. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, May 31, 2013

నా నమ్నకం నిజంలా బ్రమింపజేసి మోసం చేసింది

కొన్ని నిజాలు ఒకో క్షణం,
నన్ను ప్రశ్నిస్తాయి..
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నేనేంటో తెలియని నన్ను 

నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
వెక్కిరిస్తున్నాయి..వెర్రివాడిని చేస్తున్నాయి
నా నమ్నకం  నిజంలా బ్రమింపజేసి మోసం చేస్తాయి
నా నమ్మకం  నా జ్ఞాపకాలను వెక్కిరిస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి

అందరిలో నన్ను దారుణంగా అంవమానిస్తాయి
 నీ ఆలోచనలు అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి నన్ను 

చంపడానికి కూడా వెనుకాడవు
నే పోరాడలేనని ఎదిరిస్తే..నాకు దూరమై శిక్షిస్తాయి

పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు

ఎక్కడో నీవు కనిపించగానే చల్లటిగాలికి
మేఘ మాల పరుగులు తీస్తుంది
నీ దరిచేరి నీతో ఊసులు చెప్పాలని దాని కోరిక
కాని నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి
వాటి వెనక తారలూ తళుక్కుమంటున్నాయి
నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో

 నిజంలాంటి బ్రమలా నిండు పున్నమిలా
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
చల్లటిగాలికి లయబద్దకంగా  చల్లటిగాలికి తలలూపుతున్నాయి
ప్రశాంతత అంతా ఆవరించి ఉంది
మాములుగా అయితే ఈ బాహ్య స్థితి నాలో 

ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది
కానీ ఇప్పుడేంటి?ఇంతలా మారిపోయాయి?
పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు

గతకాలపు గాలితాగికిడికి కొట్టుకపోయాయేమో
గడచిన క్షణం ఏం పలికించింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు
అంతా శూన్యం..నిర్బేద్యం

సూర్యుడు శరీరాన్ని చురుక్కుమనిపిస్తున్నాడు..తిరగబడ్డ ప్రియురాళ్ళా..

నిన్న కురిసి వాన తో ప్రకృతి చల్లబడింది
తేమను విడిపించుకున్న గాలి 

అప్పుడే రెక్కలు విచ్చుకున్న
సీతాకోక చిలకలా పొడి పొడిగా 

వడి వడిగా పరుగు పెడుతున్నాడు
ఇప్పుడే పైకొస్తున్న సూర్యుడు 

శరీరాన్ని చురుక్కుమనిపిస్తున్నాడు
నన్ను కాదని చల్లబడతారా అని
సూర్య బగవానుడు ...తన ప్రతాపం చూపించి
బగ బగ మండేందుకు సిద్దంగా ఉన్నాడు
తిరగబడ్డ ప్రియురాళ్ళా..

మొసం చేసే ప్రియురాలు
ఇచ్చే ప్రేమ కుడా అంతే
ఏదైనా కొన్నాళ్ళా ఆతరువాత మిగిలేది అంతా వేదనే
అవమానించి ..అట్టడుకు తోసేస్తుంది
ఎవరి వంచనో చేరి ఇష్టం వచ్చినట్టుమాట్లాడి
అవమానం చేస్తుంది ..గుండెలు పగిలేలా ఏడ్వాలి కదా

 

నా కన్నీరు అయిపోయింది


Thursday, May 30, 2013

నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తాను


నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తాను
ఆశగా అమాంతం గా

నీ లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
నీ హృదయం వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే  చూస్తుంటావు 

ఆచూపుల్లో అర్దం తెలీదు
ఎంతగా వెతినా దొరకని భావం నీ కళ్ళలో
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని

ఎందుకంటే ఆచూపుల్లో అర్దం 
పసిగట్టలేనని నీకు తెల్సు
తెల్సే అలా చేస్తున్నావనీ తెల్సు ..

నీకది అలవాటేగా
అందుకే వీడ్కోలు చెప్పకుండానే 

వెళ్ళిపోతాను అందుకే నీవనుకుంటావేమో
నా మనసుకు కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదని

నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను..ఎంతకీ లెక్కతేలలేదు


చీకటిని అందంగా చూపే నీ వెలుగులో 

చుక్కలని తిరిగి లెక్కబెట్టాను..ఎంతకీ లెక్కతేలలేదు
కవ్వించే నీ ఉనికితో నువ్వు నా ఎదురుగా పెట్టిన ప్రశ్నలెన్నో
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు 

సమాదానానికి ప్రశ్నే సమాదానం అయిన క్షనంలో
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..నేలపైనేను


కాలం ఏ మాయ చేసిందో..
నానుంచి నీ చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత  గా మారిపోయావు


ఈ క్షణపు నీ విలువ ఎంత అంటూ
నీవెవరంటూ నన్ను  ఎదురు ప్రశ్నిస్తున్నప్పుడు
జారిపడిన నా కన్నీటి బొట్టే సమాదానం
అది గమనిచలేవు .. దరిచేరలేనంతదూరంలో నీవు

 నీ దూరం ఎంత దగ్గర అంటూ..నాచుట్టూ పరుదులు పెట్టావు
నీ పేరుపలకొద్దని  షరతులు పెట్టావు
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు..గుడ్డివాడిగా నేను

పదునైన కత్తితో నాగొంతు నిలువునా కోసి
మాట్లాడమంటే ఏం మాట్లాడను...
మూగగా నీకోసం రోదించడం తప్ప..?

ఫేస్ బుక్ లో కొత్తప్రయోగం.. మీఫొటో .. మాకవిత

http://www.facebook.com/MaKavitakuMireModal?ref=hl

నా నీడకే నేను చేదు జ్ఞాపకంగా మగిలాను.

నీ గుండెలోని ఆశలకు 
నేనే ఊపిరి అన్నావు 
నీ కళ్ళలోని వెలుగుకు 

నా ఊపిరే దారన్నావు
నీ కలకాలం జీవితానికి 

నా నవ్వే కానుక అన్నావు
ఈ క్షణం నా పరిచయమే 

లేదంటూ దూరంగా నన్ను  నెట్టేసావెందుకో

 బరువెక్కిన మనసుతో 
భరించలేకపోతున్నా  
నీవు లేని నేను ఒంటరి అన్న 
మాటకు దాస్సోహం కాలేకున్నా 
నీవు లేని నేను లేనన్న 
నిజాన్ని ఎప్పుడు తెల్సుకుంటావు సఖీ
 కను పాప చాటున దాచాను నీ రూపాన్ని 
మనసు చప్పుడులో కలిసిందే నీ జ్ఞాపకం  


నీ జ్ఞాపకాల  కడలికి నా కళ్ళు అంకితమయ్యింది
నా నీడకే నేను చేదు జ్ఞాపకంగా మగిలాను.





ఆ మాట కాస్త చెప్పెయ్యమంటోంది మనస్సు

గుసగుసలతో నా గుండె ....
నీ కోసమే కొట్టుకుంటుంది
నాలోపల అగ్నిలా దాగిన
ఆ మాట కాస్త చెప్పెయ్యమంటోంది 
మనస్సు  

ఆ విషయం చెప్పాలి అంటూ నీ దాక చేరేదాక
కంగారు పుట్టిస్తుందే నా పిచ్చి మనస్సు
చిలిపి రహస్యాల తగాదాల తమకంలో
నన్ను ఉడికించి చంపేస్తోందే నామనస్సు


చెప్పాలని వున్నా చెప్పలేను అంటూ మనస్సు 
నిమిషాలు , క్షనాలు అంటూ ఇలా  
ఎన్ని రోజులు గడపానో
మనిద్దరి మద్యా  కరిగే రేయి, 

పగలు ఎన్ని నన్ను  దాటి వెళ్ళాయో
అయినా నీకెందుకో  చెప్పలేకపోతున్నా 

ఆ మదుర బావం
ఏమంటావో, ఏమో అంటూ 

అనుమానం కలుగుతుందే
నా మాటల్లో నువ్వే ఆ బావం 

తెలుసుకొవే  నా ప్రియ సఖి

నీకొసం వేచి వేచి నా శ్వాస ఆగిపొతుందెమూ

నా హ్రుదయ పల్లకి పై
హాయిగా సేదతీరుతున్నవు
నేను మాత్రం నీ భారాన్ని మొస్తూ
నిత్య కష్టాలు పడుతున్న
ఐన కూడ నీకు నా మీద దయ లేదు.
జాలి అంత కన్న లేదు.
నీకొసం వేచి వేచి నా శ్వాస ఆగిపొతుందెమూ
అని బయం గా ఉంది
నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడ లేదు

- Angel..

