. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 6, 2014

ఓ నిజం మరొ నిజాన్ని దాచి ఎవ్వరూ చూడలేరు అనుకొంటుంది

నాలో నేను మాట్లాడుతుంటా
వెన్నులో  వచ్చే అలజడిలో
నిన్ను చూడాలనే ఆరాటం 

గుండెల్లోంచి తన్నుకొస్తుంది
నీతో మాట్లాడాలనే 

ఉద్వేగం అధరాలపై
ఆత్రంగా నీపేరును పలుకుతొంది
నీ జ్ఞాపకాల ఆలోచనలు
ఉత్తుంగ తరంగమై 

ఎగసిపడుతుంటే
నేనేం కోల్పోయానో 

ఇప్పుడర్దం అవుతోంది
మనిద్దరి మధ్య జరిగిన  

మాటలన్నీ పోగేసి 
గుట్టలుగా చేసి నీ దగ్గరకొస్తే 
దగ్గరితనం దూరం అవుతోంది
నన్ను నేన్ దూరం అయ్యేలా చేస్తుంది
ఓ నిజం మరొ నిజాన్ని దాచి
ఎవ్వరూ చూడలేరు అనుకొంటుంది
అవమానంతో  తాళం 

పడిన నాలుక మౌనం దాల్చి
మడతపడిన నాలుకపై 

పన్ను దిగి రక్తం కారుతోంది
పోగేసుకొచ్చిన 

మాటలన్నీ ఎర్రగా మారాయి
రక్తాక్షరాలుగా మారాయి
కాని నాగుండెల్లో 

ఉన్న నీ చిరునవ్వులు
తెగిన దండలోని 

ముత్యాల్లా రాలిపోతున్నాయి
కాని పట్టుకుండామంటే దొరకలేదు
ఆ ముద్యాలను ఎవరో 

ఏరి నీమెడలో దండగా చేసి
నిన్ను అలంకరిస్తున్నారు 

నీవు సిగ్గుపడుతున్నావు
లిపి లేని చూపులైనా 
సూటిగా భావాన్ని
అర్దం చేసుకొవాలని 

నా మనసు పుటలు వెతికినా
అంతా చీకటిగా ఉంది 

ఏం కనిపించడంలేదు
నా మనో వేధనను కళ్ళల్లో 

నింపుకుని నీ ముందుకొస్తే
నీ చూపుల ఉప్పెనలో 

పడి నా చూపులు 
కొట్టుకు పోతే
ఒణికి తొణికిసలాడే 

మనసును ఉగ్గపట్టుకుని
గొంతు పెగల్చుకుని 

మాటలు రూపం దాల్చేలోగా
కనుమరుగై పోతావు
గుండె గొంతుకలో 

నలిగి పోయిన భావాలు
నిశ్శబ్ద గీతాలై నన్ను 

వెక్కిరిస్తున్నాయి.
ఈ నిశ్శబ్డం ఇక 

శాశ్వితమనిపిస్తుంది
అందుకే చీకటిలో 

ఒంటరిగా ఉండాలనిపిస్తోంది

నీకూ నాకూ మధ్య అడ్డుగా ఓ చీకటి తెర


నీకు దగ్గరవ్వాలని
నా అనుకునే ప్రపంచాన్ని వదిలేసాను
అపుడు తెలీలేదు
నీకు దగ్గరయ్యే పయనంలో
నాకు నేనెంత దూరమయ్యానో అని

నీకోసం ప్రపంచాన్ని నేను మర్చిపోతే
ప్రపంచాన్ని నమ్మి నువు నన్ను మర్చిపోతున్నావు
ఇపుడు నువు నాకు దూరమైతే
నా లోకం శూన్యం


నీకూ నాకూ మధ్య అడ్డుగా ఓ చీకటి తెర
అపార్ధాల ఊపిరి పోసుకున్న నిశ్శబ్దం
నా మాటలు వినే తీరిక
మనసు పంచుకునే ఓపిక
నీకు లేదు

అందుకే.....
వేదనతో రగిలే మనసుని
కన్నీటితో చల్లారుస్తూ
నా ఊపిరిని గాలిలో కలిపి
నీ వైపు పంపుతున్నాను
నువ్వొద్దన్నా నిను తాకొచ్చనే స్వార్ధంతో..

