. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 2, 2011

జ్ఞాపకాలన్నీ తడిచిపోయాయి...


ఏ స్మృతి కెరటమో
నా మనసుని
దభీలున తాకింది
మనసు పొరల్లోని
జ్ఞాపకాలన్నీ తడిచిపోయాయి.
జాగ్రత్తగా వాటిని
ఆరబెట్టుకుంటుంటే
ఆ తలపుల్లోంచి
నీ స్నేహ సుగంధం
గుప్పున తాకింది నన్ను.
పదిలంగా
నీ స్మృతుల దొంతరల్ని
ఏరి తెచ్చుకుని
ఓ మూల చేరాను...
మరలా నీతో గడపాలనిపించి...!
ఒక్కొక్కటిగా
బయటకు తీస్తున్నకొద్దీ
నీ గురుతుల మైమరపు
ఈ లోకాన్ని మరిపించింది.
నా చుట్టూ అంతా ఉన్నారు.
కానీ- నేను ఏకాంతంలో ఉన్నాను.
అంతా నన్నే చూస్తున్నారు.
కానీ- నన్ను చేరలేకపోతున్నారు.
కాదు... కాదు..
నేనే- నా చుట్టూ
ముళ్ళకంచె వేసుకున్నాను...
వాళ్ళెవ్వరూ నన్ను చేరకుండా...!
ఇదేమిటి..
నా కళ్ళు తడిబారాయి.
తడిచింది మనసు కదా...!
మనసు తడి కనులకూ పాకిందా..?
అదేమిటి..
ఆ తడి పొరలమీద
ఎవరివా అడుగులు..?
ఎవరు రాగలరు నా వైపు
నువ్వు తప్ప...!
ఎదలోతుల్లో బద్రంగా
పదిలపర్చుకున్న జ్ఞాపకాల్లో మాత్రమే
నిన్ను చూడగలననుకున్నాను.
ఇప్పుడిలా...
నా కోసం చేతులు చాస్తూ
కేవలం నా కోసం
మనసు తలుపుల్ని
తీసుకుని వస్తున్నావా...!
ముళ్ళకంచెల అడ్డుగోడల్ని
తోసుకుని వస్తున్నావా నేస్తం...!!
ఎప్పటిదాకా ఎదురు చూడను...
కాలం కన్నీని ని ఆపగలదా..

.. ఈ వేళలోనీవు ఏంచేస్తూ ఉంటావో...

ఈ వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావో అనే సాంగ్ చాలా మీనింగ్ పుల్ గా ఉంటుంది...దూరం అయిన ఇద్దరు ప్రేమికులు...ప్రతిక్షనం తలచుకోకుండా ఉండ లేరు అలా ఓకరికోసం ఒకరు ఆలొచిస్తూ ఉంటారు......కాస్త సమయం దొరకగానే ఏంచేసున్నావో ఇప్పుడూ అని తలస్తుంటారు...ఆ మాటను పాటరూపంలో అద్బుతంగా మలచినసాగ్...దూరంగా ఉంటూ మాయ చేస్తున్నావు...ఎటు చూసిన నీవే గుర్తుకు వస్తున్నావు ..అంటూపాడుకునే మెలోడి సాంగ్ ...అద్రరాత్రుల్లొ నీ ఆలోచనలతో నిద్దుర రావడం లేదు అన్నీ నీ ఆలోచనలే...పగలు కాసేపు కుడా పనుకు చేసుకోనివ్వకుండా చేస్తున్నావు.. నీతలపులే నన్ను చుట్టు ముడుతున్నాయి....అస్సలు ఏమి గుర్తుకు రావడం లేదు నీవు తప్ప అంటూ ప్రేమికురాలు పాడుకునే పాట..ఆ పాట వీడియో పొష్టు చేస్తున్నా చూడండి మనసును తట్టి లేపే సాంగ్ కదా..





....ఈ సాంగ్ శిల్పా అనే ఓ అమ్మాయి పాడి యూట్యూబ్ లో పొష్టు చేసింది....ఆ పాటలోని మత్తుని గమ్మత్తుని ఎంజాయీ చేస్తూ పాడింది మీరూ చూడండి.