Wednesday, May 29, 2013

అందకుండా జారిపోతున్న రాత్రిని పట్టుకోవాలన్ని ...విఫల ప్రయత్నం

నిశ్శబంగా స్థంభించిన
కాలంసమక్షంలో..
కార్చిచ్చులా రగిలి
నీ తలపులకు గుండె మంటల
వేడికి కరుగుతున్న రాత్రికి
కన్నుల్లో  వేడెక్కి కార్చిన కన్నీరు సాక్షిగా
అందకుండా జారిపోతున్న రాత్రిని పట్టుకోవాలన్ని
విఫల ప్రయత్నం ప్రతిరోజు రాత్రుల్లలో
జరిగే నిరంతర ప్రక్రియే కాని..
ఏక్కడో చివుక్కుమంటున్న నమ్మకం
ప్రతి రాత్రి నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూసి
అందని జాబిల్లి ఆకాశంలో
నా వైపు చూసి పక్కున నవ్వుతోంది
ఇంత చల్లని పకృతికూడా
వెన్నేల వేడి పుట్టిస్తున్నాయి నీతలపులు
నా గొంతులొ నరాలు పగిలి
రక్తనాళాలు చిట్లిపోయేదాకా పిలిచినా నా పిలుపు
వినిపించలేదెందుకో ఎందుకో ఈరోజు రాత్రి
నిస్పృహ నాకంటే ముందే మనస్సులో దూరింది
నిద్రా దేవి ని రాకుండా అడ్డుకునేందుకు
రోజుకన్నా ముందే.. పరిగెత్తుకొచ్చేసింది
గతం లోని నీజ్ఞాపకాలు మనసు
అంతరాళ్ళో అలజడి రేపుతుండగా 

చిన్నగా మొదలైన చినుకుల శబ్దం ( Hyderabad వర్షం కురుస్తోంది )


నల్ల మబ్బులు మెల్లగా నింగి కొచ్చాయి
మెరుపు దెబ్బకు మబ్బు చిరిగినట్టుంది,
చినుకులు చిన్నగా కారుతున్నాయి
చల్లటిగాలి రివ్వుమంది..మది జివ్వుమంది
చిన్నగా మొదలైన చినుకుల శబ్దం
లయబద్దంగా పెద్దదై.. 

అద్బుతమైన సంగీతం వినిపిస్తోంది
వాన ఈడ్చిన మట్టివాసన ..

మదిలో ఊసులు చెలరేపింది
కాసంత సేపు ఉరుములా 

వచ్చిన ఉల్లాసం హాయిగా మనసును దోచింది మరి

చూపుల్లోని భావాలు చెప్పతరమా



నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తున్నాయి

ఒకో క్షణం,ఒక్కో నిమిషం
జ్ఞాపకాల నిజాలు నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ అనంత విశ్వంలో
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తున్నాయి
అనుక్షణం నన్నువెంటాడుతూ
నాతో పోరాడతాయి...
నన్ను రక్త సిక్తం చేసి
గాయాల పాలు చేస్తున్నాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి నీ నీజ్ఞాపకాలు

మనసుల జాడ తెలియని వేళల్లో 
ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా 

అవి పంచే పండు వెన్నెలలైనా
వెంటే నిలిచే నీడలవుతాయి 

నిర్బేద్యంగా కనుమరుగవ్వాలని చూస్తున్నాయి
నాలో నుంచి నిన్ను నువ్వు 
కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు 

నువ్వు అందుకోలేని 
అవదుల్లేని దిగంతాల దూరమైపోతున్నాయి

Tuesday, May 28, 2013

ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...అది నా మరణానికి ముందా తరువాతా...?

ఊసులు చెప్పిన నీ కళ్ళు,
నన్ను మర్చిపోయాయా..?
మరెందుకు మౌనంగా ఉన్నాయి ?
కోటలు దాటిన మన మాటలు,
ఇపుడు మరణించాయా...?
మరెందుకు ఆ శబ్దతరంగాలు ఆగిపోయాయి
ప్రతి క్షణం మనమద్యి రేగిన అలకలు,
అవీ అలిగాయా? ఎందుకు?
సద్దుకు పోతూ కనుమరుగయ్యాయా ?
సరసాలు సరాగాలు చల్లబడ్డాయి ఎందుకో ?
మనసులో ఊసులు మౌనందాల్చాయి...
దారి తెలియకనా దారి తప్పాయా చెప్పవా..?
"మనం" నుంచి "నీవు" "నేను" 

గా ఏందుకు విడిపోయాం
మన మద్యిలో పిచ్చిమొక్కలు 

మొలిసాయి అవి అడ్డొస్తున్నాయా..?
వాటిని తెంపేయి అవసరం అయితే 
అడ్డంగా నరికేయి..లేదంటే 
నేనది చేస్తా ఎవ్వరడ్డొచ్చినా వాళ్ళ 
అంతు చూస్తా నేనేంటు చూపిస్తా వాళ్ళకు

నీకు నాకు మద్య ఏమంత దూరం
భావానికి భావుకతకి మద్య సృజనాత్మకతేగా
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న దూరమేగా..?
మౌనానికి మాటకి మద్యనున్న దూరం ఎంత
ఆశకి ఆచరనకి మద్యనున్న సంకల్పమేగా..?
ఆచరణకి అహానికి మద్యనున్న అంతరంమేగా..?
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమేగా
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....
నువ్వు నా కోసం రావా
నువ్వు ఎదురైయ్యే క్షనాల కోసం
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...
అది నా మరణానికి ముందా తరువాతా...?

నా శ్వాశను ఆపేయనా మరి నీకోసం


నాస్నేహానికి ఇంత విలువ ఉందా...?


నా జ్ఞాపకాల గనుల్లో నీ తలపులు మన మాటల ఊసుల తవ్వకాలు

నా జ్ఞాపకాల గనుల్లో నీ తలపులు
మన మాటల ఊసుల తవ్వకాలు
గతం నుంచి వచ్చిన వన్నీ నీకై తెచ్చా
మన మాటల మూటలు ఒక్కోటి విప్పనా
నీవే నాకు సర్వస్వం..నీ ఆదరణ కోసం
చకోర పక్షిలా ఎదురుచూస్తున్నా
ఈ ఏమరపాటులో ఏమైపోతానో తెలియట్లా
నాకిక వేరే జ్ఞాపకాల గనులూ లేవు
ఇంకా తవ్వే ఆశాలేదు..నేనింతే మారను మారలేను


నా కవితకు ఊపిరి పోసిన దానివి
నా మనసు లోతులు తెలిపిన దానివి
నా చూపులో ఆర్ధ్రత నింపిన దానివి
నా మాటకు మధువును కలిపిన దానివి
నా భాదలను బందీని చేసిన దానివి
నా తలపుకు రంగులు పులిమిన దానివి
నా రాతలొ అర్ధం అద్దిన దానివి
ఈ మాటల గారడి వెనక దాగిన
మర్మం నీకు తెలియదా నేస్తం

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

తీయని మాటలు లేవు
మూగ బాసలు లేవు
చిలిపి చేష్టలు లేవు
ఆశలు లేవు కలిసి కన్న అందమైన కలలు లేవు
మరి ఎదో జ్ఞాపకం వెంటాడి వేదిస్తూ నన్ను నిలువునా దహించివేస్తుంటే
కన్నీరు కూడా ఆవిరైపోతుంది ఏమిలేని ఆ జ్ఞాపకాల సెగలో..
ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో
ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో
ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని
ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో
ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి
ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో
ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో
ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో
ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు
నన్ను దహించివేస్తున్నాయని
ఎవ్వరికి తెలియియదు నన్ను
నాకు కాకుండ చేసిన నువ్వంటే ఎంత అభిమానమో
కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు

Monday, May 27, 2013

గతాన్ని మింగిన విషాదాన్ని నా ప్రస్తుతంలో పారబోసి చూసుకోవాలని చూస్తున్నా

చీకట్లో నిశ్శబ్దం నా అంతరాత్మ
పాడే  విరహ గీతంలా సాగుతోంది 

నిట్టూర్పుల వేడి వేదనలా
ఈ సమయంలొ నిమిషాలను కాలం అనే కలంలో
నింపుకొని కవిత్వాన్ని రాస్తూ కనిపించని 

నీకై అక్షరాల్లో వెతకాలనే ప్రయత్నం
బాధలొ భావుకత వెతుక్కుంటూ 

నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
గతాన్ని మింగిన విషాదాన్ని నా ప్రస్తుతంలో 

పారబోసి చూసుకోవాలని చూస్తున్నా 
వేదనగా వెర్రివాడిలా నీకోసం
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకారణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను

ఈ రాత్రి నాకు తెల్లారిందో నేనే తెల్లారానో
నాకదే తెలియని నన్ను వేదిస్తున్న ప్రశ్న..