Tuesday, March 4, 2014

కొంచెం అటు ఇటుగా అందరూ అంతే ...స్వార్ద పరులు

కొంచెం అటు ఇటుగా
అందరూ అంతే  ...స్వార్ద పరులు

తన ఆనంద కోసం
ఎదుటి మనిషి 

మనసుతో ఆడుకోవడం
అన్నీ చేసి ఏం తెలియనట్టు
అమాయకంగా  నటించడం
ఒక్కొసారి ఏందుకో 

నన్ను నేను 
నమ్మని నిజాలను బుజాన వేసుకొని
ఎక్కడని తిరగను 

నన్ను ఎవ్వరూ నమ్మరు
నేను వాళ్ళకు 

ఆడూకొనే ఆట వస్తువుని కదూ ...?
అవే కళ్ళు అవే కళ్ళు
నన్ను నన్ను గా నిలవనీయని
అందమైన కళ్ళు
అవే కళ్ళు మిలమిలా మెరుస్తాయి
అవే కళ్ళు ఎడతెగని 

దుఖాన్ని కురిపిస్తాయి
అవే కళ్ళు క్రోధంతో ఎర్రబడతాయి
నన్ను అవమానించి తగలపెడతాయి

ఒకరిలోకి ఒకరు ప్రయాణించీ
నేణు మారమే ఒంటరిగా మిగిలిపోయా
ఇంకొకరిలోకి ఒకరు ప్రవేశించ లేక
కొన్ని రహస్య ప్రదేశాల్లో కొన్ని ఆశలతో
ఆత్రంగా తడుముకున్న ప్రతిసారి
నీవు పక్కన లేచూ నీకోసం వెతికితే
ఎక్కడో దూరంగా  

నీవు ఇంకొకరి వడిలో నీవు 
కరిగిపోతూ తన్మయత్నంలో 
ఉన్నావు అందుకే
ఆ దృశ్యాలను చూడలేక ..నా కళ్ళలో
మన జ్ఞాపకాలను గుచ్చి  రక్తం ఓడుతున్న
నన్ను నేను గాయ 

పరుచుకంటూ సాగుతున్నానిలా
నలిగిన మనసుకదా నాది
ఎలా నన్ను 

ఓదార్చుకోను కాస్త చెప్పవూ
దు:ఖ దు:ఖంగా..నిశ్శబ్ధంగా మౌనంగా
నేను ఇల తగల బడుతూనే ఉన్నా
నిన్ను మరొకరి కౌగిలిలో  చూసి 

తలవంచుకొని నడుస్తూనే 
ఉన్నా గమ్యం ఎటో తెలియక
  

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే
నీకిది తెలవారని రేయమ్మా…
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే

చెరిగింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లరిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే ఆరతివై
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంతరాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశము నీవై జారిపాడే జాబిలివై
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే



నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా

చెలి చెమ్మ గిల్లిన కళ్ళతో
చేదు అనుభవాలతో
చావుకు చేరువలో ఉన్న చరిత్ర లేని
శవాంగా మిగిలాను నేను  

నీ కోసం నిరీక్షిస్తూ
నీవు నాదానివి కావాలని
ఆకాంక్షిస్తూ  చెదిరిన
కలల్ని నెమరువేస్తూ
శూన్యం లోకి వంటరినై చూస్తూ
నీకోసం కలల పొలంలో
భ్రమలనే విత్తనాలను
నాటాను నేను
కన్నీటి కలువ ప్రక్కన
శూన్య ఫలసాయం
వస్తుందని తెల్సీ
ఇంకా ఆశతో
ఎదురు చూసే వ్యర్థ జీవి నేను
ఇలా గడిచే కలల కాలంలో
కరిగి పోతున్నా నని తెల్సి
కాలం నన్ను వెక్కిరిస్తున్నా
విదిలేని పరిస్తితుల్లో
వెక్కిరిస్తున్న గతం సాక్షిగా
ఓడిపోయి వాడిపొయిన
మనసు నాదే కన్నా
చివరకు నే చూస్తున్న శూన్యం లో
కలిసిన బాధలన్ని నాలోనే దాచుకొని
నన్ను నేను మరచి నీ ద్యానంలో మరణిస్తా
అదే నాజీవితపు చివరి మజిలీ  అని తెలిసిన క్షనాల్లో

Sunday, March 2, 2014

ఓడించావా ఓడిపోయానా కాస్త చెప్పవూ ..

