Sunday, May 12, 2013

మదర్స్ డేరోజు ..అమ్మలేని నేను ఒంటరిగా .. అమ్మజ్ఞాపకాలతో

అమ్మ అమ్మ అమ్మ.
నా మోము చిన్నబోతే
తను చిన్నబుచుకుంటుంది.....
నే ముభావంగా ఉంటె...............
భారమైన నిట్టుర్పవ్తుంది

నా కంట నీరు చిమ్మితే
తానో వర్షించే మేఘమావ్తుంది.
అర్ధరాత్రి దాక నా గదిలో దీపం వెలిగితే.

దరి చేరిన నిద్రదేవిని దూరంగా పొమ్మంటుంది.
కలత మనసుతో నేను కనిపిస్తే తను కకావికలమవ్తుంది.....
ఉద్దోగ భారంతో ఊసురుమని ఇంటికొస్తే ఊద్దేపించే ఊదార్పువ్తుంది ......
బడలికతో బద్దకిస్తే.................
బలవంతపు గోరుముద్దవ్తుంది ..........................
అస్సలు ఏమాత్రం తనకి నే సమయం ఇవ్వకపోయినా.................
అహరహం నాకై సతమతమవ్తుంది...........
మౌనంగా నా పని నే చేసుకుంటున్న 

మనిషినైన ఎదుట ఉన్నానని మురిసిపోతుంది.........................
పుట్టి బుద్దిఎరుగక పనిలో ఎ సహాయం చేయకపోయీన 

పదిమందికి నా బిడ్డ సహాయపడుతుంది అని గొప్పలు చెబుతుంది..
పదిమంది దగ్గర ప్రదర్శిచిన ప్రశాంత తన దగ్గర 
చిరాకు ప్రదర్శిచిన నా చిట్టి తండ్రికి అంత కష్టం వచిందేమో అని
చింత పడుతుంది.అందకే నాకుఅమ్మంటే అంత పిచ్చి 


Note :- నా మనసుకు నచ్చిన నా స్నేహితురాలు నాతో మాట్లాడుతుండగానే అమ్మ చనిపోయిన వార్త తెల్సింది .. అప్పుడు తను ఇచ్చిన దైర్యం నేను చనిపోయేవరకు మర్చిపోను ... ఇప్పుడు తను నాతో మాట్లాడకపోయినా ఎక్కడున్న తను హేపీగా ఉండాలి Sar....)