గుండె చప్పుళ్ళు ....నీకు వినిపించని నిశ్శబ్దాలు

1) నీ ఊహలకు నా మనసు ఎలా బానిస అయ్యిందో చెప్పలేను కాని నా ప్రతి కదలికా నీ కోసమే

2) కారే కన్నీటికి అలుసైపోయాను . . .నీ కోసం ఎదురు చూసి అలసిపోయాను

3) నీ జ్ఞాపకాలను మరవాలని ప్రయత్నిస్తున్నా ఈ ఒంటరితనం నిన్ను ప్రతి క్షణం గుర్తుచేస్తూనే ఉంది

4) భారమైతే చెప్పు దూరమవుతాను

5) అబిమానం కలవాన్ని ఆదరించకపోయినా పర్లేదు ప్లీజ్ అవమానించకు ..?

6) ఎవరు చూసారు గనుక....జారుతున్న కన్నీటిలో రేపటి స్వప్నాలు ఉన్నాయని

7) మనసుకేమోమరుపే లేదు కంటికేమో కునుకే రాదు .

8) నీతో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
నాకు తెలీకుండా కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి


9) గొంతులో పలికే భావాన్ని విని మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను

10 ) నీ ప్రేమతో నిండిన మనసేమో మారం చేస్తుంది నేనేలా ఉండగలను మాట్లాడకుండా
నాదైన గొంతుని ఆపగలిగాను కాని నాది కాని ఈ మనసుని ఎలా ఆపగలను 


11) ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి 

12 ) కొత్త స్నేహితుల్ని పెంచుకునే తొందర్లో..పాత స్నేహితుల్ని మరువకండి..!! 

13) నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా...మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరనించేందుకు నేను సిద్దం 

14 ) నీ మాటల గారడీలో నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన రెప్పలు చాటున రాలకుండా
కళ్ళలో మిగిలిన నా కన్నీటి సాక్షిగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా


15) నీ మనసు గుట్టు విప్పకుండా ...నీవు బందించిన నా జ్ఞాపకాల సాక్షిగా నా మాటలను గుండెల్లో బంధించి భారమైన నాగుండె భాద నీవు తెల్సుకునే దెలా...?

16) రాత్రి కొమ్మల మీద పేర్చిన నల్లటి మబ్బులు తమ కలల గుండెల్లో నీళ్ళు తోడి పోస్తున్నాయి సొగసు తుంపరలు తమనిండా నింపుకొని నీకోసం ఎదురు చూస్తున్నాయి   

17) నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే ఆశతో నీ వైపు దీనంగా చూశాను 

18) నా పిచ్చి గుండెకు గాయం చేసి వేణువులా మ్రోగమంటూ తిరిగి బ్రతికిన జ్ఞాపకానికి ఏమని చెప్పను

19) కొవ్వొతి ఆశగామారి చుట్టూ చీకటిబాధను పలుకరించింది ..
బ్రతుకు పండుతుందేమో అని ఆ నింగి ఉదయం కోసం ఎదురు చూస్తూ ..?
 


20 ) నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి తన కోపంతో కిరణాలను బైటికి తీసి గుచ్చుతున్నాడు ఒక్కొక్కటిగా
 

అద్బుతమైన స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్


స్నేహం అంటే ఓ విడదీయని బందం
స్నేహం అంటే మనసులో గాయానికి మందు
స్నేహం అంటే ఆవేదనలో ఓదార్పు
స్నేహం అంటే ఆశలో శ్వాస
స్నేహం అంటే నిట్టూర్పులో ఓర్పు
స్నేహం అంటే మనస్సులో తియ్యటి అనుబూతి
స్నేహం అంటే భాదలో వచ్చే కన్నీటికి ఓదార్పు,.
స్నేహం అంటే వసంతంలో చిరుజల్లు
స్నేహం అంటే మదిలో రేగే భావాలకు ఓ రాగం
స్నేహం అంటే మనస్సుకు ఉల్లాసం
స్నేహం అంటే నీకేంజరిగినా నేనున్నా అంటు ఓదైర్యిం
స్నేహం అంటే ఓ దీమా..కదా ఈ స్నేహం గురించి
ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి స్వచ్చమైన స్నహం ఉందా..
స్నేహం అంటారు.. ఎవరి కోసమో ఆస్నేహాన్ని భాదపెడటారు
తన కిష్టమైన స్నేహితుడు భాదపడినా వాళ్ళకు చీమకుట్టినట్టు ఉండదు
ఇంత అద్బుతమైన స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్

