Wednesday, June 25, 2014

గుండె రాయిలా మరిపోయిందేమో అనిపిస్తోంది

నేస్తం నా చెంత నువ్వు లేని క్షణం 
నాకోసం నేనే వెతుకుతున్నా 
నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న 
ఈ కాలాన్ని ఆపలేకపోతున్నా 
గుండె రాయిలా 
మరిపోయిందేమో అనిపిస్తోంది 
నిన్ను అది మరచిపోమన్నప్పుడు 
మనసే నాకు లేదేమొ అనిపిస్తోందే 
నిన్ను చూడకుండ ఉండమన్నప్పుడు 
నేనే నేనుగా ఇక లేనా అనిపిస్తోందే 
నీ నుండి దూరం అయిపోతున్నప్పుదు 

నీ తలపులే కవితలై 
నా మదిని తడిమిన క్షణం 
చిరుగాలినై నిన్ను చేరాలని 
నా ఇష్టాన్ని నీ ముందు ఉంచాలని 
ఆ క్షణం నీ కళ్ళల్లో కదిలే భావాలను చదవాలని 
నా మది ఆరాటపడుతోంది నేస్తం