Friday, December 30, 2016

చచ్చిపోవాలని ఉంది...

చచ్చి పోవాలని...
ఈ లోకం వీడిపోవాలని...
నన్ను నేను దహించుకోవాలని...
అన్నీ వీడి మరణించాలని...
ఎన్నో సార్లు అనుకున్నా
అన్ని సార్లూ వాయిదా వేసుకున్నా...
క్యాలెండర్ లో తేదీలు మారినట్లు
నిర్ణయాన్ని మార్చుకున్నా...
బతకాలని లేకున్నా బతికే ఉన్నా...
మనసైన మనసులో
స్థానం కోల్పోయి
తుది అంకంలో
నా మనసులో విషాదం
నింపుకుని
పరాజితుడిగా
నిష్క్రమించలేక
బతికిపోయాను...
ఇప్పుడు మళ్ళీ
చచ్చిపోవాలని ఉంది...

Sunday, December 4, 2016

మూగగా రోదిస్తూనే వుంది మనస్సు

మనసు ఒక మౌనం, 
కాని నేను నీ మనసు లోని మౌనాన్ని 
మాటలుగా మార్చాలి అనుకున్నా,
కాని ఏమీ చేయలేని 
నిస్సహాన్ని అని తెల్సింది 
ఎందుకో పెదవులు 
కదలక మాటలు 
కాస్త మూగబొయినాయి
కళ్ళలొని కాంతి  తేజస్సు వీడి తన్మయం 
చెందవలసిన సమయం లొ 
తనకొసం తపించిన  మనస్సు  
మాటలను  కళ్ళతొ పలికించ లేక 
బింధువుల రూపంలొ 
కన్నీటి భాష్పలుగా పంపుతున్నాయి.... 
ఓ మాటలు  రాని మౌనమా. .. 
మనసులో ముగగా 
రోదిస్తున్న ఓ జ్ఞాపకమా 
నా  భాష్పలని  జలధారగా 
హా హృదయ బారాన్ని మోస్తూ 
ఆబారాన్ని వెచ్చని కన్నీటిగా బైటీకి తెస్తూ 
మూగగా రోదిస్తూనే వుంది మనస్సు 
నన్ను ఇలానే వుందనీ ఎప్పటికీ 
నన్ను  మార్చద్దు అని మౌనంగా 
పంపుతున్న సందేసం ఇది 
ఈ నా మౌన సంభాషణ శ్వాశగా నీ దరి చేరి 
నిన్ను  నా దరి చేరుస్తుంది
నీ పై మనసు చావక 
ఎప్పతి కైన ఎదురు పడతావని ఆశగా జీవిస్తున్నా