నీవు మారతావన్న ఆశ చచ్చిపోయింది


Sunday, May 26, 2013

నిజమైన స్నేహితులు విడిపోవాలంటే చచ్చిపోవాల్సిందే


KBR పార్కుకు అందమైన అమ్మాయి రమ్మంది .. ఆతరువాత ఏమైంది ( Real Story )..Part-1

ఏంటో కొందరు మనుషులు ఎందుకు పరిచయం అవుతారో తెలీదు... ఒక అమ్మా  పరిచయం అయిందిమీరు రాసే కవితలు ఎవరికోసం అని అడిగింది ఎవ్వరికోసం కాదు అలా రాస్తుంటాను అన్నాను.. కాదు ఎవరో ఉన్నారు చెప్పకూడదా అని గుచ్చి గుచ్చి అడిగింది అయినా నేను సరిగ్గ రిప్లై ఇవ్వలేదు తను ఎప్పటినుంచో బ్లాగ్ ఫాలో చేస్తాను అని చెప్పింది...ఇది కామన్ డైలాగే అని లైట్ తీసుకున్నా..తరువాత ఫేస్ బుక్ ఫ్రెండ్ అయింది....ప్రతిరోజు నేను ఎప్పుడు ఆన్ లైనుకొస్తానో తెల్సుకొని మరీ చాట్ చేయడం మొదలు పెట్టింది..ఎందుకో ఇదీ కామన్ గా అందరూ అడిగే ప్రశ్నే కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు..మరోజు చాట్ లో నేను మీగురించి మీపోష్టుల గురించి చాలారోజులుగా తీవ్రంగా ఆలోచించానండీ అంది .. అప్పుడు మనస్సులో అబ్బా అనుకున్నా ఫేస్ బుక్ లో ఏవరో ఫేక్ అబ్బాయి ఎవ్వరో నాతో బానే ఆడుకుంటున్నాడే అనుకున్నా.. అయినా ఎందుకులే అని నీవు అబ్బాయివా అమ్మాయివా అని అడిగా ... ఎందుకా డౌట్ అని ,.. నేను అమ్మాయినే అందమైన అమ్మాయిని అని చెప్పింది .. అంతే అందం గురించి అదీ  తాను చాలా అంద గత్తెను టని చెప్పడం చూసీ అమ్మాయో అబ్బాయో తెలీదు ..బాగా ఏగష్ట్రాలు అనుకున్నా మనస్సులో రోజు చాట్ లో ఏదో అడుగుద్ది ...నేనేదో చెబుతా .... అయినా పట్టు వదలక మీలాంటి ప్రేమికుడు కావాలని అమ్మాయి కోరుకుంటుంది అంది అవునా అన్నా... మీమ్మల్ని మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు అనీ అడిగించి.. మళ్ళీ అయినా చెప్పలే..అప్పుడో అమ్మాయి ఇంతకంటే అబిమానం చూపించింది చివరకు ఏమైంది "కోన్ కిస్కా గొట్టం" లా మిగలాల్సి వచ్చింది..నాకెందుకొచ్చిన గొడవని ఏంచెబుతుందో అని ...నా ఫోన్ నెంబర్ కావాలని అడీగించి.. నేను ఇవ్వను మీరెవరో తెలీదు.. అన్నా.. లేది ఇవ్వండి ప్లీజ్ మీతో మాట్లాడాలి అంది..ఇవ్వను అన్నా ఎలా తెల్సుకుందో నేను ఓ ఆదివారం ఫోన్ చేస్తాను మీనెంబర్ దొరికింది అని అంది నాకు షాక్ .. కావాలని అంటుందిలే అని నేను లైట్ గా తోసుకున్నా ... నిజంగానే .. శుక్రవారం చెప్పింది .. ఆదివారం 11  గంటలకు ఫోన్ చేసింది .. చాలా స్వీట్ వాయిస్ ..నిజమా అనిపించింది..చాలా బాగా మాట్లాడింది ... అయినా ఇలాంటి స్నేహాల జోలికి పోకూడదని నిర్నయించుకున్నా ...రోజు మెస్సేజ్ లు అప్పుడప్పుడూ ఫోన్లు చేస్తూనే ఉంది పెద్దగా ఇంటరెష్టుగా మాట్లాడలేదు...ఎందుకో ఓరోజు మీరు ప్రీగా ఉన్నప్పుడు చెప్పండి మీతీ సీరియస్ గా మాట్లాడాలి అంది ఎం చెబుతుందో చూద్దాం అని టైం చెప్పా ఓరోజు సాయంతం ఆరు గంటలకు ఫోన్ చెసింది.నాగురించి చెప్పాలనిఉంది అంది చెప్పడి అన్నా అప్పటికే పెద్దగా ఇంట్రెష్టులేదు...తను చెప్పడం మొదలు పెట్టింది  MBA చదువుకున్నా మా ఫాదర్ కు నేను మా అన్నా ఇద్దరమే..మా అమ్మలా నేను చాలా అందంగా ఉంటాను ... నాన్న బాగా సంపాదించారు ఎప్పుడూ బిజి బిజి గా ఉంటారు.... అమ్మా కూడా వచ్చే పోయే వాళ్ళతో బిజి .. ఏదికావాలన్నా ఇస్తారు .. కాదనరు .. అచ్చుతెలుగించి అమ్మాయిలా పెంచారు అమ్మమ్మ వాళ్ళ ప్రభావం ఉంది అందుకే తెలుగుతనం అంటే చాలా ఇష్టం అంది... అవునా అన్నా..కాని నాకు ఏదో లోటుగా ఉంటుంది..కాలేజిలో చాలా మంది ప్రేమలేకలు రాసారు.. డైరెక్టుగా చెప్పారు.. కాని ఎందుకో నాకు ఎవ్వరిమీద మనస్సుపోలేదు..ఎందుకంటే వాళ్ళు నన్ను నన్నుగా కాకుండా నా అందాన్ని ఆస్తిని ప్రేమిస్తున్నారనిపిస్తుంది ఎవ్వరిమాటల్లో నిజాయితీ లేదు... నేను కాలేజికు కార్ లోనే వెలతాను  ఎందుకో ఏమో నాకు ఒంటరితనం అంటే ఇష్టం..ఒక్కోసారి రాత్రుల్లు ఒక్కదాన్నే నారూంలో పడూకొని ఆలోచిస్తే ఏం అర్దం అయ్యేది కాదు...మిమ్మల్ని అర్కూట్ లో చూశాను అప్పుడే మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చారు అని చెప్పింది ..అప్పటినుంచి మీ బ్లాగ్ ..బ్లాగ్ లో చూపించే పిచ్చిప్రేమ నాకు మనసుకు నచ్చింది అందుకే ఏన్నోరోజుల తరువాత ఫేస్ బుక్ లో మళ్ళీ ఎంటరై మీతో పరిచయం పెంచుకున్నా అంది..అన్నీ ఉన్నా నేను ఒంటరిగా ఫీల్ అవుతాను . నామనస్సుకు నచ్చిన ఫ్రెండ్ దొరకలేదు అని దాదాపు ఏడ్చినంత పని చేసింది ఎందుకో అప్పుడో మనిషి గుర్తుకొచ్చింది.. ఆమనిషిలా ఇమెకూడా డ్రామా ఆడుతుందా అనిపించి అన్నివింటూన్నా ఏమేమో చెబుతుంది నన్ను నన్ను గా పిచ్చిగా ప్రేమించే మనిషికావాలి అంది ..అయితే నన్నేం చేయమంటావు అన్నా.. మిమ్మల్ని ఓసారి కలవాలి అంది .. అందమైనంది అంటు అమ్మాయి అంటుంది కలవాలి అంటుంది ....ఎక్కడ కలుద్దాం అంటే   KBR పార్క్ లో కలుద్దాం అని చెప్పింది ...నీలా నన్ను పిచ్చిగా ఇష్టపడాలి .. నన్ను చూస్తే మాత్రం మీరు నన్ను వదలి పెట్టరు అంది అబ్బా అనుకున్నా అయినా మనసులో ఎక్కడో గుబులు అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి ఏమాసించి నాతో స్నేహం చేయాలని అనుకుంటుంది .,... మాటి మాటికి నేను ఒంటర్ని నాకు తోడుకావాలి అది నీవే ఎందుకు కాకూడదు అని చెప్పడం తాను చాలా అందగత్తెను చూస్తే నన్ను ఇష్టపడకుండా ఉండరు అని చెప్పడంతో ఇంటరెష్టు పెరిగింది గత అనుభవాల దృష్ట్యా గుండెదడ పెగిగింది....ఏంటో మనిషి ఇలా ఎందుకౌతాడు అందనికి దాసుడూ అవుతాడా అర్దంకాదు... ఏంటొ అసలేం జరగబోతోంది  నీ గతం అక్కరలేదు ..నీవు నన్ను మాత్రమే ఇష్టపడాలి నాగురించి మాత్రమే ఆలోచించాలి ...నన్ను కల్సి నాతో మాట్లాడితే మీరు నన్ను వదలరు అంది ఒక్కోసారి సృతిమించకుండా రాసే సరసమైన కవితలు తనకు చాలా ఇష్టం అంది .. అస్సలు ఈ అమ్మాయికి ఏంకావాలి ఏంటో అంతా గందరగోళం ఈపోష్టు పెట్టే సంగతి తనకు తెల్సు తనే పెట్టమంది ..తన గురించి ఎలా రాస్తానో అని ఎదురు చూస్తాను అంది అందుకే రెండు పార్టులుగా పోష్టు పెట్టమనీ తనే చెప్పింది ...పార్కులో తను కల్సిందా ఏంజరిగిందో తెల్సుకోవాలంటే నెక్స్టుపోష్టు చూడాల్సిందే ఏంటీ మీకే ఇంట టెంక్షన్ గా ఉంటే నేను ఎంత టెంక్షన్ పడి ఉంటాను...అందమైన అమ్మాయి అని అందంగా ఫోన్ లో మాట్లాడీ మరీ కావాలని పార్కుకు రమ్మంటే సో మిగిలిన వివరాలు 
Next Post ..Part-2 కోసం వైట్ చేయండి

ఎటు చూసినా నీవే


జ్ఞాపకంగా గుండెల్లో చేరావు


నా గుండె ఏమైంది... ప్రియా


Saturday, May 25, 2013

ప్రాణం తీస్తున్నావు..నీ ద్యానం చేస్తున్నా


నీ పుట్టినరోజు నా ఆసిస్సుకు కావాలి అని అన్నావు ఇప్పుడు గుర్తులేదేమో

ఎందుకు నాలో
నాకు తెలియని ఆరాటం
నీవు దూరం అయిన
క్షనం నుంచి నా మనసు
నాతో చేస్తున్న పోరాటం
నీమనసుకు చేరాలని నిన్నే
తలస్తు రాత్రి ని కాలరాత్రిలా
నన్ను నేను కోల్ఫోతున్న
క్షనాలను ఎన్నన్ని లెక్కబెట్టు కోను

