకష్టం..కదా? అందుకే హద్దులు దాటని..భాద్యితనెరిగిన పౌరుడిలా...జీవించటానికి ప్రయత్నిస్తున్నాను..అలాజీవిస్తున్నాను అని మనసు చంపుకొని ..చెప్పలేను..వాస్తవాన్ని..అందరి ఎదురుగా చెప్పలేకపోయినా...ప్రతివాల్లు మనస్సాక్షికి చెప్పుకోవాలి వాస్తవం..మీరు అవును అన్నాకాదన్న...యిది నికార్సయిన నిజం...


చిన్నతనం లో పెద్దగా అవ్వాలని తొందర , స్కూల్ కి వెళ్లాలని తొందర ,
స్కూల్ కి వెళ్ళాక పెద్ద క్లాసులకి వెళ్లాలని తొందర, పెద్ద క్లాసు లకి వెళ్ళాక కాలేజీ కి వెళ్లాలని తొందర
కాలేజీ లో చేరాక ఉద్యోగంలో చేరాలని తొందర, ఉద్యోగంలో చేరాక పెళ్లి కి తొందర,
పెళ్లి అయ్యాక పిల్లల కోసం తొందర, పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అవ్వాలని తొందర,
పిల్లలు పెద్ద అయ్యాక, వాళ్లు సరిగ్గా చూడక పోతే చచ్చిపోవాలనే తొందర,
కాని చివరకి చనిపోయే ముందు తిరిగి చూసుకుంటే, జీవితంలో అన్నీటికి తొందర పడటం తప్ప చేసిందేమీ
లేదు అని తెలిసింది, కాని అప్పటికే జీవితం అయిపొయింది.

సగటు మనిషి రేపు ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఇవాళ ఎలా బ్రతకాలో మరచిపోతున్నాడు.
"స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ లివింగ్" అని ఎక్కడో చదివాను నేను, అది అందరు పాటిస్తే ఎంత బాగుంటుందో కదా?
జీవితాన్ని జీవితంలా జీవించండి, దాని లోని మధుర్యాని ఆస్వాదించండి.
అంతే కాని అందరికంటే బాగా ఉండాలనే తపనతో జీవితాన్నే ఒక పోటి పరీక్షగ మార్చకండి

Tuesday, October 12, 2010

నా హౄదయవేదన వింటావా....?

వేదమంటి నా హౄదయవేదన వింటావా
పాదమంటు కన్నీటి రోదన కంటావా

కంటి నిండా నీటితో, వంటి నిండా విషముతొ
క్షణము క్షణము నా కణము కణము కౄశించిపోతున్నది.

గుండె నిండా నీవుతో, బండబారిన నేనుతో
వ్రణము ఘనమై, నా కణము కణము శిలలౌతున్నది

కంటి ముంగిట కలలతో, ఇంటి ముంగిట కళలతో
క్షణము క్షణము, నా కణము కణము నీకై ఎదురు చూస్తున్నది

చెరకు వింటి పూలవానలా, చంటి పాప పాలవాసనలా
తనువు మనసై, నా కణము కణము నీ ప్రేమ నిండినది.

Monday, October 11, 2010

నీకు ప్రేమామృతం అందిస్తున్నా.....అర్దంచేసుకోలేవు ఎప్పటికీ

నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆస్వాదించలేవు,ప్రతిది నీకు వెటకారమే

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,ప్రతిది నీకు టేక్ ఇట్ ఈజీ

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,అలా నీవు ఆలో చించలేవు

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,అది నీతప్పుకాదు అలా అడ్డంగా ఆలోచిస్తావు

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,నాకవసరం లేదనే నీసమాదానంలో ఉంది జవాబు

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,అయితే ఏంటి నాకవసరంలేదనే నీ నిర్లక్ష్యిపు సమాదానం

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,అది నీకు పట్టదు కదా.ఎప్పుడూ నీగోల నీదే

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు.....ఆవిషయంతెల్సినా నాకనవసరం అనేదేగా నీజవాబు