ఈ పాటను అమ్మాయిలు ఎంతో ఎంజాయి చేస్తారు...ఎందుకంటే మనసుకు నచ్చిన వాళ్ళని గుర్తుకు తెచ్చే పాటకదా...అలాటి అద్చుత మైన సాంగ్ ను ఓ అందమైన అమ్మాయి పాడి యూట్యూబ్ లో పొష్టుచేసింది ఆ వీడియో చూడండి..

Saturday, January 1, 2011

...మనసాతుళ్ళీ పడకే...అతిగా ఆశపడకే..

...మనసాతుళ్ళీ పడకే...అతిగా ఆశపడకే..నాకిష్టమైన పాట అందుకే ఈ పాట నా బ్లాగ్ లో టైటిల్ గా పెట్టాను ..ఈ పాటవింటుంటే నామనసు ఎక్కడెక్కడో విహారిస్తున్నట్టు ఉంటుంది...ఒక్కోసారి మనం ఎన్నో ఉహించుకుంటాం...అన్నీజరగవు..ఊహ అనేది మనిష్టం అది జరగటం జరుగకపొవడం మనచేతుల్లో ఉండదు...అయినా ఈ పాట నన్ను...ఎక్కడికో తీసుకెలుతుంది...ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోది...ఊహల్లో తనకిష్టమైనవారిని ఉహించుకొంటూ పాడేపాటాయినా .... ఆ పాటలో ఉహ ఎక్కువున్నా నిజమైతే ఎంతబాగుండు అనే మీనింగ్ నాకు ఎంతోనచ్చింది..తనకిష్టమయిన వ్యక్తికోసం ఓ అమ్మాయి పాడేపాట ఇలాంటి అమ్మాయి కావాలని ఎవ్వరైనాకోరుకుంటారు..అది అందరికీ దొరకదు ఆ ఆధౄష్టం కొందరికే...అందుకే ఆపాటలో...ఊహల్లో ఊహించుకోకాని అతిగా ఆశపడకు అని మనసుకు సర్థి చెప్పుకుంటూనే..ఆ సుభగడియకోసం ఎదురుచూస్తున్నా అని ఓ యువతి పాడుకునే అద్చుతమైన పాట..తను ఇష్టపడ్డ వ్యక్తిగురించి ఊహల్లో తేలుతూనే అతనిని నచ్చానోలేదో అని ఎక్కడో చిన్న భయం..తన కిష్టమైన వ్యక్తి దక్కాలంటే..ఏ పూజలు చేయాలంటూ..తన ఊహల్లో పాడుకునే పాట మీరు చూడండి ఆ విడియో కూడా పోష్టు చేస్తున్నా ....

ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి



ఒకరికొకరం ఎవరో కుడా తెలియని స్థితి నుంచి
ఒకరికోసం ఒకరం అన్న పరిస్థితి కి తెచ్చే
అద్భుతమైన బంధం...స్నేహం
కళ్యానిరాగం అంత మధురమైనది
రక్తసంబందానికి మించిన ఆత్మసంబంధం ...
.................మన ఈ స్నేహం...


ప్రేమ గుడ్డిది అనుకుంటున్నారా ...కాదు
ప్రేమకు చూపు ఉంటుంది,
అ చూపే నాకు నిన్ను చూపింది
నా హృదయాన్ని నీ వైపు నడిపింది
నిన్ను నన్ను దగ్గర చేసింది
నా "మనసంతా నువ్వే" అనేలా చేసి
"నువ్వు లేక నేను లేను" అయ్యేటట్లు చేసి
తనను తానూ నిరూపించుకుంది...


నిన్నే నిత్యం తలుస్తూ
నన్నే నిలువునా మరుస్తూ
నా ఆణువణువూ లో నిండిన నీ తలపులను చూసి
నాలో నేనే మురుస్తూ
నీకై నిలువెల్లా తపిస్తూ
నీలో విలీనమయ్యే రోజు కోసం వేచి చూస్తూ,,,
నిన్ను నా ప్రాణం కంటే మిన్న గా ప్రేమించే నీ......