నీకు దగ్గరౌదామన్న
ప్రతిసారి మనం విడిపోయిన క్షనాలు గుర్తుకొచ్చి
నీ ఆనందానికి నేను అడ్డు కాకూడదని
నన్ను నేనూ శిక్షించుకొంటూ
నానో నేను ఎంత నలిగిపోతున్నానో తెలుసా
తెలుసుకోవలనుకుంటే
నాకు దూరం కావు కాలేవు

ఎవరికోసమో నీవేడిన క్షనం
ఎవరికోసమో నా మనస్సుకు
భాదపెట్టిన క్షనం తలచుకొని
భాద పడని క్షనం లేదంటే నమ్ముతావా

నోకోసం ఎవరో .. ఏవరికోసమో నీవు
రాసుకున్న పదాలు నన్ను గుండెళ్ళో గుచ్చే కత్తుల్లా
ఎంత భాదపెడుతున్నాయో నీకేం తెల్సు లే ప్రియా

నీకు చెప్పాలనుకున్నా వినేందుకు సిద్దంగాలేవు
ఎందుకంటే నావిషయం లో నీ మనస్సు విరిగిందికదా

నాజీవితంలో మరివని ఒకే ఒక వాక్యిం
నీ పుట్టినరోజు నా ఆసిస్సుకు కావాలి అని అన్నావు

ఇప్పుడు గుర్తులేదేమో..
నీ చుట్టూ అంతమంది ఉంటే నేనెందుకు గుర్తువస్తాను
నా పిచ్చిగాని "అ"ప్పటి మనిషివికాదునీవు
నిన్ను నీవు గుర్తుపట్టలేనతగా మారిపోయావు

ఈ మార్పు నీజీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తుంది
ఇప్పుడు తెలీదు ..దెబ్బతగిలినరోజు
ఈమాటలు గుర్తొస్తాయి చూడు
గుర్తుందా ప్రియా ఆరోజులు మల్లీ వస్తాయా
మనసులో అన్ని మాటలు చెప్పుకున్నాం
నాలో నేను అన్నీ నీకు
తెల్సిన నీజాలు ఎవ్వరికి తెలియవు
తెలుసుకొవలనుకున్నా నేను చెప్పను ..
నన్ను తెల్సుకోవాల్ని ఎవ్వరు ట్రై చేసినా

అయినా నీమనస్సుకో
అప్పటి నేను లేను కదా
ఇప్ప్డుడు నిన్ను తలచుకొని
ఆరోజుకు గుర్తుకు తెచ్చుకొని భాద పడటం తప్ప

నా ఊపిరి ఏమైంది..చెప్పవా


కలలాంటి నిజంలోనో


Friday, May 24, 2013

మదినిండా విరగబూసిన జ్ఞాపకాలు

మదినిండా విరగబూసిన జ్ఞాపకాలు
మెడన వేసుకుని ఎప్పటిలానే..
ఆకాశంవైపు ఆత్రంగా చూస్తున్నా "జాబిల్లి" కోసం
కానరాని కలలు పరిచిన ఈ చిమ్మ చీకట్లో
విరిగి చెదిరిన ఆశల తునకల మద్యి
జ్ఞాపకాలను ఏరి తిరిగి సమ కూర్చకోలేక ..
నీవు మన ఇద్దరి మద్యా ఉన్న బంధాలు త్రుంచి,
నాకు చేసిన ఘోర అవమానానికి
వేడి నిట్టూర్పుల మద్యి ఈ రాత్రి ముగిసేనా
నన్ను తెలవారుజాము నన్ను దరిచేరేనా ప్రియా

నా కన్నీటి బరువు నీ మనస్సుకు తెల్సు


మృత్యువు పిలుస్తోంది నేస్తం...


నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమే.....

నీ కోసం ఆలోచించే ప్రతి నిమిషం
నా మనసు ఊహలను రెక్కలుగా చేసుకొని విహరిస్తుంది
కాని మరుక్షణం కళ్ళు మాత్రం నీకోసం వెతుకుతాయి
ఊహలను చూడలేను నిజాలను తప్ప,అందుకే  అది కన్నీరు పెడుతుంది
ఎందరున్నా  ఎందుకో నా మనసు నిన్నే కోరుకుంటుంది
నీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడక
నిరాశతో కన్నీరు కారుస్తోంది ఆవేదనతో
ఆ వెచ్చని కన్నీళ్ళ మాటున ఎంత వేదన దాగిఉందో నీకు తెలియదా?
నేను నీతో మాట్లాడాలంటే, నా మనసు మూగబోతుంది
నువ్వు నాతో మాట్లాడితే, నా మాట మౌనమవుతోంది
నీకు నాకు మధ్య శబ్దం....ఎప్పుడు నిశ్శబ్దమే.....
ఆ నిస్సబ్దాన్ని చేదిస్తావని ఆశతో ఉన్నా
ఇన్నాళ్ళు కాని ఆశ తీరేలా లేదు
కేవలం ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం మాత్రమే...

వాడు సార్దక నామదేయుడంట నాకు తెల్సేలా చేస్తు గుండెను పగులకొడుతున్నాడు


కనపడని నా కన్నీటి సాక్షిగా...?


గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,

గడిచిపొతున్న గడియలన్ని
జ్ఞాపకాల మాలలవుతున్నాయి,
నా మనసులొ ఒక్కొకటిగా
గుచ్ఛుకుంటున్నాయి,
ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను
చేరుకోవాలని ఆరాట పడుతున్నాయి
నీవు వాటిని కావాలని అవమానిస్తున్నావు
నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను
ఇలా ఎదురు పడి అవమానిస్తావని తెలీని పిచ్చిమనస్సు
అన్ని నిజం అని నమ్మి మోసపోయింది 

నిన్నే నమ్మిన పిచ్చి మనస్సు
అంతలా నమ్మించి ఎదురు పడి
ఎవరికోసమో అవమానిస్తుంటే
అ మనస్సు పడే వేదని ఇప్పుడు తెలీదు
తెల్సుకునే రోజు మాత్రం వస్తుందిలే 
నా పిచ్చిగాని ...ఇంకా మారతావని
అప్పటి "ఆ" మనిషివి కాదని తెల్సీ
ఇంకా నీకోసం ఆరాట పడుతుంది మనస్సు 

అప్పుడు అన్నీ నిజం అనేలా ఎంత బాగా నటించావో కదా  ...?

ఇలా అయితే గాని నీకు సంతోషం అనుకుంటా


ఒక ప్రేమికున్ని ,,,కేవలం ప్రేమకే దాసున్ని

నిన్నే స్మరిస్తూ ,,,సదా నిన్నే తలుస్తూ ,,,,
నీ ,,,,ప్రాణం....నిన్ను గుర్తు చేసుకుంటుంది
కవ్వించిన ఆ కన్నులతోనే కడకు 
నా కన్నులలో కన్నీళ్లను కూడా హరింపజేసి
ఖాళీ కట్టెను మిగిల్చి నాకు దూరంగా కనుమరుగయ్యావు ,,,,,........
ఇది నేకు న్యాయమా ,,ఆ దేవునికి ధర్మమా ?
మా ప్రేమను చూసి విధికి వశం కాలేదేమో ,,,
నా ప్రాణాన్ని తీసుకుంటుందేమో గాని
కానీ నా ప్రేమను తీసుకోలేదు ,,,
దానికి అంత ధైర్యం లేదు .....
నాకు ఇంకా భరించే శక్తి లేదు ,,,,
అందుకే నేను విధి వన్చికున్నికాదు ...
వీధిన పడ్డ చెత్త కాగితాన్ని కాదు ,,,
ఒక ప్రేమికున్ని ,,,కేవలం ప్రేమకే దాసున్ని