కవ్వించిన వసంతం...నిరాశమిగిల్చి వెల్లింది


కవ్వించిన వసంతం...నిరాశమిగిల్చి వెల్లింది...
హేపి హేపి లైఫ్..ప్రొఫిషన్ లో విజయాలు అంతా మంచిపేరు..విజయం అంతా అతనిదే
ఎక్కడో ఎవ్వరికీ తెలియని పెప్పలేని చెప్పుకోలేని భాద..
ఎవ్వరికీ చెప్పే అవకాశంలేదు...చెప్పుకునేది కాదు..
ఎవ్వరికన్నా చెప్పుకొని ఆభాదనుంచి కాస్తరిలీఫ్ పొందాలంకున్నా అవకాశం దొరకలేదు
అలాంటి సమయంలో అతనికి పరిచయం అయింది పండు వెన్నెల లాంటి వసంతం...
కవ్వించించి...కైపుల్లొ తేలియాడేలా చేసింది.పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే..నిద్దుర లేకుండా చేసిందా వసంతం..
ఆకలి మందగించింది..అవసంతంగురించే ఆలోచనలు...నిద్రపోతున్న కోర్కెలను మళ్ళీ తట్టి లేపింది....
అన్ని విషయాలు షేర్ చేసుకునే అవకాశం రావడంతో అన్నివిషయాలు తెల్సుకొని మరీ ఉరించి ఊహల్లో తేలేలా చేసింది...
వసంతంకవ్వింపులతో పులకించి తననుకున్న ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం మోదలు పెట్టాడు...
ఆ అవకాశాన్ని మరొకరు అయితే ఎదోవిదంగా ఉపయొగించుకునేవాళ్ళే....అక్కడా మంచితనం అడ్డువచ్చింది....అవకాశంజారిపోయింది..
ఎందుకో తెలియదు...ఇష్టం ఇష్టం అంటూనే దూరం పెట్టడం మొదలు పెట్టింది...నేను నీస్వొంతంకాదు అని తెల్సి చెప్పింది..
అయినా కాంప్రమైజ్ అయినా ఎందుకో మొదట్లో కవ్వింపులే గుర్తుండి పోయాయి...అప్పుడు అనిపించింది ఇప్పుడు అనిపించడంలేదంటూ చెప్పిందా వసంతం...
.అప్పటి జ్ఞాపకాలతో ఆకలి మందగించి..నిద్దుర కరువైనా( ఇప్పటికీ )ఆ వసంతం మాత్రం హేపీగా వుంది...ఎందుకిలా చేస్తున్నావంటే అప్పుడలా అనిపించింది ఇప్పుడు అనిపించడంలేదంటూ కూల్ గా చేప్పి..నాకిష్టంలేదంటూ ( ఒకసారి అనిపించడం మరో సారి అనిపించకుండా ఉండట మేంటో కదా )
తేల్చి చెప్పిన ఆవసంతం కవ్వించి కైపెక్కించిన ...ఆవసంతం తిరిగి వెల్లిపొయింది

Sunday, October 10, 2010

ఈ అబ్బయికి ప్రేమించడానికి అమ్మాయి కావాలంట అమ్మాయిలు మీరు ట్రైచేస్తారా..

ఈ అబ్బయికి ప్రేమించడానికి అమ్మాయి కావాలంట అమ్మాయిలు మీరు ట్రైచేస్తారా..

అబ్బా ఆపండి బాబోయి ఎందుకండీ అంత ముతకతిట్లు తిడతారు...వాడేదో మైల్ పెట్టాడు దానికి నేనేదో చేద్దామని ఈ ఐటం పోష్టు చేస్తే ఏమి చదవకుండానే ఎందుకండీ అలాతిడతారు.....చుశారా మీరు అలా తిడతారని ఎలాముందుగా ఊహించానో...( సరే విషయానికి వద్దాం )..

వద్దులేండి నేనేమి చెప్పను నాకెందుకొచ్చిన గొడవ..కదా ...నాకేం తెలియదు నేనేం పొష్టుచేయలేదు చేయను కూడా
నాకు లైఫ్ ను రిస్కులో పెట్టుకోవడం ఇష్టంలేదు అందుకే కాంగా ఉందామనుకుంటున్నా...
....నాకు ఇప్పుడు ఇలాంటి అయిటం లు పోష్టుచేసి అమ్మాయిల తో తిట్టించుకోవడం అవసరమా..so COOL