నీ రాక కోసం
వేచి చూస్తున్న నయనానికి ఎలా చెప్పాను... నిద్రపోమని
నీ పిలుపు కోసం
పలవరిస్తున్న హృదయానికి ఎలా చెప్పాను... మానుకోమని
ఎలా చెప్పినా,ఎంత చెప్పినా,,,
నా మాట వినదే....
తన మారం ఆపదే.....


గుండెలో ఆశను తెలుపలేదు నా మౌనం
చూపులోని ఆశను చదవలేదు నీ స్నేహం
తలపులలో నీవు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా...
తెలిసి ఈ తప్పులు చేస్తున్నా,,
అడగవే ఒక్కసారి అయినా నేస్తమా
నీ పరిచయం కలకరిగించేటి కన్నీటి వానేనా????????

వెల కట్టలేని వెన్నెల "స్నేహం"



"స్నేహమా"
ఏమని చెప్పను ...
విస్తరించిన వెల కట్టలేని వెన్నెల "స్నేహం"
మలినం లేని మృదువైన మౌనం "స్నేహం"
బంధుత్వం అవసరం లేని బలమైన బంధం "స్నేహం"
మమతలతో మైమరపించే మహా మాయ "స్నేహం"
ఆప్యాయతలతో అలరించే అనుబందం "స్నేహం"
వివరణలు అడగని విలువైన వాస్తవం "స్నేహం"
నిరూపణలు కోరని స్వచమైన నిజం "స్నేహం"
సరిగమలు అక్కర లేని వినసొంపైన సంగీతం "స్నేహం"
ప్రేమానురాగాలకు నిజమైన ప్రతిరూపం "స్నేహం "
కరుణ ,సహృదయతలకు కావ్య రూపం "స్నేహం"
కొందరికే సొంతం ఈ అపురూప వరం ఈ స్నేహం ...
"అమె" మన నిజమైన "శ్రేయోభిలాషి"
కొన్ని బాధలను వైద్యులు కూడా గుర్తించలేదు కానీ స్నేహితుడు గుర్తిస్తాడు ...
దేవుడు కూడా మాన్పలేని గాయాల నెన్నింటినో స్నేహం మాన్పుతుంది ...
అందుకే ఈ చిరు కవిత అలాంటి ప్రియ మిత్రులకు అంకితం ...

ప్రేమని వెతకాలా...?



ప్రేమ కోసం అన్వేషించే మనం
మనలోనూ
ప్రేమ ఉందని మర్చిపోతాం.
దాన్ని పంచాలన్న ఆలోచనే అస్సలు రాదు మనకి.

మనలోనే
ప్రేమ ఉందని తెలుసుకుంటే
దానికోసం
ఎక్కడో తిరగనవసరం లేదేమో...

ప్రేమకూ స్వేచ్ఛకూ సంబంధం ఉందా...?

అలాగే... ప్రేమకూ, నమ్మకానికీ, స్వేచ్ఛకూ సంబంధం ఉందా...?

మనలో తన మీద ప్రేమ ఉంటే నమ్మకమూ ఉన్నట్లేనా..?

ప్రేమ ఉంటే ఎంతటి స్వేచ్ఛైనా ఇస్తామా...?

http://premalo-manam.blogspot.com.... లోనిది....... బాగుందికదా..

ఆ సందేశం నీదే అనుకున్నా..



....క్షణం..క్షణం.. నీ సదేశం కోసం ఎదురు చూశా..

ఎందరో మిత్రులు తెల్సిన వారు తెలియని వారు న్యూఇయర్ సందేశాలు వస్తూనే ఉన్నాయి...

కాని కావాల్సిన వారు నుంచి మెస్సేజ్ వస్తుందని ఎందురు చూసినా రాదని తెల్సినా ఎక్కడో చిన్న ఆశ..

ఇప్పుడు నిజం నిర్ధారించుకున్నా ఎప్పటికీ రాదని..నీవు విష్ చేసేంత ____ కాదుకదా నిజమే మిత్రమా...?

నీవకున్నదే కరెకరెక్టు మిత్రమా..

ఇప్పటికీ నేననుకుంటా నీవు ఏనిర్నయం తీసుకున్న అలోచించి తీసుకుంటావు..ఆల్ ది బెష్టు