ఈ మంచి మనిషి చెప్పిన పచ్చి అబద్దం ఇది

ప్రేమంటే గుండెను మెత్తగా తాకే శ్వాస,
హృదయంలోని వింత ఘోష,
అర్థంకాని కన్నుల భాష,
ఒక్కసారి పుట్టిందా,
విడిపోయేది చావుతోనే,
ఒక్కసారి తట్టిందా,
మురిసేది ఇష్టమైన జతతోనే

నా గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు

ప్రియా నీ జ్ఞాపకాల ప్రవాహం..
నా గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
వెలుగులు నింపుతూనే వుంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను పంపించలేను
మది అంధకారం చేసుకోలేను
కాని నీవే నన్ను కాదని దూరంగా ఉంటున్నావు
ప్రియా ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
ఒక్కోసారి నాలో నేను నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు ప్రియా
ప్రియామది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో నా ఆత్మీయ నేస్తమా….. నిన్ను
గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో...
అంటూ నీ చల్లని పిలుపుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా
దుక్కంలో నిన్ను దూరం చేసుకుంటున్నానో ..
బాదల్లో బందీగా మార్చుకున్నానో తెలియడం లేదు ప్రియా
నీవు గుర్తిచ్చిన ప్రతినిమిషం కర్సవుతున్న కన్నీటీ సాక్షిగా
నన్నోడీస్తావు .. నన్నూరడిస్తావో అని ఎదురు చూస్తున్నా ప్రియా

Thursday, May 23, 2013

ఆకాశంలో మెరుస్తున్న అందమైన కళ్ళు నీవేనా


.ఈ అందమైన భావాలు ఓ అచ్చమైన తెలుగింటి అమ్మాయివి.




నా అరచేతి రేఖారాతలని నిందించి లాభమేమి?
నాతో పరిచయం ఎందుకని అడిగి లాభమేమి?
నా నుదిటిరాతలో లేని నీకై శోధించి లాభమేమి?


భావాలెన్నో బదుల్లేని ప్రశ్నలుగా మిగిలాయి!
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!

ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.
Note :- http://telugammaye.blogspot.in/..ఈ అందమైన భావాలు ఓ అచ్చమైన తెలుగింటి అమ్మాయివి  తన బ్లాగ్ చూస్తే మీకే అర్దం అవుతుంది
!
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!

ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.
Note :- http://telugammaye.blogspot.in/..ఈ అందమైన భావాలు ఓ అచ్చమైన తెలుగింటి అమ్మాయివి  తన బ్లాగ్ చూస్తే మీకే అర్దం అవుతుంది

నిజంగా నానీడవా నీవు


ఇలా ఎందుకు చేస్తారో ..?


గుండె బద్దలు చేస్తావనా ఇన్నాళ్ళు ఎదురు చూసింది

నువ్వు పంచిన స్వప్నాలు
రవి కిరణాలు తాకి కరిగిపొయాయి
నువ్వు పరిచయం చేసిన సంతోషం
నా కన్నీలను చూసి దరి చేరనంటుంది
నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు
నీ యెడబాటులో కలవరపెడుతునయి
నువ్వు నడిపించిన తీరం అంతా
వెక్కిరిస్తుంది నా ఒంటరితనాని చూసి
నిన్ను ప్రేమించిన నా మనసు ప్రశ్నిస్తుంది
గుండె బద్దలు చేస్తావనా ఇన్నాళ్ళు ఎదురు చూసింది

గల..గల మాట్లాడే కోయిల ఎందుకు మూగబోయిందో

గల..గల మాట్లాడే కోయిల ఎందుకు మూగబోయిందో
ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?
ఎంజరిగింది మిత్రమా నేరమా .. అపచారమా..గ్రహచారమా..?
మనసులోని భావాలు ..బయటకు రావడం లేదా..కారణం..?
ఏమన్నా ఏమనుకున్నా సర్దుకుపోవాలన్న నీవే...దూరంగా ఎందుకో..?
కోయిల గొంతు కోటిరాగాలు ఇక వినలేనేమో అనిపిస్తుది..ఎందుకంటే..
ఏరుతువులో రాగాలొస్తాయి..ఎదురుచూపులో కాలం కరిగిపోతోంది
మౌనంలో క్రోదం కనిపిస్తోంది ..ఇక కోపం తగ్గదా..అవకాశం లేదేమో..?
మనసా మౌనం వీడవా..ఎన్నాళ్ళీ మౌనం..మరుజన్మదాకా ఎంటీ మిత్రమా
కాలాన్ని కరిగిస్తూ..మౌనం ఎన్నాళ్ళో తెలీదు..కష్టంగా ఉంది చెప్పేందుకు
మిత్రమా చూశావా నేను చెప్పాను అదే జరిగింది అదే నీవూ చేస్తున్నావు..?
మౌనంలో ఎన్ని అర్దాలని వెతకను..ప్రతినిమిషం ఎన్నిసార్లు వెతికినా ఏందొరకలేదు
చేసేదేం లేదు మౌనం వీడే రోజుకోసం చకొర పక్షిలా ఎదురు చూడటం లేదంటే.
ఇలాగే నీ మౌనంవీడే రోజు కోసం ఎదురు చూడటం తప్ప....
కాలం ప్రతిసారి కసి తీర్చుకుంటుంది అంటే ఇదేనేమో కదా మిత్రమా

నిజం నిర్బయం అబయం..అన్నీ ఏమయ్యాయో..ఎమైంది.

Wednesday, May 22, 2013

నీ జ్ఞాపకాలు జారిపడి శిధిలం అయ్యాను


నీవు ఇప్పుడు మారిపోయావు...?


నీవేగా చెప్పావు ..ఎందుకు మాటమార్చావు


సముద్రమంత విశాల హృదయం నీది


ఆనందంలోనూ
ఆక్రోశంలోనూ..
చీకట్లో నను కౌగిలించుకొని
నీలోకలిపేసి నా జ్ఞాపకాల సాక్షిగా
వెలుగులో నా తోడుంటూ..
ఏకాంతంలోనూ నాతోనే ఉంటూ..
నా నీడను గుర్తు చేస్తావు
గుండెలు పగిలి, మనసు విరిగిపోయి
నోరు తడారిన తరుణంలోనూ..
నా మూగ బాధకు భాష్యం చెపుతూ..
సముద్రమంత విశాల హృదయం నీది
పసిపాపలా నిర్మలమయిన స్థితి,
నీది పుష్పమంత సున్నితమైన స్పర్శ,
అనురాగ మూర్తివి, అందాల రాసివి ..
ఇన్నీ ఉన్నా జాలిలేకుండా ఉన్నావెందుకు
అని నిలదీసి అడగాలని ఉన్నానిన్ను అడుగలేను

నా లో శ్వాస వై నన్ను నడిపించే ప్రాణానివి నువ్వు

కలను తప్ప
రంగే ఎరుగని నేను,
కన్న ప్రతికలనుండీ,
తను కోరిన రంగులు
రంగరిస్తూ వచ్చాను..
అందుకే గాబోలు నాకు
సూన్యాన్ని బహుమతిగా ఇచ్చావు


ప్రియా
నా గుండె చప్పుడుకి అర్ధం నువ్వు ,
నా మౌనం లోని సంగీతం నువ్వు ,
నా ఆశ కు ఉపిరి నువ్వు ,
పడి లేచే కెరటాల నా మనసుకు ఓదార్పు నువ్వు ,
నా జీవితం లో నువ్వు ఎంత ముఖ్యం అంటే
నా లో శ్వాస వై నన్ను నడిపించే ప్రాణానివి నువ్వు  




జారిపోయిన గతం ఒక మధురమైన జ్ఞాపకమైంది నీవు దూరం అయి

దివిలో సూర్యుని వెచ్చదనానికి విరిసిన
కమలం వంటి నీ నవ్వు
పౌర్ణమిలో చందమామ వంటి నీ మోము
మల్లె కన్నా అందమైననీ మనసు
సాహిత్యంలోని మధురమైన సంగీతం నీ స్నేహం
జారిపోయిన గతం ఒక మధురమైన

జ్ఞాపకమైంది నీవు దూరం అయి

 ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం నీకోసం

దేనికోసమో వెదికే కళ్ళకు ఏమి చెప్పను ?

గత అనుభవాల శిధిలాలనూ,
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..సాగుతూ
అనుబంధాలు అణచి మొలిచిన
అవమానపు  వృక్షాల మధ్యగా..

ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?

ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం  నీకోసం

ఇప్పుడు నీవు అందాల "జాబిల్లివి " కాదు


Tuesday, May 21, 2013

నీ పరిచయం నేను ప్రతిక్షనం మరణించేలా చేస్తుంది ప్రియా


నన్నేందుకు ఇంత అదృష్టవంతున్ని చేశావు


నీవు చేసిన అవమానాలకు నీకో బహుమతి


నేను పూర్తిగా తగలబడిందాకా నిద్రపోవేమో..


నిశ్శబ్దం బద్దలయితే

నిశ్శబ్దం బద్దలయితే
నీవిచ్చిన మౌనంలో
ఆ ముక్కలేరుకోవడమే
ఒక్కోసారి సుఖమనిపిస్తుంది...

ముందుకొచ్చిన మౌనంతో
కలిసి మధన పడేకంటే
నిట్టూర్పులతో కలిపి ప్రాణాన్ని
వదలడమే సుఖమనిపిస్తుంది

నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు


నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.

నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా 

రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.

జాలిలేని నీ హృదయాన్ని 

యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి 

యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.

ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ

నువ్వు నాతో లేని క్షణం""
నా నుంచి సంతోషం వేరవుతుంది 
నువ్వు దూరమైనంత తేలికగా...
" ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు 
ఒకేసారి బావుర్మన్నాయి 
ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు అవ్యక్తమయ్యాయి..
ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి 
మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది" 
ఏమీ తోచని నేను ఆత్మహత్యను అన్వేషిస్తూ 
బ్రతుకు దారుల్లో పరిభ్రమిస్తూ, భ్రమిస్తూ 
కన్నీళ్ళ ప్రక్కదారుల్లోకి జారిపోతున్నా..
ప్రేమ సాగరానికి దూరంగా, 
అభిముఖంగా ప్రవహిస్తున్నా! 
ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై 
ఉనికిని ప్రశ్నిస్తే వెనుతిరిగా.......... 
అప్పుడే తెలిసింది "నువ్వు నాతొలేవు.

కడకన్నీటి వీడ్కోలు వరకు నీ స్నేహనే కా0క్షిస్తాను

ప్రేమ గా చెరువైయ్యావు , 
ప్రేమించి దురమైయ్యావు ,
శ్వాసగా కలిసిపో
య్యావు,
ఆశ గా మిగిలిపోయ్యావు,
బాటసారిగా కలిశావు,నేస్తమై నిలిచావు,
ఆనందంగా వెంట వచ్చావు,

బాధనే మిగిల్చావు ప్రియా  
నీ ప్రేమ చేసిన గాయానికి 
రాలిన పువ్వుగా ఎండిపోతున్న ,
నా ప్రేమను గుర్తించలేక నువ్వు 

మొగ్గగా ఉండిపోయావా,
వీడుకోలు అంటు వెళ్ళిపోతున్నావా
వీడని జ్ఞాపకాలని విడిచి ,
మిగిలిన జీవితం నా యదను 

తొలిచిన గాయాన్ని మరిపించినా ,
తోలి ప్రేమవైన నిన్ను మరువగలదా 

సమాదానం చెప్పు ప్రియా 
విడిచినా వదలలేక
మరువాలన్న మరువరాక
కదలని కాలాన్ని
గడిపిన స్మృతులను
శాశించే వరం నాకుంటే
ఎడారి ఎండమావిల సాగబోయే జీవితాని
నీ స్నేహ సంద్రంలో నీటి బొట్టునై 

నీలో కలిసిపోత
కరగని మంచునై
కడకన్నీటి వీడ్కోలు వరకు నీ స్నేహనే కా0క్షిస్తాను
 

Monday, May 20, 2013

నీ కన్నీటి నుండి బయటకి రానివ్వను ప్రియా

నువ్వు దూరం అయినప్పుడు 
కన్నీళ్ళు ఆగనంటున్నాయి
కాని నాకు నేను  దూరమవుతున్నప్పుడు 
నీ కళ్ళలో కన్నీరు నేను చూసినప్పుడు
నాకోసం బాధపడే ఒక మనసుందని తెలిసినప్పుడు
ఎలా నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యగలను
నీ బాధలో నా మీద ప్రేమను చూసుకున్నాను
చాలు నాకోసం నువ్వు జార్చిన
ఒక్క కన్నీటిబొట్టు చాలు
నీ కన్నీటి నుండి బయటకి రానివ్వను ప్రియా

నేనొక ప్రేమ పిపాసిని .. నీవొక ఆశ్రమ వాసివి ..

 నేనొక ప్రేమ పిపాసిని ..
నీవొక ఆశ్రమ వాసివి ..
నా దాహం తీరనిది..
నీ హృదయం కదలనిది.. "నేనొక "

చరణం :
తలుపులు మూసినా తల వాకిటనే
పగలూ రేయి నిలుచున్నా ..
పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్న.. "తలుపులు "
నా దాహం తీరనది ..
నీ హృదయం కరగనిది..
నేనొక ప్రేమ పిపాసిని ..

చరణం :
పూట పూట నీ పూజ కోసమని
పూవులు తెచ్చాను..
ప్రేమ భిక్షను పెట్టగలవని
దోసిలి ఒగ్గాను ..
నీ అడుగులకు మడుగులొత్తగా
ఎడదను పరిచాను..
నీవు రాకనే అడుగు పడకనే
నలిగి పోయాను ..
నేనొక ప్రేమ పిపాసిని ..

చరణం :
పగటికి రేయి రేయికి పగలూ  పలికే వీడ్కోలు ..
సెగ రేగిన గుండెకు చెబుతున్న
నే చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో
నన్నేపుడో చూస్తావు ..
నను వలచావని తెలిపే లోగా
నివురై పోతాను..
నేనొక ప్రేమ పిపాసిని ..






దూరం అవుతున్న జ్ఞాపకాలు.. మనసులోంచి జారిపోతున్నాయి..

దూరం అవుతున్న జ్ఞాపకాలు..
మనసులోంచి జారిపోతున్నాయి..
దూరం అవుతున్నాయి ఆత్రంగా పట్టు కోబోతే
మళ్ళీ జారిపోతున్నాయి..
ఇంకా దూరం ఔతున్నాయి జారి పోయిన జ్ఞపకాలను
పట్టుకోలేని..తిరిరాలేవని తెల్సినా..
అప్పుడప్పుడు చేస్తున్న పిచ్చి ప్రయత్నాలతో
ఉన్న కొన్ని జ్ఞాపకాలు జారిపోతున్నాయి
కాని ఇప్పుడు అర్దం అయింది 

గడచి పోయిన జ్ఞాపకాలు
తిరిగిరావు రాబోయిన ఆక్షనాల్ని పోగొట్టుకున్ననని అలస్యింగా తెల్సుకున్నాను

నీ మౌనంతో నా మనస్సు మూగదయ్యింది ...

నీ ప్రేమకు సాక్ష్యం
ఈ నా గుండే చప్పుడు
నీవు లేకుండా తను
బ్రతకలనే అశ కోల్పోయింది ...
అలుపు లేని కన్నీటికి సాక్ష్యిం నీ ప్రేమ ...
నీ మౌనంతో నా మనస్సు మూగదయ్యింది ...
ఈ క్షణం కాకపోయిన నా చివరి క్షణంకైనా
నువ్వు వస్తావని వేచి ఉంటాను చెలి 


గుండెలో దాచుకొన్న నీ రూపం
నా గుండెకే గాయాన్ని చేసినా..
కళ్ళల్లో దాచుకొన్న
నీ అందం నాకు
కంటి చెమ్మనే బదులిచ్చినా
ఇక్కడ నీవులేక నేను
నీతలపులతో ఇలా బ్రతికేస్తున్నా ప్రియా

నీ ఏడబాటు లో


నేను ఒంటరిగా పుట్టలేదు


ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగబాధ ఎందాక దాచేను

పాట విన్నుతసేపూ ఏదో తెలియని తియ్యని భాద...మహ్మద్ రఫీ గొంతులో పలిగిన రాగాలు పాట విన్న ప్రతిసారి మనసులో గిలిగింతలు పెడుతూనే ఉటాయి పాటకు తగ్గ సాహిత్యం అనిపిస్తుంది..." ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది" ఈ పదాల అమరిక చూడండి ఎంత భావుకత్వం ఉందో పొందితే ఇలాంటి ప్రేమను పొందాలి లేదంటే చచ్చిపోవాంలని పిస్తుంది ఇంతటి ప్రేమను గుండెల్లో ఉంచుకునే ప్రేమికులు ఉన్నారా ఈరొజు నీవు రేపు మరొకరు అని వాళ్ళే కదా కడదాకా గుర్తుంచు కునే అద్బుతమైన స్నేహం కావాలి అలా ఎలా ఉంటారో అనిపిస్తుంది అదేకదా ప్రేమ విలువ ఇష్టపడ్డ మనిషిని ఒక్కమాట అనరు కాని అవమానించే స్నేహితులు ఉంటే .. ఎవ్వరికోసమో అవమానిస్తున్న స్నేహితుల్ని పోంది అవమానాల పాలౌతూ ఎన్నాల్లు భాదపడాలి ఈ పాటలో పదాల్లాంటి అద్బుతమైన స్నేహం కావాలి ఉందా ఈ భూ ప్రపంచం లో...