కొన్ని  పలకరింపులంతే
వద్దన్నా పూల 
వాసనలు వెంటపడతాయ్. 
నిజమని బ్రమపడితే 
ఓటమిని జేబులో వెసుకున్నట్టే
కొన్ని పలకరింపులు 
ఒకప్పుడు చిరుజల్లులై 
మనసు లోతుల్లో 
మదిని తాకి మరుపన్నది లేని 
మరో లోకానికి 
తీసుకేల్లి ఇప్పుడు ఎవ్వరని 
అడిగితే సమాదానం చెప్పుకోలేక
నాలో నేను  అగ్నిపర్వతంలా 
పేలుతూనె ఉన్నా  లావాల నాలో   
భావాల్ని పోల్చుకోమని 
సవాళ్ళు విసురుతూ, 
పిట్టలు అవే పాటలు తిరిగి 
తిరిగి పాడుతూంటాయ్. 
ఆకాశంలోనుంచి ఊడిపడ్డ చినుకుల్లా
అక్కడక్కడా పరిచయమయ్యే 
మంచు బిందువులు, 
లేత ఎండలో 
కరిగిపోతాయనుకుంటాం. 
కరిగిన బిందువులన్నీ 
మట్టిలో నిద్దురోతూనే
కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్.
ఓడిపోయిన గతంలా మిగిపోయాను 
జాడలేని నీడనై తిరుగుతున్నాను ..
గుండెలో ఏ మూలో 
ఓ చిన్న గుడిసేసుకుని 
కూచుంటావని తెలుసు నాకు. 
సెలయేటి పాటలైతే 
బావుంటాయి కానీ , 
సముద్రపు 
హోరెందుకు నీకు? 
అందుకే , 
ఆ సముద్రానికీ, 
ఆకాశానికీ ఓ పందెం 
పెట్టి వదిలేశాను. 
నీను నన్ను ప్రేమనే 
బ్రమలో పెట్టావు 
నేను వాడిపోయి 
ఓడిపోయిన సంద్రాన్ని
ఇక నీ దాకా రాదు హోరు.
ఎందుకంటే నీళ్ళూ లేని  
సముద్రాన్ని ఇప్పుడు నేను 
నేను నీవు నానుంచి 
దూరం అయినప్పుడే
చచిపోయాను ..

నీవులేక అనాద 
శవంలా పడున్నాను
గుర్తుపట్టలేని అనాద శవంలా
 రోజు రోజుకీ కుళ్ళీపోతున్నా .. 
ఇప్పుడైతే గుర్తుపదతావు 
ఒక్కసారి వచ్చి చూసి 
పలుకరించి పోవా .. 
ఆతర్వత నీవచ్చినా 
నన్ను గుర్తుపట్టలేవేమో ..
ఒక్కసారి వచ్చిపోవా ప్రాణ సఖీ

Saturday, March 1, 2014

మనసు కాగితం లో తగలబడిన అక్షరాల సాక్షిగా

రాత్రివేళ లోకం అనే
చీకటనే దుప్పటి కిందా,
కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన 

గతం వెక్కిరిస్తుంది
కరుడు గట్టిన నిజం 

నైజం మార్చుకుంది
వాస్తవం గాఢత కోల్పోయి 

నల్లటి అక్షరాలుగా మారాయి
“కాలిన మనసు కాగితం లో 

తగలబడిన అక్షరాల సాక్షిగా ” 

నా  మది లోపల?
నువ్వు-నేను అన్న నిజం
అబద్దమైంది అని
నిన్నడీగితే
ఏం చెబుతావు?
నిజాన్ని కాదనగలవా
అబద్దాన్ని ఇప్పుకుంటావా
అక్షరాలు కూడదీసుకొని రాసే
కవిత్వంలో?
దుఃఖదాయకమైన జీవితంలోకి

కూరుక పోవడానికి  కారణం
నీవు చేసీన మోసమే కాదా...?
ఇప్పతి నాజీవిత గమనానికి కారనం 

నీవుకాదా నన్ను ఏమార్చింది నీవుకాదా ...?

నా ఎదనిండా ఖాళీ..
భర్తీ చేయలేని శూన్యం..
నా  ప్రశాంతతను 

ఎవరు భగ్నం చేస్తారు?
నాలో నేను ఎంత వెతికినా
కానరని  నాలోకి నేణు
తొంగిచూడాలనుకుంటా
మనసులో ఆశచావక
నీలోకి తొంగి చుస్తే
నీ మనసులో ఎప్పుడూ ఎవరో ఒకరు
తచ్చాడుతూనే ఉంటారు
నీలో నీవు చూడగల లోతెంత?
నిన్ను నువ్వు వెతుక్కుంటూ
నిన్ను నీవు చూసుకున్నావా
నిజాణ్ని అన్వేషించావా
అదే చేస్తే 
నీలో నిజాయితి చచ్చిపోయేది కాదు