 
ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై

చరణం : 1
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై

చరణం : 2
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది
గానమై వేణు గానమై నా ప్రాణమై

 


ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.

నువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.
ఒక్కసారిగా నువ్వు నా నుండి దూరం కావు.
మెల్లగా, మెల్లగా నా శ్వాసను ఆపుతూ దూరం అవుతావు.
అది ఎలాగో తెలుసా?
నా శరీర బాగంలో కలిసిన నువ్వు,
నా నుండి ఒక్కోరేకుగా విడిపోతున్నప్పుడు,
నేను ఎంత వేదన పడుతున్నానో నీకు తెలుసా?
ఆ భాదను చెప్పడానికి మౌన బావాన్నే ఎంచుకున్నాను.
ఎందుకంటే బాధ అనుభవింవే వారికే తెలుసు  ఆ నరకం.
మాటలకు అందనిది ఆ చేదు క్షణాలు.
అయినా! నువ్వంటే నాకు ప్రాణం.
నువ్వు నాతొ ఉన్నంతవరకు ప్రతిక్షణం నాకు సంతోషం.
నువ్వు నానుండి విడిపోయిన వెంటనే 

నా జీవితము అంతిమ దశకు చేరుకుంది .
నువ్వు ఎప్పటికి నాతొ వుండాలని ఆ దేవుడిని వరం అడిగాను.
అందుకు ఆ దేవుడు నాతో ఇలా అన్నాడు.
నేను బందాలు ఇస్తాను కాని అవి శాశ్వతంగా ఇవ్వను.
అలా ఇస్తే బందాల విలువ మరిచిపోతారు
అది నిజమే నువ్వు ఉన్నంతవరకు నీ విలువ తెలియలేదు.
నువ్వు నానుండి దూరం అయిన తరువాతే నీ విలువ నాకు తెలిసింది.

నీ ప్రేమ తిరస్కారంతొ నా గుండె పగిలింది

నీ మాటల చినుకులతొ నా హ్రుదయం తడిసింది
నీ చూపుల కాంతితొ నా గుండెలొ మెరుపు మెరిసింది
నీ నవ్వుల "జాబిల్లితొ" నా మనసులొ "వెన్నెల" కురిసింది
నీ తియ్యని మాటలు నీవున్నా అంటూ ఇచ్చినదైర్యం
నీ అనురాగ,ఆప్యాయలతొ నా మనసు కరిగిందినీ ప్రేమ తిరస్కారంతొ నా గుండె పగిలింది
నీ ప్రేమ మత్తుతొ నా జీవితం సర్వం ముగిసింది

Sunday, May 19, 2013

నీ అందమైన పెదవుల మద్యి నలిగిన నిజాలనూ..

నీ తియ్యని మాటల గారడీలో
నీ అందమైన పెదవుల
మద్యి నలిగిన నిజాలనూ..
ఎదురు చూసిన కను రెప్పల వెనుక
ఆవిరయిన ఆశ క్షణాలనూ..
నీకోసం ఇప్పటి ఎదురు చూస్తూ
నలిగిపోయిన క్షనాలను
ఎన్నని లెక్కబెట్టుకోను
నా భాద ఎవరికి చెప్పుకోను ప్రియా

ఓ ప్రియా..ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది

ఓ ప్రియా..ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ

సఖియా..
నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే

ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ



నీ జ్ఞాపకాలు కందిరీగల్లా కమ్ముకున్నాయి

నిన్నకి నేటికి మధ్య
ఇరుకుసందులో, ఒదిగిన పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
నీ కను రెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
నీ జ్ఞాపకాలు కందిరీగల్లా కమ్ముకున్నాయి
గుండెను చిల్లులు పడేలా కుట్టేస్తున్నాయి


కనుల కొలను కొలుకుల్లో పూసిన
నీ చిరునవ్వుల  ముత్యాల కలువలు,
నీ చెక్కిళ్ళు కూర్చిన కలల పంటై
కళ్ళలో  దాగని కన్నీరు ధారల దారాల్లో
ఇమడక, జారి, నీ పెదవి విరుపుల్లో
 కరిగి మాయమవుతున్నాయి ప్రియా
విధి విసిరిన వేగానికి రెక్కలు
విరిగిన మనసు, నీకోపాన్ని అడ్డుకోలేక
నా మనస్సుకు అధారమవలేక, అలసి
సొలసి నీకోసం అవేదనగా నీరీక్షిస్తున్నా ప్రియా

"మానిన గాయాల్ని" రేపడం నీకు అలవాటేమో కదా

"మానిన గాయాల్ని" రేపడం
నీకు అలవాటేమో కదా
నీవూ లేని రోజులు గడుపుతూ
ఒంటరి క్షణాలని తోడు రమ్మంటూ
గుండెనిండిన నీ తలపుతో నిన్నే తలస్తూ
నీతో కొత్త జీవితం కై పోరాడుతున్నాను
జరగని నిజాలకై పరితపిస్తూ 

నీకోసం ఎదురు చూస్తున్నా

ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక
నాకు ఏ కోశానా లేదు.. అది ఎందుకో
నీకు అర్ధమవ్వాలనీ లేదు.

అర్దం చేసుకునే మనస్సు నీకిప్పుడు లేదేమో కదా 

మది పుస్తకం ప్రతి పేజే లో నీవే


Saturday, May 18, 2013

మనసు గదిలో స్థబ్దతగా ఉన్నా హృదయాంతరాలలో మాత్రం విస్పొటాలు

జీవితపు డైరీలోని
నల్లని పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ అడుగుతున్నాయి

అపరాధ భావాలన అంతర్మధనంతో
కన్నీళ్ళతో జరిగిన గతాన్ని తడుపుకొంటూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా

మనసు గదిలో స్థబ్దతగా ఉన్నా
హృదయాంతరాలలో మాత్రం విస్పొటాలు
ముగింపు లేని ఈ సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం ఎదురు చూస్తున్నా
విజయం సాదించలేనని తెల్సీ కూడా
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని

నీ జ్ఞాపకాల కోటలో నన్ను బంధించి వెళ్లిపోయావు

కలలా నను కలిసావు..నా జీవితంలోకి వచ్చావు
కలవరమై నా మనసులో మిగిలిపోయావ్ పోయావు..
కనుమూసి తెరిచేలోగా కన్నీరై కరిగిపోయావు..
కల కాదు నిజమిది చూడమంటూ.. 

నా కనులు తెరిపించి వెళ్లిపోయావు..
నిను వలచిన నన్ను విడిచి వెళ్లి పోయావు.

మునుపెన్నడూ తెలియదు నాకు ఈ ఆవేదన...
ప్రేమంటే ప్రేమించటమే అనుకున్నాను..
ప్రేమించబడటం కూడా ఉంటుందని 

నన్ను వదిలి నాకు తెలిపావు
కన్నీటిని నాకు తోడుగా ఉంచి.. 

నీ జ్ఞాపకాల కోటలో నన్ను బంధించి వెళ్లిపోయావు..